close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

Health News

నవంబర్1 నుంచి ఈఎస్ఐ సేవలు నిలిపివేత

నవంబర్1 నుంచి ఈఎస్ఐ సేవలు నిలిపివేత

నవంబర్‌ ఒకటో తేదీ నుంచి తెలంగాణలోని స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఈఎస్ఐ సేవలు నిలిచిపోనున్నాయి.  నగదురహిత  వైద్య బిల్లుల చెల్లింపుల్లో (క్యాష్ లెస్ సర్వీసెస్) తీవ్ర జాప్యం జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ హాస్పిటల్స్ అసోసియేషన్స్ (టిఎస్హెచ్ఏ) ఒక ప్రకటనలో తెలిపింది. ఈఎస్‌ఐతో రాష్ట్రవ్యాప్తంగా 50 స్పెషాలిటీ ఆస్పత్రులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. వీటిలో వరంగల్, కరీంనగర్‌లోని నాలుగు మినహా మిగిలిన ఆసుపత్రులన్నీ రాజధాని హైదరాబాద్లోనే ఉన్నాయి.

Oct 31, 2017, 08:44 AM IST
నేరేడు పండు.. లాభాలు బోలెడు

నేరేడు పండు.. లాభాలు బోలెడు

నేరేడు పండు శాస్త్రీయ నాయం  'షైజీజియం క్యుమిని'. ఈ చెట్టును ఎక్కువగా పండ్ల కోసం పెంచుతారు. ఈ పండు పోషకాల గని.. అనారోగ్య నివారిణి. ఒక్క పండే కాదు.. ఈ చెట్టు ఆకులు, బెరడు కూడా వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి. ఇది మనదేశంతో పాటు, పాకిస్థాన్, ఇండోనేషియాలలో ప్రధానంగా పెరుగుతుంది. ఈ పండు ఇప్పటిది కాదట.. దీని గురించి రాలయంలో కూడా ప్రస్తావించారు. 14ఏళ్ల వనవాస జీవితంలో రాముడు ఎక్కువగా నేరేడు పండ్లను తిన్నాడని భారతీయుల విశ్వాసం.  నేరేడు పండు-ఆరోగ్య ప్రయోజనాలు

Oct 30, 2017, 03:05 PM IST
'ఆటిజం' ప్రాణాల్నితీస్తుందా ?

'ఆటిజం' ప్రాణాల్నితీస్తుందా ?

 ఇన్నాళ్లు పాశ్చాత్య దేశాల్లోనే ఉన్న ఈ 'ఆటిజం' సమస్య ఇప్పుడు మన దేశంలోనూ రోజురోజుకి పెరిగిపోతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.ఆటిజం అంటే నిజానికి వ్యాధి కాదు. ఇది మెదడు పనితనంలో ఏర్పడిన ఒకలోపం మాత్రమే. సాధారణంగా ఆటిజం లక్షణాలు మూడేళ్ల వయసు నిండక ముందే కనిపిస్తాయి. ఆటిజం ఉన్న పిల్లలు ప్రధానంగా కొన్ని సమయాల్లో బాగా ఇబ్బంది పడుతుంటారు. దీని ప్రభావం వల్ల మానసిక వైద్యుల వద్దకు వస్తున్నపిల్లల సంఖ్య ఎక్కువగా ఉందని తల్లిందండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని ఆనవాళ్లను పసిగడితే అధిగమించటం కష్టమేమీ కాదని వైద్యులు చెబుతున్నారు.

Oct 30, 2017, 11:05 AM IST
భారత్ లో 29 లక్షల మంది పిల్లలకు టీకాలు వేయించలేదు: అంతర్జాతీయ ఆరోగ్య నివేదిక

భారత్ లో 29 లక్షల మంది పిల్లలకు టీకాలు వేయించలేదు: అంతర్జాతీయ ఆరోగ్య నివేదిక

భారతదేశంలో సుమారు 29 లక్షల మంది పిల్లలకు తట్టు/ పొంగు లేదా మీజిల్స్ వ్యాధి నిరోధక టీకాలు వేయిచలేదని తాజాగా అంతర్జాతీయ ఆరోగ్య నివేదిక ప్రకటించింది. ప్రపంచంలో చాలా దేశాల్లో దాదాపు 2.08 కోట్ల మంది పిల్లలకు తొలిదశ టీకాలు వేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. భారత్ తో సహా నైజీరియాలో అత్యధికంగా 33 లక్షలు, పాకిస్థాన్ లో 20 లక్షలు, ఇండోనేషియాలో 12 లక్షలు, ఇథియోపియాలో 9 లక్షలు, కాంగోలో 7 లక్షల మంది పిల్లలకు వాక్సిన్ వేయించలేదు. 

Oct 29, 2017, 12:24 PM IST
ఒక్క 'మాత్ర' తో షుగర్, బరువు తగ్గించవచ్చు..!

ఒక్క 'మాత్ర' తో షుగర్, బరువు తగ్గించవచ్చు..!

దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో మధుమేహ బాధితులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ బాధిస్తోంది.జ్వరం, దగ్గు.. ఇదివరకు కామన్ గా వినిపించేవి. ఇప్పుడు బీపీ, షుగర్ లు వినిపిస్తున్నాయి. షుగర్ కంట్రోల్ పెట్టుకొవడానికి బాధితులు అష్టకష్టాలు పడుతుంటారు. ఆహారాన్ని చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఆరోగ్యాన్ని రక్షించుకుంటారు. ఇక మీదట అంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదంటున్నారు యూకే పరిశోధకులు. 

Oct 28, 2017, 04:35 PM IST
ఆ 'పాట'కి వ్యాయామం చేయాల్సిందే !

ఆ 'పాట'కి వ్యాయామం చేయాల్సిందే !

వన్, టు, త్రి, ఫోర్ ... ఇది వినగానే మనం వ్యాయామానికి సిద్దమైతామో?లేదో? కానీ ఇచి,ని, సాన్‌..  అంటే జపనీయులు వ్యాయామానికి రెడీ ఆవుతారు. ఇచి,ని, సాన్.. అంటే జపనీభాషలో ఒకటి, రెండు మూడు.. అని అర్థం. ఇది అక్కడి వ్యాయామగీతం అన్నమాట. ఈ పాటలో ఒకటి, రెండు, మూడు తప్ప ఇంకేదీ ఉండదు. అలానే చివరి వరకు పాడుతారు. 

Oct 25, 2017, 03:14 PM IST
తక్షణ శక్తినిచ్చే సగ్గుబియ్యం

తక్షణ శక్తినిచ్చే సగ్గుబియ్యం

బయటి నుంచి ఇంటికి రాగానే ఏదైనా తినాలని అనిపిస్తుంది. భోజనం టైం కాకపోతే ఏదైనా స్నాక్స్ తో సర్దుకుంటాం. భోజన సమయానికి ప్లేట్ ముందు కూర్చుంటాం.. కానీ ఆకలి కాదు. ఈ సమస్య సహజంగా అందరికీ ఉండేదే..! స్నాక్స్ తీసుకుంటే త్వరగా ఆకలి కాదు. అవి జీర్ణం అవ్వడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భాలలో సగ్గుబియ్యం తింటే త్వరగా జీర్ణం అవుతుంది. శరీరానికి శక్తి అందుతుంది. 

Oct 25, 2017, 12:27 PM IST
దిల్లీలో పదేళ్ల బాలుడికి అరుదైన శస్త్ర చికిత్స

దిల్లీలో పదేళ్ల బాలుడికి అరుదైన శస్త్ర చికిత్స

దిల్లీలో సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో వైద్యుల బృందం ఒక సంక్లిష్ట శస్త్రచికిత్సను నిర్వహించారు. 10 ఏళ్ల బాలుడికి  మధ్య, చూపుడు వేలును పునర్నిర్మించేందుకు పెద్ద బొటనవేలు, రెండవ బొటనవేలును ఉపయోగించారు. 

Oct 24, 2017, 03:08 PM IST
కోపాన్ని ఇలా ఆపుదాం ..!

కోపాన్ని ఇలా ఆపుదాం ..!

కోపంగా ఉంటే ఏం చేస్తారు? ఓ నాలుగు మాటలు అనేస్తారు. ఎదుటోడి మనసును గాయపరుస్తారు.

Oct 24, 2017, 12:59 PM IST
వీడియో కాలింగ్ ద్వారా ఇంట్లోనే ఆరోగ్య సంరక్షణ

వీడియో కాలింగ్ ద్వారా ఇంట్లోనే ఆరోగ్య సంరక్షణ

జలుబు, దగ్గు, జ్వరం, నరాల బలహీనత, కండరాల నొప్పులు.. వంటి రోగాలు వస్తే ఇంటి నుంచి బయటకు వచ్చి ఏదో వాహనం మీద హాస్పిటల్‌కు వెళ్ళాలి. 

Oct 23, 2017, 02:16 PM IST
కివి పండు తింటే కలిగే లాభాలు

కివి పండు తింటే కలిగే లాభాలు

కివి పండు ఇప్పుడైతే భారత మార్కెట్ లో విరివిగా దొరుకుతుంది. మార్కెట్ లో దీని ధర యాపిల్ కు సమానం. మన దేశంలో కివి సాగు అంతపెద్దగా లేదుగానీ ఎక్కువగా న్యూజిలాండ్ దేశంలో, చల్లని ప్రదేశాల్లో  ద్రాక్షవలె సాగుచేస్తారు. అందుకే న్యూజిలాండ్ క్రికెటర్లను 'కివీస్' అంటుంటాం. ఇందులో ఉన్న పోషకాలు, విటమిన్లు మరే పండులో కనిపించవని అంటారు శాస్త్రవేత్తలు. 

Oct 22, 2017, 02:00 PM IST
సీతాఫలం.. అద్భుత ప్రయోజనాలు

సీతాఫలం.. అద్భుత ప్రయోజనాలు

సీజన్ వస్తోందంటే కొన్ని రకాల పండ్ల రుచి పదే పదే గుర్తొస్తోంది. అలాంటి కోవకే చెందినది సీతాఫలం (కస్టర్డ్ ఆపిల్). శీతాకాలం పండు/ చలికాలం పండు అని దీనిని పిలుస్తారు. దేశంలో వివిధ ప్రాంతాలలో సీతాఫలం సాగు జరుగుతున్నా, తెలంగాణలోని మహబూబ్ నగర్ మనకు ఠక్కున గురొచ్చే ప్రాంతం.  హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ తదితర ప్రాంతాలకు ఇక్కడి నుండే సరఫరా అవుతుంది.  సీతాఫలం సీజన్లో రోజుకు ఒకటితిన్నా.. అందులోని ఔషధగుణాలు మన శరీర రోగాలను నివారిస్తుంది. పండే కాదు.. దాని ఆకులు, బెరడు ఇలా అన్నీ వ్యాధుల నివారణలో ఉపయోగిస్తారట. సీతాఫలం తినటం వల్ల ఎటువంటి ప్రయోజనాల ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..!

Oct 21, 2017, 04:16 PM IST
మొటిమలు.. పోగొట్టే చిట్కాలు

మొటిమలు.. పోగొట్టే చిట్కాలు

మొటిమలు ఎక్కువగా 80% యువతీయువకులకు వస్తాయి. దానికి కారణం హార్మోన్ల సమతుల్యత లోపించి సబేసియం గ్రంథుల నుంచి సెబమ్ ఎక్కువగా తయారుకావడమే. మొటిమలతో బయటికి వెళ్లాలంటే ఇబ్బందిపడుతుంటారు. కాబట్టి కొన్ని సులభ గృహ చిట్కాలతో మొటిమ సమస్యను దూరం చేయవచ్చు.  * తాజా కాయగూరలు, పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. నిలువ ఉంచిన ఆహార పదార్థాలను తినరాదు.  *  సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.  *  గోరువెచ్చని నీటితో ముఖాన్ని రోజుకు 4 నుండి 6 సార్లు శుభ్రపరుచుకోవాలి.  * టేబుల్ స్పూన్ గంధపు పొడిలో చెంచా పసుపు, పాలు కలుపుకొని ముఖానికి అద్దితే మొటిమలు తగ్గుతాయి. 

Oct 21, 2017, 03:41 PM IST
రామఫలం... మనో ఉత్తేజానికి మహాబలం

రామఫలం... మనో ఉత్తేజానికి మహాబలం

మీరు సీతాఫలం పేరు వినే ఉంటారు.. కానీ రామఫలం పేరు ఎప్పుడైనా విన్నారా.. అన్నోనా రెటిక్యూలేట్ అనే బొటానికల్ నేమ్‌తో చాలా పాపులరైన ఈ ఫలం వల్ల ఉపయోగాలు అనేకం. కరీబియన్ ప్రాంతాలైన వెస్ట్ ఇండీస్‌తో పాటు సౌత్ అమెరికా లాంటి చోట్ల ఈ ఫలం మూలాలు ఉన్నాయని.. దీనిని బులక్స్ హార్ట్ అంటారని కూడా వినికిడి. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో పలుచోట్ల ఈ ఫలాలు విరివిగా  దొరుకుతున్నాయి. అలాగే అస్సాం, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్రలకు చెందిన గిరిజన ప్రాంతాల్లో ఇవి బాగా దొరుకుతుంటాయి.

Oct 19, 2017, 02:56 PM IST
చక్కెర తింటే క్యాన్సర్ కణతి పెరుగుతుందట

చక్కెర తింటే క్యాన్సర్ కణతి పెరుగుతుందట

క్యాన్సర్ మీద తొమ్మిదేళ్ల పాటు జరిపిన అధ్యయనంలో, చక్కెర క్యాన్సర్ కణాలను జాగృతం (మేల్కొనేట్లు) చేస్తుంది, కణతి ఏర్పడటానికి వేగాన్ని పెంచుతుంది అని ఇటీవల శాస్త్రవేత్తలు  కనుగొన్నారు. ఈ అధ్యయనం క్యాన్సర్ పరిశోధన రంగంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అధ్యయనంలో చక్కెర, క్యాన్సర్ మధ్య ఉన్న సహజ సంబంధాన్ని కనుగొన్నారు. 

Oct 18, 2017, 01:52 PM IST
దీపావళి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా!

దీపావళి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా!

దీపావళి కోసం అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కొందరు సంబరాలు, టపాసులు కాల్చడానికి, మరికొందరు  తీపి వంటల రుచికోసం వేచి చూస్తుంటారు. కానీ వివిధ రకాల వంటకాలు తినాలని ధ్యాసలో పడి ఆరోగ్యాన్ని మరిచిపోతారు.  అలా కాకుండా ఉండేందుకు, ఆరోగ్యంపై జాగ్రత్త వహించేందుకు మేము కొన్ని ప్రత్యేక విషయాలు చెబుతున్నాం ..   1. రుచి చూస్తూ చిన్న తీపిముక్కను తినండి 

Oct 18, 2017, 12:16 PM IST
నేడు జాతీయ ఆయుర్వేద దినోత్సవం

నేడు జాతీయ ఆయుర్వేద దినోత్సవం

ఆయుష్షును కాపాడి వృద్ధిచేసే వైద్యం ఆయుర్వేదం. ఈ వైద్యానికి మూలపురుషుడు వైద్యనారాయణ ధన్వంతరి. ఇది భారతదేశంలో ప్రాచూర్యంలో ఉన్న పురాతన వైద్యం. ఆధునిక వైద్యం అందుబాటులో వచ్చిన తరువాత ఆయుర్వేదం వెనుకబడి మళ్ళీ తిరిగి పూర్వ వైభవం సాధించుకుంది. ఆధునిక వైద్యంలో నయంకాని దీర్ఘకాలిక రోగాలు సైతం ఆయుర్వేదంలో  నయమవుతాయని నమ్మకం ఉంది. ఆయుర్వేద వైద్యం గుర్తుండాలని ఏడాదిలో ఒకరోజు జాతీయ ఆయుర్వేద దినోత్సవం (అక్టోబర్ 17) జరుపుకుంటాం.  

Oct 17, 2017, 01:09 PM IST
t>