close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

Health News

ఉసిరి.. ఆరోగ్యానికి "సిరి"

ఉసిరి.. ఆరోగ్యానికి "సిరి"

ఉసిరికాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Nov 13, 2017, 07:18 PM IST
కోమలమైన పెదవుల కోసం..

కోమలమైన పెదవుల కోసం..

          

Nov 12, 2017, 04:03 PM IST
దొండకాయ తినడం వల్ల ఎన్ని లాభాలో!

దొండకాయ తినడం వల్ల ఎన్ని లాభాలో!

బయట మార్కెట్లో విరివిగా లభ్యమయ్యే కూరగాయల్లో దొండకాయ కూడా ఒకటి. దొండకాయను వివిధ రకాలుగా వండుకొని చపాతి, అన్నంతో తినవచ్చు. చూడటానికి చిన్నగా, పొట్టిగా కనపడుతుంది కదా అని దీని గురించి తక్కువ అంచనా వేసుకుంటే పొరబడినట్లే. ఇందులో ఔషధ గుణాలు ఏముంటాయిలే అని అనుకుంటాము.  దొండను ఎక్కువగా తింటే మందబుద్ధి వస్తుంది అని చెప్పేవారు కూడా లేకపోలేరు. అయతే అది ఒక అపోహ మాత్రమే. * దొండకాయలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. పీచూ, ప్రోటీన్లు కూడా లభ్యమవుతాయి. * ఇందులోని యాక్సిడెంట్లు బాక్టీరియాలను అడ్డుకుంటాయని ఆయుర్వేదం చెబుతుంది.

Nov 12, 2017, 01:04 PM IST
తగినంత నిద్రపోవటం లేదా?

తగినంత నిద్రపోవటం లేదా?

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ నిద్రకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు. ఈ సమస్య పిల్లలలో ఎక్కువగా ఉంది అని అంటున్నారు వైద్యులు. టీవీ, స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి పిల్లలు టైంకు నిద్రపోవడం లేదని వారి వాదన. ముఖ్యంగా ఏడేళ్లలోపు పిల్లలకు నిద్రలేకపోతే పెద్దయ్యాక అనేక రుగ్మతలకు గురవుతారని అంటున్నారు. ఏకాగ్రత తగ్గడం, భావోద్వేగాలను అదుపు చేయలేకపోవడం, ఒత్తిడికి లోనవడం వంటివి అందులో ప్రధానమైనవి.

Nov 9, 2017, 03:30 PM IST
కుర్చీలోంచి లేవండి..!

కుర్చీలోంచి లేవండి..!

ఆఫీస్‌కు వెళ్లే మహిళలు చకచకా పరుగులు తీస్తూ ఇంటిపని అంతా చూసేసుకొని వెళ్తుంటారు. ఇక్కడివరకు బాగానే ఉంది.. కానీ! అసలు చిక్కల్లా ఇక్కడే వచ్చిపడింది. ఆఫీసులో కూర్చొని కుర్చీలోంచి లేవటం లేదట మహిళలు..! ఇంట్లో అంతబాగా పనులు చేసుకొని వచ్చి మధ్యాహ్నం భోజనానికి కూడా లేవకుండా అలానే ఎనిమిది, తొమ్మిదిగంటలు కుర్చీలో ఉండిపోతున్నారని కొందరు అంటున్నారు. ఇలా చేయడంవల్ల మహిళలు శారీరక, మానసిక విశ్రాంతికి దూరమవుతున్నారు. ఫలితంగా ఒత్తిడి, అలసటకు గురవుతున్నారు. దాని ప్రభావం మనం చేసే పనిపైన పడుతుదని వారు చెప్తున్నారు. మరెలా దీనికి పరిష్కారం అనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి. 

Nov 9, 2017, 11:18 AM IST
ఉప్మాతో ఆరోగ్యం

ఉప్మాతో ఆరోగ్యం

నేటి ఉరుకులు పరుగుల జీవనంలో కడుపునిండా తిని, ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యం. కొందరు ప్రతీ వంటకూ వంకలు పెట్టి అసలు ఏవీ తినడానికి ఇఫ్టపడరు.  అలాంటివాటిలో ఉప్మా ఒకటి. అయితే ఉప్మా ఆరోగ్యానికి చాలా మంచిది అన్నది సత్యం. అందులోనూ  గోధుమ రవ్వతో చేసిన ఉప్మా ఆరోగ్యానికి ఇంకా మంచిది.  ఉప్మాయే కాదు.. గోధుమ రవ్వతో చేసిన ఆహార పదార్థాలు ఏవి తీసుకున్నా మనకు మంచి పోషకాహారం లభించినట్లే..  * గోధుమ రవ్వలో ప్రొటీన్లు అధికం. బరువు పెరగడానికి, కండరాల నిర్మాణానికి ఇది సరైన ఆహారం.

Nov 8, 2017, 04:22 PM IST
ఈ పండ్లతో ఇన్ఫెక్షన్ కు చెక్

ఈ పండ్లతో ఇన్ఫెక్షన్ కు చెక్

పండ్లు తింటే మేలు. కానీ కొందరు పండ్లు అవగాహన లేకుండా ఊరికే తింటుంటారు. అయితే.. ఏ పండు ఎందుకు తింటున్నాం, దాని వల్ల ఏ ప్రయోజనం ఉంటుందో తెలుసుకోరు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లకు గురికాకుండా పండ్లు ఉపయోగపడతాయనే విషయం తెలుసా మీకు?. ఇదేకాదు.. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలైన అలర్జీ, తుమ్ములు, గ్యాస్ వంటివాటిని కూడా పండ్లు నివారిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కొన్ని పండ్లు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..! 

Nov 8, 2017, 01:29 PM IST
క్యాప్సికంతో  బోలెడు ప్రయోజనాలు

క్యాప్సికంతో బోలెడు ప్రయోజనాలు

దేశీయ మార్కెట్లలో అధికంగా లభ్యయ్యే కాయగూరల్లో క్యాప్సికం ఒకటి. 'బెంగళూరు మిర్చి' అని దీనికి పేరు. బయట మార్కెట్లో ఇది వివిధ రంగుల్లో కనిపిస్తాయి. ఎరుపు, ఆరెంజ్, ఎల్లో రంగుల్లో కనిపించినా..  ఆకుపచ్చ రంగుల్లో ఉండే కాప్సికంను మాత్రమే ఎక్కువగా కూరల్లో వాడుతాము. ఒకరోజులో శరీరానికి కావాల్సిన 'సి' విటమిన్ ను ఒక్క క్యాప్సికం మాత్రమే అందిస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇదేకాదు ఇలాంటి ఎన్నో ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయని అంటున్నారు. అవేంటో మనమూ తెలుసుకుందాం..!  * క్యాప్సికం నొప్పిని తగ్గించే పెయిన్ కిల్లర్ గా ఉపయోగపడుతుంది. 

Nov 8, 2017, 12:13 PM IST
కోహ్లీ ఫిట్నెస్ రహస్యం ఇదిగో!

కోహ్లీ ఫిట్నెస్ రహస్యం ఇదిగో!

భారత క్రికెటర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో, టీ20 మ్యాచుల్లో దూసుకెళ్తూ రికార్డులు సృష్టింస్తున్న  విషయం అందరికీ తెలిసిందే.! అందుకు కారణం అతని ఫిట్నెస్. డాషింగ్ బ్యాట్స్ మెన్ గా దూసుకెళ్తున్న కోహ్లీ అంత  ఫిట్ గా ఉండటానికి ఏం చేస్తారు? ఏం తింటారు? అని అభిమానులు కూడా తెలుసుకోవాలని ఆరాట పడుతుంటారు. 

Nov 7, 2017, 01:09 PM IST
ప్రతిఏటా లక్షలో 100 మందికి క్యాన్సర్

ప్రతిఏటా లక్షలో 100 మందికి క్యాన్సర్

"క్యాన్సర్ నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఒక మహమ్మారి. దీనిని అదుపు చేయాలంటే అవగాహన పెంచుకొని, సక్రమంగా మసులుకుంటే నివారించవచ్చు" అని డాక్టర్లు, క్యాన్సర్‌ను జయించిన వ్యక్తులు అంటుంటారు. ఏదైనా రోగం వస్తే భూతద్దంలో పెట్టి చూడాలా? అదేమీ కాదులే అంటూ గమ్మున కూర్చుంటే ఇక అంతే సంగతులు. అది ముదిరి పాకాన పడి డబ్బులనైనా వదిలిస్తుంది లేదా చావునైనా పరిచయం చేస్తుంది. ఎందుకని అంత లైట్‌గా తీసుకుంటారో అర్థంకాదు నేటి సమాజం. అలా వెళ్లి డాక్టర్‌ను చూపించుకొని వస్తే ఆ వ్యాధి ఏదో నిర్ధారణ అయిపోతుందిగా..! 

Nov 7, 2017, 12:16 PM IST
హైదరాబాద్లో పెరుగుతున్న స్వైన్‌ఫ్లూ కేసులు

హైదరాబాద్లో పెరుగుతున్న స్వైన్‌ఫ్లూ కేసులు

జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్లో స్వైన్‌ఫ్లూ విస్తరిస్తోంది. ఇప్పటికే నగరంలోని సికింద్రాబాద్, పాతబస్తీ ప్రాంతాల్లో డెంగ్యూ ఆనవాళ్లు కన్పించిన సంగతి తెలిసిందే! దీనికి తోడు గడిచిన కొద్దిరోజులుగా వాతావరణం చల్లబడటంతో స్వైన్‌ఫ్లూ భయంతో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ప్రతి ఏడాది ఇదే నెలలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. బహుశా ఇది కూడా వారి భయానికి కారణం అయి ఉండవచ్చు. ఈసారి రికార్డు స్థాయిలో వర్షాలు కురవటం, చలి ఎక్కువగా ఉండటంతో స్వైన్‌ఫ్లూ వేగంగా విస్తరించే అవకాశం ఉంది. 

Nov 6, 2017, 03:43 PM IST
చలికాలంలో పాదాల రక్షణ

చలికాలంలో పాదాల రక్షణ

చలికాలం వచ్చేసింది. ఈ కాలంలో చాలామందికి పాదాల సమస్య ఇబ్బంది పెడుతుంది. కాబట్టి పాదాలను అశ్రద్ధ చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది. పగిలిన పాదాలు చూడడానికి అసహ్యంగా కనిపిస్తాయి. అలా కనిపించకుండా అందంగా కనిపించాలంటే తగు జాగ్రత్తలు పాటించాలి. పాదాలు అందంగా, పగుళ్లు లేకుండా నాజూగ్గా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ క్రింది సూచనలను పాటిస్తే సరి..!  * ఎత్తు మడమల చెప్పులు వాడరాదు. వాడితే వెన్నునొప్పి వస్తుంది. కనుక ఇతరులు మనవైపు చూడాలని కాకుండా సౌకర్యవంతమైన చెప్పులు ధరిస్తే సరి. 

Nov 6, 2017, 03:04 PM IST
మలబద్దకమా.. ఐతే ఈ చిట్కాలు పాటించండి

మలబద్దకమా.. ఐతే ఈ చిట్కాలు పాటించండి

నేటి ఆధునిక సమాజంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య  మలబద్దకం. దీనికి ప్రధాన కారణం సరైన సమయంలో ఆహారం,  నీరు తీసుకోకపోవడంతో పాటు మారుతున్న జీవన విధానం కూడా. మలబద్దకమే కదా అని లైట్‌గా తీసుకుంటే మీరు అనేక సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది.  ముఖ్యంగా జ్వరం, తలనొప్పి, హైపర్ టెంషన్స్, జీర్ణాశయ వ్యాధులు, పైల్స్ వంటి వాటి బారిన పడతారు.  నివారణ చిట్కాలు:-  * ద్రవ పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. 

Nov 6, 2017, 11:52 AM IST
ఔషధ గని.. గుమ్మడి గింజలు

ఔషధ గని.. గుమ్మడి గింజలు

ఇది గుమ్మడికాయల సీజన్. చాలా మంది గుమ్మడి కాయ గుజ్జు ఉంచుకొని గింజల్ని పక్కన పారేస్తుంటారు. అవునా? అయితే మీకు ఆ గింజల రహస్యం తెలియదనుకుంటా. వాటిలో ఉన్న పోషక విలువలు మన శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. అసలు మీరు ఆ గుమ్మడి గింజల రహస్యం తెలిస్తే మరోసారి ఆ పని చేయరు గాక చేయరు.  * గుమ్మడి గింజల్లో మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, పాస్పరస్, జింక్, ఐరన్ .. లాంటి ఎన్నో ఖనిజాలతో పాటు ప్రోటీన్లు, ఎ, బి విటమిన్లు లభ్యమవుతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.  * ఇందులో ఉండే ఫినాలిక్ పదార్ధం క్యాన్సర్ ను అడ్డుకుంటుంది. జీవక్రియను పెంచుతుంది. 

