Gold smuggling in laptops, tabs and smartphones: చెన్నై: దేశంలోని ఎయిర్ పోర్టుల్లో బంగారం స్మగ్లర్లు భారీగా బంగారం స్మగ్లింగ్‌కి పాల్పడుతూ పట్టుబడుతుండటంతో గోల్డ్ స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కొంగొత్త మార్గాల్లో దొంగతనంగా బంగారం స్మగ్లింగ్‌కి పాల్పడుతున్నారు. అలా దుబాయ్ నుంచి చెన్నైకి వచ్చిన ఓ కొత్త ముఠాను చెన్నైలో ఎయిర్ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. బుధవారం సాయంత్రం దుబాయ్ నుంచి చెన్నైకి వచ్చిన EK-544, UL-121 విమానాల్లో (Dubai to chennai flights) దుబాయ్ నుంచి చెన్నైకి బంగారం తరలిస్తున్నట్టు ఎయిర్ కస్టమ్స్ అధికారులకు విశ్వసనీయమైన వర్గాల ద్వారా సమాచారం అందింది.
విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారంతో రంగంలోకి దిగి ముందే కాపు కాసిన ఎయిర్ కస్టమ్స్ అధికారులు. ఆ రెండు విమానాల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. వారి వద్ద ఉన్న ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్, స్మార్ట్‌ఫోన్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లోని కీప్యానెల్ కింది భాగంలో బంగారం ఫాయిల్స్ లభించాయి. బంగారాన్ని కరిగించి దానిని ఒక పేపర్ ఫాయిల్‌గా మార్చి కీబోర్డు కింది భాగంలో పేపర్ తరహాలో అమర్చి తరలిస్తున్నట్టు తేలింది. వారి వద్ద ఉన్న ల్యాప్ టాప్స్, ట్యాబ్స్, స్మార్ట్ ఫోన్స్ అన్ని తనిఖీలు చేయగా.. అందులో 5.06 కిలోల బంగారం (Smuggled gold) బయటపడింది.
Also read : DA hike for Central govt employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు Good news.. డీఏ పెంపుపై కేంద్రం ప్రకటన
కస్టమ్స్ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 2.19 కోట్లు ఉంటుందని ఎయిర్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు.. వారి వద్ద నుంచి మరో రూ. 48.6 లక్షల విలువైన ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్, స్మార్ట్ ఫోన్లను (Laptops, tablets, smartphones) సైతం స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ ముఠా వెనుక ఉన్న గోల్డ్ స్మగ్లర్ల ముఠా (Gold smuggling) ఎవరా అని ఆరా తీసే పనిలో పడ్డారు.
Also read : IAF trainer aircraft crashes : కుప్పకూలిన మిరాజ్ 2000 ఫైటర్ జెట్ విమానం
Also read : India Crosses 1 Billion Vaccination: భళా 'భారత్'.. 100 కోట్ల టీకాల పంపిణీ పూర్తి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook