Razakar Hindi Trailer Review: తెలుగు సహా వివిధ భాషల్లో నిజ జీవిత గాథలతో పాటు చరిత్రలో జరిగిన సంఘటల ఆధారంగా పలు చిత్రాలు వస్తున్నాయి. ఈ కోవలో వచ్చని చిత్రం 'రాజాకార్'. 1947లో బ్రిటిష్ వాళ్లు వెళుతు వెళతూ.. దేశాన్ని భారత్, పాకిస్థాన్ అంటూ రెండు దేశాలుగా విభజించి మనకు స్వాతంత్య్రం ఇచ్చారు. అప్పటికే దేశంలో 500పైగా స్వతంత్ర్య సంస్థనాలు వాళ్ల ఇష్ట ప్రకారం భారత్‌లో కానీ.. పాకిస్థాన్‌లో కానీ.. లేదా విడిగా ఉండొచ్చని ప్రకటన చేసింది. ఇక దేశానికి తొలి హోంమంత్రిగా పనిచేసిన సర్ధార్ వల్లభబాయ్ పటేల్ అత్యంత చాకచక్యంతో దేశంలోని 500 పైగా సంస్థానాధీశులతో మాట్లాడి మన దేశంలో విలీనమయ్యేలా చేసారు. కానీ దేశంలో కశ్మీర్, జునాఘడ్, హైదరాబాద్ సంస్థానలు మన దేశంలో విలీనం కాకుండా మొండి కేసాయి. కానీ స్వాతంత్య్రం వచ్చిన కొన్ని రోజులకే కశ్మీర్ పై పాకిస్థాన్ వాళ్లు అటాక్ చేసారు. అపుడు కశ్మీర్ రాజు మన దేశంలో కలుస్తానని ప్రకటన చేసారు. ఆ తర్వాత జునాఘడ్ కూడా భారత్‌లో విలీనమైంది.
కానీ హైదారబాద్‌ను పరిపాలిస్తోన్న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మాత్రం హైదరాబాద్‌ను పాకిస్థాన్‌లో విలీనం చేస్తానని ప్రకటన చేసారు. అంతేకాదు తన సంస్థానంలో మెజారిటీ ప్రజలుగా ఉన్న హిందువులపై నిజాం ఖాసీం రజ్వీ నేతృత్వంలోని రజాకార్ పేరుతో ఓ ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసారు. వారు ఏ విధంగా ఇక్కడ ప్రజలను హింసించారు. ఇక్కడ ప్రజలు నిజాం ప్రైవేటు సైన్యంపై ఏ రకంగా తిరుగుబాటు చేసారు. అక్కడ జరగుతున్న ఆగడాలను తెలుసుకున్న అప్పటి కేంద్రం హోం మంత్రి సర్ధార్ పటేల్ జే.ఎన్. చౌదరి నేతృత్వంలో హైదరాబాద్ విముక్తి కోసం ఆపరేషన్ పోలో నిర్వహించారు. నిజాం సైన్యం వారిని ఎదుర్కొంటామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. కానీ తీరా సైన్యం హైదరబాద్ పరిసరాల్లో ప్రవేశించే సరికి లొంగిపోయారు. అటు నిజాం కూడా 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టు రేడియోలో ప్రకటించారు. ఇలా హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందింది. ఈ నేపథ్యంలో తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రజలు ఎలా పోరాటం చేసారు. రజకార్ల ఆగడాలను ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో మార్చి 1న ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మరాఠీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
KANGANA RANAUT LAUNCHES ‘RAZAKAR’ *HINDI* TRAILER… 1 MARCH RELEASE… #KanganaRanaut was the guest of honour at the #Hindi trailer launch event of #Razakar in #Mumbai.
The PAN-India film will release in #Telugu, #Hindi, #Tamil, #Kannada, #Malayalam and #Marathi.#Razakar… pic.twitter.com/P71Xh3ARBw
— taran adarsh (@taran_adarsh) February 10, 2024
ఈ చిత్రంలో బాబీ సింహా, వేదిక, అనిష్క త్రిపాఠి, అనసూయ, ఇంద్రజ, మకరంద్ దేశ్‌పాండే నటించారు. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు. గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. అప్పట్లో హైదరాబాద్ అంటే తెలంగాణలో 8 జిల్లాలు ఉండేవి. మహారాష్ట్రలో 5 జిల్లాలు.. కర్ణాటకలోని మూడు జిల్లాలు హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండేవి. మొత్తంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 17 నెలలకు హైదరాబాద్‌కు స్వాతంత్య్రం వచ్చింది. ఇక నిజాం వ్యతిరేక పోరాటంలో హిందువులతో పాటు తురేబాజ్ ఖాన్, షోయబుల్లా ఖాన్ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. మరి చరిత్రలో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన 'రజాకార్' మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.
Also Read: Bir Billing Dog Loyal: కన్నీటి గాథ.. యజమాని బాడీ వద్ద 48 గంటలు కాపలా కాసిన పెంపుడు కుక్క
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook