Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 11, 2021 Rasi Phalalu, ఆ రాశులవారికి ధనలాభం

Today Horoscope In Telugu 11 April 2021: మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 11వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు. ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 11, 2021, 07:53 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 11, 2021 Rasi Phalalu, ఆ రాశులవారికి ధనలాభం

Horoscope Today 11 April 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 11వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుంటారు. మీ గురించి సైతం ఇతరుల అంచనా నిజమవుతుంది. కనుక మీ గురించి చెప్పడంతో పాటు మరియు ఏం కావాలో ఇతరులకు తెలియజేయడం మంచిది. వ్యాపారులకు నిరాశాజనకంగా ఉండనుంది. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే మూల్యం చెల్లించుకుంటారు. 

Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!

వృషభ రాశి
మీ జీవితంలో జరుగుతున్న విషయాలపై మీకు అనుమానం మొదలవుతుంది. ప్రతి ఒక్కరికీ కొన్ని సమయాల్లో సందేహాలు ఉంటాయి. ఇది మీకు విశ్వసనీయతను కలిగించదు. ఆలోచించి మీరు సరైన విషయాన్ని కనుక్కుంటారు. నేడు మీకు ధనలాభం గోచరిస్తుంది. దైవచింతన పెరుగుతుంది. ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు రానున్నాయి. చేపట్టిన పనులలో ముందడుగు వేస్తారు.

మిథున రాశి
మీ ఆర్థిక సమస్యలు తీరనున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులు పెట్టడానికి ఇది ఒక అవకాశంగా మారనుంది. వ్యాపారులకు, ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.

కర్కాటక రాశి 
మీ మనసు, మెదడు ఒకేలా ఆలోచిస్తున్నాయి. ఇది మీ విషయంలో చాలా అరుదుగా జరుగుతుంది. మనసు మాట వింటే ప్రయోజనం చేకూరుతుందని మీరు విశ్వసిస్తారు. ఆచరణాత్మకంగా కూడా ఆలోచిస్తున్నారు. ఇది కెరీర్ మరియు వ్యక్తిగత జీవితం పరంగా మీకు చాలా ప్రయోజనకరమైన రోజు అవుతుంది. వ్యాపారులు నిరుత్సాహానికి గురవుతారు.

సింహ రాశి
మీరు చేపట్టిన పనులలో అధికంగా విజయం సాధించారు. అయితే వీలుకాని పనులు, అసాధ్యమైన పనుల జోలికి వెళ్లరాదని గ్రహిస్తారు. కనుక మీకు సమయం మరియు వనరులు ఉన్న పనులను మాత్రమే చేయడానికి ఒప్పుకోండి. అనారోగ్య సమస్య బాధిస్తుంది. ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. ఉద్యోగులకు పని బారం అధికం కానుంది.

Also Read: Kumbh Mela 2021 Photos: ఘనంగా ప్రారంభమైన హరిద్వార్ కుంభమేళా, ఫొటో గ్యాలరీ

కన్య రాశి
ఈరోజు కొంత సమయం మీ స్నేహితులు, బంధువులతో సరదాగా గడుపుతారు. మీ సహోద్యోగుల ప్రవర్తన మీకు కోపం తెప్పించవచ్చు. అయితే మీ చుట్టూ ఉన్న అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. మీ మనసులో మాటల్ని బహిర్గతం చేయకపోతే సమస్యలు తప్పవు. నేడు మీకు ధనలాభం గోచరిస్తుంది. ఉద్యోగులకు నూతన అవకాశాలు తలుపు తట్టనున్నాయి. 

తులా రాశి
ఈ రోజు వృత్తిపరమైన రంగంలో కీలక అడుగులు వేయబోతున్నారు. మీ జీవితంలో ఓ మెట్టు పైకి ఎక్కుతున్నారు. మీ నాయకత్వ నైపుణ్యాలు పరీక్షించిన తరువాత అదనపు బాధ్యతలు మీకు అప్పగిస్తారు. మానసికంగా ప్రశాంతత కోరుకుంటే ధ్యానం చేయడం వల్ల ప్రయోజనం చేకూరనుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది. ఉద్యోగులు సైతం ఆశించిన ఫలితాలు అందుకుంటారు. 

వృశ్చిక రాశి
ఈ రోజు మీరు కొన్ని విషయాలు, బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కోరుకున్న వ్యక్తిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. నేడు మీకు మంచి రోజు కానుంది. ప్రయాణాల కారణంగా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. రుణ యత్నాలు మొదలుపెడతారు. ఉద్యోగులకు పని ఒత్తిడి అధికం కానుంది.

ధనుస్సు రాశి
మీ ఆలోచనలను నియంత్రించుకోవాలి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ ఆలోచనలను పసిగట్టి ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ప్రయాణాల కారణంగా ఖర్చులు పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతాయి. అరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కొన్ని విషయాలలో విభేదాలు ఏర్పడుతాయి.

Also Read: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా

మకర రాశి
నేడు మకర రాశి వారు భావోద్వేగాన్ని ప్రదర్శిస్తారు. కానీ మీరు నిజంగా ఎలా ఉన్నారో చూసేందుకు ప్రజలు ఇష్టపడతారు. మీ సన్నిహితులలో కొందరు ఖచ్చితంగా మీకు మద్దతుగా నిలుస్తారు. ప్రజలు మిమ్మల్ని సాధారణం కన్నా ఎక్కువగా గౌరవిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగుల సమస్యలు తీరనున్నాయి. పనికి తగ్గ గుర్తింపు దక్కుతుంది.

కుంభ రాశి
ఈ రోజు వ్యక్తిగత, ఇతర విషయాలపై దృష్టి పెట్టవలసిన సమయం ఆసన్నమైంది. మీ సమూహంలో ఉంటూ ఎప్పుడూ కొన్ని కారణాల వల్ల వదిలివేసి వెళ్లిపోయే స్నేహితుడు ఉన్నారా? అతడికి సహకారం అందించండి. కొన్ని పనులను మధ్యలోనే వాయిదా వేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు గోచరించడం లేదు.

మీన రాశి
నేడు మీకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మీ మాటకారితనం వల్ల కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మీ ఆర్థిక, వ్యక్తిగత విషయాలు చాలా బాగుంటాయి. మీ పనిపై నమ్మకం ఉంచాలని గుర్తుంచుకోండి. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News