Nov 5, 2017, 03:48 PM IST
ఆ లోహంతో కాన్సర్ కు చెక్

ఆ లోహంతో కాన్సర్ కు చెక్

'ఇరిడియం' పేరెప్పుడైనా విన్నారా? ఇది భూమిపై దొరికే అత్యంత అరుదైన మెటల్. ఆ లోహమే క్యాన్సర్ కణాలను చెక్ పెడుతుందని ఇటీవల  చైనా, బ్రిటన్ శాస్త్రవేత్తలు చెప్పారు. ఆ శాస్త్రవేత్తలకు ఈ విషయం ప్రయోగాల ద్వారా తెలిసింది. ఆరోగ్యకరమైన కణాలకు హాని కలగకుండా ఇరిడియం మెటల్ లోని ప్రత్యేకమైన ఆక్సిజన్ తో కూడిన పదార్థం లేజర్‌ కిరణాలకు ప్రభావితమై కాన్సర్ కణాలను చంపేస్తున్నట్లు తెలిసింది. ప్రయోగశాలలో కృత్తిమ ఊపిరితిత్తుల కాన్సర్ కణితిపై ఈ ప్రయెగం జరిగింది.

Nov 5, 2017, 09:35 AM IST
ఆరోగ్యంగా ఉండాలంటే.. పాత తరం తిండే మేలు!

ఆరోగ్యంగా ఉండాలంటే.. పాత తరం తిండే మేలు!

ఆరోగ్యాన్ని ఉండేందుకు ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయినా కూడా ఎదో ఒకటి వస్తూనే ఉంది. ఎంత డైట్ కంట్రోల్ చేసినా కూడా ఆరోగ్య సమస్య వస్తోంది. ఎందుకలా అని ఆలోచిస్తున్నారా? ఇందుకు కారణం మనం తినే తిండట. అమెరికా వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు పోషకాహారం లోపంపై ఒక పరిశోధన చేశారు. ఇందులో తెలిసిన నిజం ఏంటంటే.. ప్రస్తుతం తీసుకుంటున్న ఆహారంలో వైవిధ్యం తక్కువని, ఇది పోషకాహార లోపానికి దారితీస్తోందని చెప్పారు. అంతేకాదు ఇప్పుడు తీసుకుంటున్న ఆహారం కంటే పాతతరం ఆహారం పూర్తి భిన్నంగా ఉండేదని తెలిపారు.

Nov 4, 2017, 11:12 AM IST
ప్రపంచంలోనే అతిచిన్న పేస్మేకర్ తో గుండె ఆపరేషన్

ప్రపంచంలోనే అతిచిన్న పేస్మేకర్ తో గుండె ఆపరేషన్

ప్రపంచంలోనే అతి చిన్న పేస్మేకర్ తో ఒక వృద్ధుడికి చేసిన గుండె ఆపరేషన్ విజయవంతం అయినట్లు, ప్రస్తుతం ఆయన ఎంతో ఉల్లాసంగా తిరుగుతున్నాడని కాంటినెంటల్ హాస్పిటల్ డైరెక్టర్ భరత్ పేర్కొన్నారు. మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో తాజ్‌డెక్కన్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పై విధంగా స్పందించారు. 

Nov 1, 2017, 09:29 AM IST
తోటకూర.. మజాకా!

తోటకూర.. మజాకా!

ఏ సీజన్లోనైనా చటుక్కున దొరికే ఆకుకూర.. తోరకూర.  తెలుగు రాష్ట్రాలతో సహా దేశం అంతటా ఈ ఆకుకూరను విరివిగా పెంచుతారు, తింటారు. ఆకుకూరల్లో ఇది 'రాణి' వంటిదని అంటారు. యాంత్రిక జీవనానికి అలవాటుపడి తోటకూర రుచి, దాని ఉపయోగాలేంటో చాలామందికి తెలియడం లేదు. తాజా తోటకూరలో ఉండే పోషకాలు శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు. అందుకే తరచూ కాస్త తోటకూర తింటూ ఉండండని డాక్టర్లు చెబుతూ ఉంటారు.  తోటకూర- లాభాలు  * తోటకూర మంచి విరోచనకారి. ఆకలిని పుట్టిస్తుంది. ఇందులోని పీచు పదార్ధం జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. 

Oct 31, 2017, 01:22 PM IST
t>