Revanth Reddy Fires On TRS: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. తెలంగాణ కాంగ్రెస్ పలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో పోలీసులు రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మొదట రేవంత్ రెడ్డిని లంగర్ హౌస్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లినటువంటి పోలీసులు.. ఆ తర్వాత గోల్కోండ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.
అయితే పోలీసుల అదుపులో నుంచి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై, పోలీసులపై ఫైర్ అయ్యారు. మీడియా ఎదుట ఆయన పలు అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ చేయడం లేదని తాము ప్రశ్నించడం తప్పా అని ప్రశ్నించారు. ఆ సమస్యపై శాంతి యుతంగా నిరసన చేపట్టేందుకు వస్తే కాంగ్రెస్ కార్యకర్తల్ని.. నిరుద్యోగుల్ని అరెస్ట్ చేస్తున్నారన్నారు. దాడులకు కూడా పాల్పడుతున్నారన్నారు.
కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్స్ ఎందుకు ఇస్తలేరు అంటూ ఆయన ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు వల్ల ఎంతో మంది నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సంపదను అంతా కూడా కేసీఆర్ కొల్లగొడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిరుద్యోగ దినోత్సవం నిర్వహిస్తే.. టీఆర్ఎస్ పార్టీ గుండాలు వారిపై దారుణంగా దాడులపై పాల్పడ్డారన్నారు. ఇక తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్నారు. కనీసం తాను ఫోన్ చేస్తే.. ఫోన్ ఎత్తడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరీ ఇంత బలుపు ఎందుకంటూ ఆయన ప్రశ్నించారు.
తాము తలుచుకుంటే ఇక నుంచి మీరు రోడ్లపై కూడా తిరగలేరని రేవంత్ రెడ్డి అన్నారు. ఒక దరిద్రుడు తెలంగాణ సీఎం కావడంతోనే రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి నలుగురూ దుష్ట చతుష్టయంగా మారారంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో ఒకవైపు ఉద్యోగాలు లేక యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే... సీఎం కేసీఆర్ మూడు రోజుల జన్మదిన వేడుకలు అససరమా అని ఆయన ప్రశ్నించారు. అయినా ఎవరైనా చనిపోతే.. ఆ సందర్భంగా మూడు రోజులు సంతాప దినాలు చేపడుతారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. పుట్టిన రోజు వేడుకలను ఎవరూ కూడా ఇలా మూడు దినాలు చేసుకోరు అని అన్నారు.
సీఎం కేసీఆర్‌ను రోడ్డుపైకి తీసుకొచ్చే వరకు తాము విశ్రమించమన్నారు. రేపటి నుండి తాము అంతా రోడ్ల మీదే ఉంటామని.. తమ నిరసన ఏంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. త్వరలో మా రాజ్యం కూడా వస్తుందని.. అప్పుడు నీ సంగతి తేలస్తాం కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాస్త భిన్నంగా శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ఊసరవెల్లి ఫొటోతో సీఎం కేసీఆర్‌కు.. రేవంత్ రెడ్డి విషెష్ తెలిపారు.
Also Read: Andhra Pradesh Theatres: థియేటర్లకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి 100 శాతం కెపాసిటీకి అనుమతి
Also Read: Bheemla Nayak OTT: 'భీమ్లా నాయక్' ఓటిటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook