Big King Cobra Vs Small Cobra Full Video Watch Now: ప్రస్తుతం తరచుగా సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కింగ్ కోబ్రాలకు సంబంధించిన వీడియోలైతే షేర్ చేసిన నిమిషాల వ్యవధిలోనే వైరల్‌గా మారుతున్నాయి. దీని బట్టి చూస్తే నెటిజన్స్ ఎక్కువగా నాగు పాములకు సంబంధించిన వీడియోలు చూస్తున్నారనడానికి ఏం సందేహం లేదు. అంతేకాకుండా వాటికి సంబంధించిన స్టోరీస్ ని కూడా ఎక్కువగా చదువుతున్నారని గూగుల్ సెర్చ్ లో ఇటీవల వెళ్లడైంది. అందుకే చాలావరకు సోషల్ మీడియాలో పాముల వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇటీవల అనేక రకాల భారీ కింగ్ కోబ్రాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో గత వీడియోల కంటే చాలా భిన్నంగా ఉంది. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఏముందో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా పాములు ఒకదానికొకటి దాడి చేసుకోవడం చూసి ఉంటాం.. కానీ ఈ వీడియో దీనికి భిన్నంగా ఉంది.. వీడియో వివరాల్లోకి వెళితే.. ఒక పాము నీటిలో తిరుగుతున్న కింగ్ కోబ్రా పై దాడి చేయడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఈ పెద్ద కింగ్ కోబ్రా నీటిలో ఉన్న చిన్న కింగ్ కోబ్రా నడుము భాగంపై దాడి చేసి గాయపరిచేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఆ నీటిలో ఉన్న కింగ్ కోబ్రా తప్పించుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ ఆ కింగ్ కోబ్రా నీటిలో ఉండడంతో అటు ఇటు కదల లేక పోతుంది. అలాగే దాడి చేస్తున్న ఆ కింగ్ కోబ్రా నీటిలో ఉన్న పామును పనికి లాగేందుకు కూడా ప్రయత్నిస్తుంది. ఇలా ప్రయత్నించి పైనకి లాగి మరి.. మరోసారి కాటేసే ప్రయత్నం చేస్తుంది. ఇలా కోబ్రా ఏకధాటిగా ఆ పాము పై దాడి చేస్తూనే ఉంటుంది.
ప్రస్తుతం ఈ ఘటన సింగపూర్‌లోని విండ్సర్ నేచర్ పార్క్ చోటు చేసుకుంది. డిసెంబర్ ఎనిమిదో తేదీన ఆ పార్కు వెళ్లిన కొంత మంది కంటికి ఈ సన్నివేశాలు చిక్కినట్లు తెలుస్తోంది. అయితే ఆ స్థానికులు రెండు కోబ్రాల మధ్య ఫైటింగ్ ని సెల్ ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే స్థానికులు ఈ రెండిటి మధ్య యుద్ధాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. పాములు పాముల మధ్య గొడవలు ఏంటని కొంతమంది అక్కడే ఉండి ఆసక్తిగా చూశారని తెలుస్తోంది. ఈ వీడియోను ఇప్పటివరకు కొన్ని వేల మంది వీక్షించినట్లు తెలుస్తోంది అంతేకాకుండా కొంతమంది నెటిజన్స్ వారి అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో వ్యక్తం చేశారు. రెండు పాముల మధ్య చాలా అరుదుగా గొడవ జరుగుతుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.