Viral Video: దెబ్బలు పడతయిరో.. కిస్సిక్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు వేసిన బామ్మలు.. వీడియో వైరల్..

Pushpa2 movie: పుష్ప2 మూవీలో కిస్సిక్ పాట ఎంత ఫెమస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఈ పాటపై ప్రస్తుతం చాలా మంది రీల్స్ చేసుకుంటూ హల్ చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది బామ్మలు సైతం తామేం తక్కువ తిన్నామా.. అంటూ కిస్సిక్ పాటపై రీల్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 9, 2024, 12:56 PM IST
  • కిస్సిక్ పాటకు అదిరిపోయే స్టెప్పులు..
  • బామ్మ డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా..
Viral Video: దెబ్బలు పడతయిరో.. కిస్సిక్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు వేసిన బామ్మలు.. వీడియో వైరల్..

Old age womans dance on kissik song video viral: పుష్ప2 మూవీ ప్రస్తుతం బాక్సాఫిస్ మీద అన్ని రికార్డులను తిరగరాస్తుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మూవీ చూసేందుకు అభిమానులు థియేటర్లకు పొటెత్తుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ విడుదలై వారం కూడా కాలేదు. గతంలో పలు మూవీలు క్రియేట్ చేసిన రికార్డులను దాటేసింది. అయితే.. ఈ మూవీలో కిస్సిక్ ఐటెంసాంగ్ సినిమాకు హైలేట్ గా మారిందని చెప్పుకొవచ్చు.

ఈ పాటలో శ్రీలీల.. దెబ్బలు పడతయ్ రో అంటూ పాటకు, మ్యూజిక్ కు తగ్గట్టుగా అదిరిపోయేస్టెప్పులు వేసి,ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. ఈ పాట ప్రస్తుతం ట్రెండింగ్ గా మారిందని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ పాటకు ఇటీవల ఒక యువతి తిరుమల కొండ మీద రీల్స్ చేసి వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ పాటపైన మరికొందరు రీల్స్ చేసి ఫ్యాన్స్ ఫాలోయింగ్ లను పెంచుకుంటున్నారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shantai Vruddashram (Old Age Home) (@shantai_second_childhood)

 

తమ టాలెంట్ ను సోషల్ మీడియాలో రీల్స్, వీడియోల రూపంలో తీసి వైరల్ చేస్తున్నారు. అయితే.. సాధారణంగా యువత ఎక్కువగా రీల్స్, వీడియోలు తీస్తుంటారు. మరీ తామేందుకు తీయకూడదనుకున్నారో.. ఏంటో కానీ.. ఇక్కడ కొంత మంది బామ్మలు కిస్సిక్ పాటకు రీల్స్ చేస్తు రచ్చ రచ్చ చేశారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

కొంత మంది బామ్మలు.. అనాథశ్రమంలో ఉన్నట్లు తెలుస్తొంది. వీరంత కలిసి ఇటీవల విడుదలైన పుష్ప2 మూవీలోని కిస్సిక్ పాటకు దెబ్బలు పడతయ్ రో పాటకు మాస్ స్టెప్పులు వేసి అదరగొట్టారు. అంతేకాకుండా.. పాటకు తగ్గట్టుగా ఫెస్ ఎక్స్ ప్రెషన్స్ లు సైతం ఇచ్చారు.

Read more:  పాము.. ఆస్పత్రిలో కూడా..?

మొత్తానికి వీరు.. తగ్గెదెలా అన్న విధంగా కిస్సిక్ పాటకు బామ్మలు కూడా డ్యాన్స్ చేస్తు రచ్చ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం భలే డ్యాన్స్ లు చేస్తున్నారని ప్రశంసిస్తున్నారు. మరికొందరు బామ్మల్లో భలే టాలెంట్ ఉంది భయ్యా..అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

 

Trending News