Crime News: ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన.. ఎన్ని విధాలుగా ప్రజల్లో అవగాహన కల్పించిన కూడా సమాజంలో మహిళలపై జరిగే అఘాయిత్యాలు తగ్గటం లేదు. ఉన్నత విద్య చదివిన వారు కూడా ఇలా చేయటం సమాజానికి సిగ్గు చేటు. అలాంటి ఘటనే మన హైదరాబాద్ లో జరిగింది. విషయానికి వస్తే.. ఒక ప్రైవేట్ స్కూల్ ఛైర్మెన్ ఇంట్లో పని చేసే యువతి బెదిరించి లైంగిక దాడి చేసాడు. ఆ విషయం అతడి కుమారుడికి చెప్తే తప్పు అని చెప్పకుండా ఆ యువతినే కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ స్కూలు యజమాని పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.
ఇంటి పని చేసేందుకు ఒక యువతీ ఏ గ్రేట్ ఏజెన్సీ అనే కంపెనీలో చేరింది. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ మురళీకుంద్ అతని కుమారుడు ఆకాష్ నివాసం ఉంటున్న ఇంట్లో పని చేయాలనీ ఏజెన్సీ ఆమెకు ఆర్డర్ వేసింది. అక్కడికి వెళ్లి ఆమె తన విధులను నిర్వహించి అక్కడి నుండి భయలు దేరేది. అయితే ఈ నెల 16 న మధ్యాహ్నం పని చేయటానికి వచ్చిన యువతిని పిలిచి తన బెడ్ రూమ్ లో బెడ్ షీట్ సరి చేయాలనీ ఆమెకు ఆదేశించాడు. ఆదేశం మేరకు ఆ యువతీ బెడ్ రూమ్ లో బెడ్ షీట్ మారుస్తుండగా.. వెనకాలే వెళ్లి.. రూమ్ కి లాక్ చేసి.. స్నానం చేసి రావాలని ఆ యువతీని బెదిరించాడు. అతడి బెదిరింపులకు భయపడిన యువతి చెప్పిన విధంగా చేసింది. బాత్రూమ్ లో ఆ యువతీ స్నానం చేస్తుంటే ఫోటోలు, వీడియోలు తీశానని.. బెదిరించి ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
అంతేకాకుండా.. ఈ విషయం ఎవరికైన చెప్తే నిన్ను మీ తల్లిని చంపేస్తానని బెదిరించాడు. భయపడిన యువతి అతడి కుమారుడికి తెలుపగా.. అతను కూడా విషయం ఎవరికి చెప్పొద్దని యువతిని కొట్టి బెదిరించాడు. ఇదిలా ఉండగా.. ఆ యువతిపై అతడు పలు మార్లు అత్యాచారం చేయగా.. కానీ ఆ యువతీ వారి ఇంట్లో కొడుతున్నారని పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కూడా ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి పంపించేశారు.
ఇటీవలే తనపై జరుగుతున్న అత్యాచారాన్ని తల్లికి తెలుపగా.. ఇద్దరు కలిసి పోలీసు స్టేషన్ లో ఈ నెల 18న తండ్రి కొడుకలపై కేసులు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతిని భరోసా కేంద్రానికి పంపించగా.. మురళీకుంద్ మరియు అతడి కుమారుడు ఆకాష్ పై పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
Also Read: Jr NTR: ఆస్కార్ అకాడమీ కొత్త మెంబర్ గా జూ.ఎన్టీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..