Pawan Kalyan Trivikram : ఆడుకునే వాళ్ళని, వాడుకునే వాళ్ళని అంటిపెట్టుకోకు.. పవన్ త్రివిక్రమ్‌పై బండ్ల గణేష్‌ ట్వీట్లు?

Bandla Ganesh Indirect Satires బండ్ల గణేష్ ప్రస్తుతం ట్విట్టర్‌లో వరుసగా ట్వీట్లు వేస్తూ ఉన్నాడు. రోజూ ఏదో ఒక కొటేషన్‌ను షేర్ చేస్తూ అందరి నోళ్లలో నానుతుంటాడు. ఇప్పుడు ఆయన వేసిన ట్వీట్లు చూస్తుంటే పవన్ కళ్యాణ్‌ త్రివిక్రమ్ మీద సెటైర్లు వేసినట్టుగా అనిపిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2023, 11:11 PM IST
  • నెట్టింట్లో బండ్ల గణేష్ ట్వీట్ల వర్షం
  • పవన్ కళ్యాణ్‌ త్రివిక్రమ్‌లపై కామెంట్స్‌?
  • వాడుకునే వాళ్లని అంటి పెట్టుకోకు!
Pawan Kalyan Trivikram : ఆడుకునే వాళ్ళని, వాడుకునే వాళ్ళని అంటిపెట్టుకోకు.. పవన్ త్రివిక్రమ్‌పై బండ్ల గణేష్‌ ట్వీట్లు?

Bandla Ganesh Indirect Satires బండ్ల గణేష్‌ సోషల్ మీడియాలో వేసే ట్వీట్లతో ఎప్పుడూ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తాడు. అది ఎవరిని ఉద్దేశించి చేశాడు.. ఎందుకు చేశాడు.. దాని అంతరార్థం ఏంటి? అనేది ఎవ్వరికీ అంతు చిక్కదు. అలా బండ్ల గణేష్‌ వేసే ట్వీట్ల మీద చర్చలు జరుగుతుంటాయి. ఇక బండ్ల గణేష్‌ త్రివిక్రమ్ మధ్య చిచ్చు రగిలిన సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ ఈవెంట్‌కు బండ్ల గణేష్‌ను పిలవలేదట. అందుకు కారణం త్రివిక్రమ్ అంట. ఈ మేరకు బండ్ల గణేష్ ఆడియో ఒకటి నెట్టింట్లో లీకైన సంగతి తెలిసిందే.

అలా త్రివిక్రమ్‌కు బండ్ల గణేష్‌కు మధ్య గ్యాప్ ఏర్పడిన విషయం బయటకు వచ్చింది. ఆ ఘటనతోనే బండ్ల గణేష్‌కు పవన్ కళ్యాణ్‌కు కూడా గ్యాప్ వచ్చిందని అంతా అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్‌లో పవన్ కళ్యాణ్‌ కొన్ని కామెంట్లు చేశాడు.

 

గబ్బర్ సింగ్ రెమ్యూనరేషన్ విషయంలో అతను (బండ్ల గణేష్‌) అనుకున్నంత ఇచ్చాడు.. కానీ నేను అనుకున్నంతగా ఇవ్వలేదు అంటూ పవన్ కళ్యాణ్‌ కామెంట్ చేశాడు. దీని మీద పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ భిన్న రకాలుగా స్పందించారు. బండ్ల గణేష్‌ను తిట్టేశారు. నా విశ్వరూపం చూపిస్తా అన్నట్టుగా బండ్ల గణేష్ కామెంట్ చేశాడు. కానీ తాను ఎప్పటికీ పవన్ కళ్యాణ్‌ భక్తుడినే అన్నట్టుగా మళ్లీ ట్వీట్ వేశాడు బండ్ల గణేష్‌.

కానీ తాజాగా బండ్ల గణేష్‌ ట్వీట్ చూస్తుంటే.. అది పవన్ కళ్యాణ్‌ త్రివిక్రమ్‌లను ఉద్దేశించి మాట్లాడినట్టుగా అనిపిస్తోంది. 'కాలం, పరిస్థితులు ఏ క్షణంలోనైనా తరుమారైపోతాయి.. జీవితంలో ఎవర్నీ తగ్గించి మాట్లాడకూడదు.. ఎవర్నీ బాధించకూడదు.. ఇవాళ నువ్వు శక్తిమంతంగా ఉండొచ్చు. కానీ "కాలం" నీ కన్నా.. శక్తివంతమైనదని గుర్తుంచుకో

కాబట్టి మంచితనంతో ఉండాలి. మంచి మనసుతో ఆలోచించాలి.. ప్రాణమిచ్చే వాడిని పోగొట్టుకోకు.. అవసరము కోసం ఆడుకునే వాళ్ళని, వాడుకునే వాళ్ళని అంటిపెట్టుకోకు.. జీవితం మళ్ళీ మళ్ళీ రాదు.. ఒకేసారి వస్తుంది.. దానిని అద్భుతంగా వాడుకో' అని బండ్ల గణేష్‌ ట్వీట్ వేశాడు. 

Also Read:  Sreeleela Latest Photos : శ్రీలీల.. పెడుతోంది గుండెల్లో గోల.. చూస్తే తట్టుకోలేరంతే

Also Read: SSMB 28 Look : మహేష్‌ బాబు లెటెస్ట్ లుక్.. మరింత తగ్గిపోయాడే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News