Hand Sanitizer: కోవిడ్-19 ( Covid-19) కు ముందు కూడా హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది వీటిని ఎక్కువగా వినియోగించేవారు. అయితే కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ పెరుగుతున్న సమయంలో ప్రతీ ఒక్క వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. భౌతిక దూరం ( Social Distance ) , మాస్కులు ( Face Masks ), శానిటైజర్లు ( Sanitizer ) జీవితంలో భాగం అయ్యాయి. అయితే ఇలాంటి సమయంలో శానిటైజర్ల వినియోగం బాగా పెరిగింది. అయితే వాటిని సరిగ్గా వినియోగించకుంటే మాత్రం నష్టాలు కలుగుతాయి. Also read: Kawasaki Syndrome: కొవిడ్-19 పోనే లేదు భారత్‌లో మరో వ్యాధి కలకలం
శానిటైజర్‌ను సరిగ్గా వినియోగించడం తెలుసుకోవాలి:
1. శానిటైజర్ వినియోగించడానికి ముందు అందుబాటులో సబ్బు ( Soap ) ఉంటే సబ్బునే వినియోగించుకోవాలి. సబ్బు లేని సమయంలో మాత్రమే శానిటైజర్‌ను వినియోగించుకోవాలి. 20 సెకన్ల పాటు సోప్‌తో హ్యండ్ వాష్ ( Hand Wash For 20 Seconds ) చేసుకోవాలి.
2. మీ చేతులు బాగా మురికిగా ఉన్నప్పుడు శానిటైజర్ ఎక్కువగా వినియోగించకూడదు. అప్పుడు తప్పకుండా సోప్ వాడితే ఫలితాలు బాగుంటాయి. పైగా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లు ( Alcohol Base Sanitizer ) ఇలాంటి పరిస్థితిలో ఎక్కువ ఆపరిశుభ్రతను కలిగిస్తాయి.
3. గాల్లోని క్రిములను శానిటైజర్ చంపదు. అందుకే ఎవరైనా తుమ్మినా, దగ్గినా శానిటైజ్ చేసుకోవడం వల్ల లాభం ఉండదు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.
4.దాంతో పాటు శానిటైజర్‌ను పిల్లలకు దూరంగా ఉంచాలి.
Also read:Apsara Rani: అప్సరా రాణీ.. సోషల్ మీడియాను ఏలుతున్న కొత్త బ్యూటీ