close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

Health News

పెరుగు తింటే అద్భుత ఫలితం

పెరుగు తింటే అద్భుత ఫలితం

పెరుగు లేకుండా భోజనం ఊహించలేం. పంచభక్ష పరమాన్నం పెట్టినా పెరుగు ఉండాల్సిందే. భోజనం చివరలో ఒక ముద్ద పెరుగన్నం తింటే ఆరోగ్య సమస్యలు దగ్గరకి రావని ఆయుర్వేదం చెబుతుంది. ఆహార పదార్థాలలో దీనిని 'ఆమృతం'తో పోలుస్తారు. మన దేశంలో పెరుగు సంపూర్ణాహారం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పెరుగు గురించి ఈ విషయాలు తెలిస్తే .. ఇష్టం లేనివారుసైతం తప్పక పెరుగు తింటారు.  1.  పెరుగు ఎలాంటి వాతవ్యాధినైనా జయిస్తుంది. బరువును పెంచుతుంది, శరీరపుష్టిని కలిగిస్తుంది. జీలకర్ర పొడిని ఓ కప్పు పెరుగులో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతుంది.  2.  జలుబు ఉంటే పెరుగు తినకూడదు అంటారు.. కానీ జలుబుకు పెరుగు విరుగుడు. 

Oct 16, 2017, 01:34 PM IST
శృంగారంతో కొత్త ఉపయోగం!

శృంగారంతో కొత్త ఉపయోగం!

శృంగారం..  మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.. ఒంట్లో కొవ్వును కరిగిస్తుంది.. ఇది నిన్నటి మాట. కానీ తాజాగా మరో కొత్త ఉపయోగం వచ్చి చేరింది. అదేమిటంటే, శృంగారంతో తెలివితేటలు కూడా పెరుగుతాయట. మెదడులో ఉండే హిప్పోక్యాంపస్ అనే ప్రాంతంలో కొత్త న్యూరాన్లు ఏర్పడేందుకు శృంగారం ఎంతగానో ఉపయోగపడుతుందని తాజా పరిశోధనలలో తేలింది. తరచూ లైంగిక కార్యకలాపాలలో  పాల్గొనడం వల్ల మెదడులో దీర్ఘకాలిక జ్ఞాపకాలకు నెలవైన హిప్పోక్యాంపస్ ప్రాంతంలో అధిక సంఖ్యలో కొత్తనాడులు పుట్టుకొస్తాయని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ పరిశోధకులు చేసిన తాజా అధ్యయనం తెలిపింది. అంతేకాదు..

Oct 14, 2017, 03:28 PM IST
పని ఒత్తిడిలో హైదరాబాద్ నాలుగోస్థానం

పని ఒత్తిడిలో హైదరాబాద్ నాలుగోస్థానం

భారతీయ నగరాల్లో అధిక శాతం ప్రజలు పని ఒత్తిడితో, మానసిక సమస్యలతో ఆందోళన చెందుతున్నారని అధ్యయనం ద్వారా  తెలిసింది. ప్రధాన నగరాల్లో 60 శాతం మంది ఉద్యోగులు పని ఒత్తిడికి లోనవుతున్నారని ఆన్లైన్ డాక్టర్ల కన్సల్టెంట్ ఫోరమ్, లీబ్రేట్ చెప్పింది. పని ఒత్తిడి సమస్యలతో ఆందోళన చెందుతున్న నగరాల్లో వాణిజ్య నగరం ముంబై (31 శాతం) మొదటి స్థానంలో ఉంది.  ఆ తరువాత వరుసగా దిల్లీ (27 శాతం), బెంగళూరు (14 శాతం), హైదరాబాద్ (11 శాతం), చెన్నై (10 శాతం ), కోల్కతా (7 శాతం)  నగరాలు ఉన్నాయి.

Oct 11, 2017, 11:23 AM IST
పెరగనున్న ఎంబిబిఎస్ సీట్లు

పెరగనున్న ఎంబిబిఎస్ సీట్లు

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే  "దేశంలో ఆరు లక్షల కన్నా ఎక్కువ వైద్యుల కొరత ఉంది.  కానీ ఈ సమస్య  2022లోపు అధిగమిస్తాము. ఎందుకంటే మెడికల్ కళాశాలల్లో సీట్ల సంఖ్య పెంచుతున్నాము. ఇప్పడున్న దేశ జనాభాకు 14 నుంచి 16 లక్షల మంది వైద్యులు అవసరం ఉంది. కానీ ప్రస్తుతం ఎనిమిది లక్షల మంది డాక్టర్లు మాత్రమే ప్రజలకు సేవలందిస్తున్నారు" అని అన్నారు.  

