Silver Foot Shani Dev: 2025లో మీన రాశిలోకి వెండి పాదాలతో అడుగుపెట్టబోతున్న శని.. ఈ రాశుల వారిపై కాసుల వర్షమే!

Silver Foot Shani Dev: 2025 సంవత్సరంలో శని గ్రహం వెండి పాదాలతో మీన రాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు. దీని కారణంగా ఈ క్రింది మూడు రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా దూరం అవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Dec 7, 2024, 09:31 PM IST
Silver Foot Shani Dev: 2025లో మీన రాశిలోకి వెండి పాదాలతో అడుగుపెట్టబోతున్న శని.. ఈ రాశుల వారిపై కాసుల వర్షమే!

Silver Foot Shani Dev: కర్మలకు, క్రమశిక్షణకు మారుపేరుగా భావించే శని గ్రహం అతి త్వరలోనే రాశి సంచారం చేయబోతున్నాడు. ముఖ్యంగా ఈ గ్రహం 2025 సంవత్సరం మార్చి నెలలో మీన రాశిలోకి ప్రవేశించబోతోంది. చాలా ఏళ్ల తర్వాత శని గ్రహం మీన రాశిలోకి వెళ్లబోతోంది. మీన రాశిలోకి ఈ గ్రహం వెళ్లడం వల్ల కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదం అని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే శని మీన రాశిలోకి వెండి పాదాలతో ప్రవేశించబోతున్నాడు. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి సంపద, ఆనందం ఊహించని స్థాయిలో పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే శని సంచార సమయంలో కొన్ని రాశుల వారికి ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయి. దీంతోపాటు జీవితంలో ఆనందం కూడా వెల్లువిరుస్తుంది. శని వెండి పాదాలతో మీనరాశిలోకి వెళ్లడం వల్ల 2025 సంవత్సరం ఏయే రాశుల వారికి ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకోండి.

కన్యా రాశి 
ముఖ్యంగా వెండి పాదాలతో శని మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల కన్యా రాశి వారి జీవితం పూర్తిగా మారబోతోంది వీరికి 2025 సంవత్సరంలో అపారమైన వృద్ధ లభించడమే కాకుండా జీవితంలో ఎప్పుడూ చూడలేని ఆనందాన్ని పొందుతారు. అలాగే వీరికి సమాజంలో కీర్తి, ప్రతిష్టలతో పాటు శ్రేయస్సు కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగులు అయితే ఒప్పుకున్న ప్రాజెక్టులు కూడా ఈ సమయంలో పూర్తిచేసే శక్తిని పొందుతారు అలాగే పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వీరు ఈ సమయంలో ప్రియమైన వారితో ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

మకర రాశి 
మకర రాశి వారికి శని సంచారం కారణంగా అనేక శుభ ఫలితాలు కలుగుతాయి.  ముఖ్యంగా శని అనుగ్రహంతో మకర రాశి వారికి జీవితంలో ఎప్పుడు పొందలేనంత శాంతి లభిస్తుంది. అలాగే ఈ రాశి వారికి సుఖసంతోషాలు కూడా పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మానసిక జీవితం చాలా వరకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఇక వృత్తిపరమైన జీవితంలో పెద్ద పెద్ద మార్పులు వస్తాయి దీని కారణంగా భారీ మొత్తంలో లాభాలు పొందగలుగుతారు. అలాగే వీరికి సంపదలో వృద్ధి కూడా లభిస్తుంది.

Also Read: Ram Gopal Verma: నా అరెస్ట్‌పై మీకు ఎందుకు తొందర.. కేసులపై న్యాయ పోరాటం చేస్తా'

మీనరాశి
మీన రాశి వారికి కూడా శని ప్రభావం వల్ల ఎంతో అద్భుతంగా ఉంటుంది.  2025 సంవత్సరంలో వీరి కోరికలన్నీ సులభంగా నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా కెరీర్ కు సంబంధించిన జీవితంలో అనేక మార్పులు వచ్చి సానుకూల జీవితం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే శని ప్రభావం వల్ల ఆర్థికంగా కూడా మీన రాశి వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కెరీర్ పరంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా సులభంగా తొలగిపోతాయి. దీంతోపాటు శ్రమకు తగిన ప్రతిఫలం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Ram Gopal Verma: నా అరెస్ట్‌పై మీకు ఎందుకు తొందర.. కేసులపై న్యాయ పోరాటం చేస్తా'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News