Snake Fruit Health Benefits: పండు పాములా ఉంటుంది..కానీ శరీరానికి అమృతం

Snake Fruits Health Benefits: ప్రపంచంలో అనేక రకాల పండ్లు ఉన్నాయి. పండ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అనేక వ్యాధులతో పోరాడి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో పండ్లు ఎంతగానో సహాయపడతాయి. కానీ ఈ రోజు మేము స్నేక్‌ ఫ్రూట్‌ గురించి చెప్పబోతున్నాయు. దీని ప్రయోజనాలు మీకు తెలియవు. అయితే ఈ పండు మనకు ఎంతో మేలు చేస్తుంది. ఈ పండును తినడం ద్వారా అనేక రకాల తీవ్రమైన వ్యాధులను దూరం చేసుకోవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 2, 2022, 10:08 AM IST
  • స్నేక్ ఫ్రూట్‌తో ఆరోగ్యానికి అనేక ఉపయోగాలు
  • స్నేక్‌ ఫూట్‌లో అనేక రకాల విటమిన్లు లభ్యం
  • రోగనిరోధక శక్తిని పెంచనున్న స్నేక్ ఫ్రూట్‌
 Snake Fruit Health Benefits: పండు పాములా ఉంటుంది..కానీ శరీరానికి అమృతం

Snake Fruits Health Benefits: ప్రపంచంలో అనేక రకాల పండ్లు ఉన్నాయి. పండ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అనేక వ్యాధులతో పోరాడి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో పండ్లు ఎంతగానో సహాయపడతాయి. కానీ ఈ రోజు మేము స్నేక్‌ ఫ్రూట్‌ గురించి చెప్పబోతున్నాయు. దీని ప్రయోజనాలు మీకు తెలియవు. అయితే ఈ పండు మనకు ఎంతో మేలు చేస్తుంది. ఈ పండును తినడం ద్వారా అనేక రకాల తీవ్రమైన వ్యాధులను దూరం చేసుకోవచ్చు.

స్నేక్‌ ఫ్రూట్‌ తినడం వల్ల మానవ శరీరానికి అవసరమైన అనేక ఉపయోగకరమైన విటమిన్లు లభిస్తాయి. స్నేక్ ఫ్రూట్‌లో విటమిన్‌ సి, ఫైబర్, బీటా కెరోటిన్‌, పాలీఫెనోలిక్, సేంద్రీయ ఆయ్లాలు, కాల్షియం, ఐరన్‌, భాస్వరంతో పాటు అనేక లవణాలు కలిగి ఉంటాయి. స్నేక్‌ ఫ్రూట్‌లో ఉండే టానిన్లు శరీరంలో ఉన్న హానికరమైన పదార్థాలను తొలగించడానికి ఉపయోగపడతాయి. స్నేక్‌ ఫ్రూట్‌ తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు.

స్నేక్ ఫ్రూట్‌
ఈ ప్రత్యేకమైన స్నేక్ ఫ్రూట్‌ను మీరు ఎక్కడో చూసి ఉంటారు..కానీ దాని ప్రయోజనాలు మీకు తెలియవు కాబట్టి దీన్ని తినడం చాలా కష్టం. మనం చెప్పుకుంటున్న పండును స్నేక్ ఫ్రూట్ అంటారు. దీనిని సలాక్ ఫ్రూట్ అని కూడా అంటారు. అయితే స్నేక్ ఫూట్‌ భారత మార్కెట్‌లో లభ్యమవుతుందని వ్యాపారస్తులు చెప్తున్నారు. స్నేక్‌ ఫ్రూట్‌ ప్రధానంగా మెట్రో సిటీలలో లభిస్తోంది.

ఈ పండు ఇండోనేషియాలో పండిస్తారు
స్నేక్ ఫ్రూట్‌ వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పే ముందు, ఈ పండు మీకు ఎక్కడ లభిస్తుందో తెలుసుకోండి. ఈ పండు ముఖ్యంగా ఇండోనేషియాలోని బాలి, లాంబాక్..తైమూర్ ద్వీపాలలో సాగు చేయబడుతుంది,, కానీ మీరు దానిని ఏదైనా సూపర్ మార్కెట్‌లో కొనుగోలు చేయవచ్చు.

పాము చర్మం లాంటిది
ఈ పండు యొక్క ఆకారం లిచీ లాగా ఉంటుంది, దాని లోపల ఒక పెద్ద విత్తనం కూడా ఉంటుంది. ఈ పండు యొక్క పై భాగం పాము చర్మంలా కనిపిస్తుందని, ఇది పండుపై తొక్క, దానిని తీసివేసిన తర్వాత, పండు యొక్క తెల్లటి భాగం వివరించలేని విధంగా తీపిగా ఉంటుంది.

స్నేక్‌ ఫ్రూట్‌ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు 

1. స్నేక్ ఫ్రూట్‌ శరీరం శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
2. కార్బోహైడ్రేట్లు, విటమిన్లు..అనేక రకాల ఖనిజాలు స్నేక్ ఫ్రూట్‌లో ఉంటాయి. ఇది మన శరీరంలో నీటి కొరతను అనుమతించదు.
3. పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్, ఫైబర్, ఫాస్పరస్ రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రిస్తాయి.
4. గర్భిణీ స్త్రీలకు అత్యంత ప్రయోజనకరమైనది.
5. ఇది పిల్లలకు..వృద్ధులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది, ఇది జ్ఞాపకశక్తిని బలపరుస్తుంది..మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది.
6. దీన్ని తీసుకోవడం ద్వారా బరువు పెరిగే సమస్య నుంచి బయటపడడమే కాకుండా జీర్ణవ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
7. స్నేక్ ఫ్రూట్‌ తినడం వల్ల కళ్లకు కూడా శక్తి పెరుగుతుంది.
8. ఈ పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది గుండె సంబంధిత వ్యాధులకు చాలా మేలు చేస్తుంది.

Also Read: Cm Uddhav Thackeray: పీఎం మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే

Also Read: AFFORDABLE BIKES:తక్కువ ధర..అధిక మైలేజీ..మధ్య తరగతి కుటుంబాల బైక్‌లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News