Oct 10, 2017, 03:30 PM IST
కళ్ళకలక బారి నుంచి బయటపడే చిట్కా..

కళ్ళకలక బారి నుంచి బయటపడే చిట్కా..

ఇది వర్షాకాలం.. పల్లెలు, నగరాలు అంటూ తేడా లేకుండా వర్షానికి తడిసిముద్దవుతాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో అయితే జలదిగ్భందంలో రహదారులు, అస్తవ్యస్త రాకపోకలు, గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లు .. ఇది నాణేనికి ఒకవైపైతే ఆరోగ్య సమస్యలు మరోవైపు. వర్షాకాలంలో వచ్చే సాధారణ ఆరోగ్య సమస్యలలో కంటి సమస్య ఒకటి. ఇలాంటి సమయంలోనే కంటికి ఇన్ఫెక్షన్ వస్తుంది.  అందుకే వర్షాలు పలకరిస్తున్న ఈ కాలంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే కంటి సమస్యల నుండి దూరంకావచ్చు..! 1. చేతులను శుభ్రంగా కడుక్కొని కళ్లను తాకండి. మురికి చేతులతో తాకొద్దు. 

Oct 10, 2017, 01:40 PM IST
అరక్షిత అబార్షన్లకు ముగింపు ఏది..?

అరక్షిత అబార్షన్లకు ముగింపు ఏది..?

ప్రపంచంలో నమోదయ్యే ప్రతీ రెండు అబార్షన్లలో ఒకటి కచ్చితంగా అరక్షిత మార్గంలో చేయించుకొనే అబార్షనే అయ్యి ఉంటుందని "ది లాన్సెట్" అనే మెడికల్ జర్నల్ చేసిన తాజా సర్వే తెలియజేస్తోంది. దాదాపు 5.57 కోట్ల అబార్షన్ల డేటాను (2010- 2014 మధ్య) నమోదు చేసిన ఈ సర్వే అందులో 3.6 కోట్ల అబార్షన్లు సురక్షిత మార్గాల ద్వారా చేయించుకున్నట్లు వెల్లడించగా, 2.51 కోట్ల అబార్షన్లు మాత్రం అరక్షిత  మార్గాల ద్వారానే జరుగుతున్నాయని తెలిపింది.

Oct 7, 2017, 05:11 PM IST
బరువు తగ్గడానికి.. బ్లాక్ టీ

బరువు తగ్గడానికి.. బ్లాక్ టీ

బరువు తగ్గడానికి ఏవో చేస్తుంటాము. డాక్టర్ సలహాలనూ పాటిస్తుంటాము. రోజువారీ తీసుకొనే కొవ్వు పదార్థాల మోతాదునూ బరువు తగ్గాలనే కారణంగా తీసుకోవడం మానేస్తాము. కానీ,  ఒక్క 'టీ' తో మీరు బరువు తగ్గే చిట్కా ఒకటుంది. అదే .. 'బ్లాక్ టీ'. దీని వల్ల కేవలం బరువు ఒక్కటే కాదు..  చాలా వరకు సమస్యలను నివారించవచ్చు. అవేంటో చూద్దాం..! 1. రక్తపోటుతో బాధపడుతున్నవారు రోజుకు మూడు కప్పుల బ్లాక్ టీ తాగడంవల్ల రక్తపోటు తగ్గుతుందని శాస్త్రవేత్తలు  అంటున్నారు. ఇలా మూడు కప్పులు తాగేవారికి రక్తపోటు తగ్గిందని యూనివర్సిటీ అఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా పరిశోధకులు కనుగొన్నారు. 

Oct 5, 2017, 05:05 PM IST
గాంధీజీ చెప్పిన ఆరోగ్య పాఠాలు..!

గాంధీజీ చెప్పిన ఆరోగ్య పాఠాలు..!

మహాత్మాగాంధీ.. నిరాడంబరతకు, నిర్మలత్వానికి మారు పేరు ఆ పావనమూర్తి. "అందరూ విలువను బంగారంలోనూ, వెండిలోనూ వెతుక్కుంటారు. కానీ అసలైన విలువ అనేది మన ఆరోగ్యంలోనే ఉంటుంది. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యము" అని అంటారాయన. ఆధునిక కాలంలో అనేక విపరీతాలకు ఆలవాలమైన మన జీవనశైలి సరైన పంథాలో వెళ్ళాలంటే ఆ మహనీయుని మాటలు మనకు ఆచరణయోగ్యంగా ఉండాలి. ఈ రోజు మహాత్మాగాంధీ గురించి ప్రపంచమంతా తెలుసు.

Oct 2, 2017, 01:58 PM IST
త్వరలో వైద్యులకూ మరో ఆధార్ ..!

త్వరలో వైద్యులకూ మరో ఆధార్ ..!

దేశంలో ఉన్న వైద్యులందరికీ ఆధార్ నెంబర్ తరహాలో యునిక్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ (యుపిఆర్ఎన్) ఇవ్వాలని న్యూఢిల్లీలోని మెడికల్ కౌన్సిల్ అఫ్ ఇండియా (ఎంసిఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వైదులందరూ ఒకే గొడుగు కిందకు రానున్నారు. ఇప్పటివరకు ఆయా రాష్ట్రాల్లో వైద్య విద్యను అభ్యసించిన వారు అక్కడే వైద్యులుగా రిజిస్ట్రేషన్ అయ్యేవారు. ఇలా ఒక రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివినవారికి కేటాయించిన నెంబర్ .. మరో రాష్ట్రంలో ఇంకొకరికి ఉంటోంది. ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు  ఎంసిఐ తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలు గురువారం వెలువడ్డాయి. 

Sep 29, 2017, 05:22 PM IST
త్వరలో వైద్యులకూ మరో ఆధార్ ..!

త్వరలో వైద్యులకూ మరో ఆధార్ ..!

దేశంలో ఉన్న వైద్యులందరికీ ఆధార్ నెంబర్ తరహాలో యునిక్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ (యుపిఆర్ఎన్) ఇవ్వాలని  మెడికల్ కౌన్సిల్ అఫ్ ఇండియా (ఎంసిఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వైదులందరూ ఒకే గొడుగు కిందకు రానున్నారు. ఇప్పటివరకు ఆయా రాష్ట్రాల్లో వైద్య విద్యను అభ్యసించిన వారు అక్కడే వైద్యులుగా రిజిస్ట్రేషన్ అయ్యేవారు. ఇలా ఒక రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివినవారికి కేటాయించిన నెంబర్ .. మరో రాష్ట్రంలో ఇంకొకరికి ఉంటోంది. ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు  మెడికల్ కౌల్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది.    

Sep 29, 2017, 11:18 AM IST
బీర్ తాగితే మెదడు చురుగ్గా పనిచేస్తుందా..?

బీర్ తాగితే మెదడు చురుగ్గా పనిచేస్తుందా..?

బీర్.. ఓ మద్యపానీయం. ఎలాంటి మద్యపానీయమైనా మనకు ఆరోగ్యానికి చేటు చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే. అయినా అప్పుడప్పుడు బీరు తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఇటీవల ఓ సర్వేలో తేలింది.

Sep 29, 2017, 11:13 AM IST
జిమ్ వ్యాయామం కన్నా ఏరోబిక్స్ మిన్న: WHO ప్రకటన

జిమ్ వ్యాయామం కన్నా ఏరోబిక్స్ మిన్న: WHO ప్రకటన

ప్రతీ రోజు జిమ్ కు వెళ్లి అవే సాధారణ వ్యాయామాలు చేయడం వల్ల ఉపయోగం ఉండదని, దానితో పాటు ఆరోగ్యం మీద శ్రద్ద కనబరిచే వ్యక్తులు, క్రీడాకారులు  కండరాలను పటిష్టముగా ఉంచుకొనే దశలో తప్పకుండా ఏరోబిక్స్ వైపు కూడా దృష్టి కేంద్రీకరించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ఏరోబిక్స్ చేయడం వలన లెక్కలేనన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలిపింది. వాటి వివరాలు ఇవి * ప్రతి ఒక్కరు రోజుకు కనీసం 30 నిముషాలు  ఏరోబిక్స్ చేయడం వలన కేవలం అయిదు సంవత్సరాల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరణాల శాతం దాదాపు 12 శాతం తగ్గే అవకాశం ఉంది. 

Sep 22, 2017, 11:37 AM IST
తల్లి గర్భంలోనే బిడ్డ భాషను వింటుందా..!

తల్లి గర్భంలోనే బిడ్డ భాషను వింటుందా..!

చలాకీగా మాట్లాడే పిల్లల్ని చూడగానే.. ఈ బుడతడు తల్లి గర్భం నుంచే పాఠాలు నేర్చుకొని వచ్చాడని మన సాధారణంగా చెబుతుంటాం.

Aug 22, 2017, 11:15 AM IST
బాడీ బ్యాలెన్స్ చిట్కా..

బాడీ బ్యాలెన్స్ చిట్కా..

మనలో కొందరు బరువు పెరుగుతున్నామని.. మరికొందరు బరువు పెరగడం లేదని బెంగపడుతుంటారు. శరీర సమతూల్యతను పాటించేందుకు రకరకాల మందులు..రకరకాల చికిత్సలు చేయించుకుంటున్నారు. అయితే దీని కోసం ఒక  చిట్కా పాటిస్తే చాలంటున్నారు అమెరికా యూనివర్శిటీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్రొఫెసర్లు.  బాడీ బ్లాలెన్స్ గా ఉంచుకోవాలంటే  ఉదయం తీసుకునే టిఫిన్‌ (అల్పాహారం) పై సీరియస్ గా దృష్టి పెడితే చాలంటున్నారు . 

Aug 22, 2017, 10:54 AM IST
చిన్నారుల్లో బ్రెయిన్ ట్రూమర్

చిన్నారుల్లో బ్రెయిన్ ట్రూమర్

ఎయిమ్స్ లెక్కల ప్రకారం ప్రతి ఏటా సగటున 40 వేల నుంచి 50 వేల మంది బ్రెయిన్ ట్రూమర్ బారిన పడుతున్నారు. వాటిలో 20 శాతం పిల్లలే ఉంటున్నారు. వాటిలో 20 శాతం పిల్లలే ఉంటున్నారు. ఆందోళన కల్గించే విషయం ఏటంటే..గత ఏడాది రికార్డుల ప్రకారం ఈ వ్యాధిన బారిన పడిన వారిలో పిల్లల సంఖ్య 25 శాతానికి చేరింది. ప్రతి ఏటా 2 వేల 500 మంది చిన్నారులు ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు తేలింది. దీన్ని బట్టి ఈ వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో మన అర్ధం చేసుకోచ్చు... 90 శాతం చికిత్సతో నయం...

Aug 21, 2017, 06:12 PM IST
వేగంగా విస్తరిస్తున్నహైపటైటిస్...

వేగంగా విస్తరిస్తున్నహైపటైటిస్...

హెపటైటిస్ వైరస్... మనలో చాలా కొద్ది మంది మాత్రమే దీని గురించి తెలుసు ..ఒక వేళ దీనిపై అవగాహన ఉన్నా.. అది పైపై మాత్రమే. దీని తీవ్రత తెలిసినట్లయితే  ప్రతి ఒక్కరు దీనిపై శ్రద్ధపెట్టకుండా ఉండలేరు. ఎందుకంటే హెచ్‌ఐవీ తర్వాత అంతటి ప్రాణాంతక వ్యాధి అంటున్నారు వైద్యులు. కాలేయ వ్యాదులు ప్రాణాతకంగా మరుతాయనే విషయం తెలిసిందే.  కాలే జబ్బులకు కారణమయ్యే వైరస్లలతో హెపటైటిస్ ముఖ్య మైనది. ఇది గనుక ఒక్కసారి మన బాడీలో ప్రవేశించిందంటే ఎప్పటికీ తొలగిపోదు. ప్రపంచంలో 40 కోట్ల మంది దీని బారిన పడినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది.

Aug 21, 2017, 06:04 PM IST
చిన్నారులపై ఆస్తమా ప్రతాపం..

చిన్నారులపై ఆస్తమా ప్రతాపం..

మన దేశంలో ఆస్తమా రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం భారత దేశంలో 1.5 కోట్ల ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నట్లు  తేలింది. ప్రధానంగా చిన్నారుల్లో అస్తమా ఎఫెక్ట్ ఎక్కువగా కనిపించడం ఆందోళన కలిగించే అంశం. అస్తమా వ్యాధి వ్యాప్తికి గాలి కాలుష్యమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. గాలి కాలుష్యానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ మన ఇళ్లల్లో వాడే కిరోసిన్, కట్టెల పొయ్యి వాడకం కూడా కారణమని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ తాజా అధ్యయనం ప్రకారం భారత దేశంలో 70 శాతం కంటే అధికం మంది కిరోసిన్ , కట్టెల పొయ్యి వాడుతున్నారని..

Aug 21, 2017, 05:04 PM IST
t>