AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ప్రతిపక్షాలు పొత్తుల లెక్కల్లో మునిగితేలుతున్నాయి. తెలుగుదేశం-జనసేన కూటమిలో బీజేపీ కలుస్తుందా లేదా అనేది తేలకముందే బీజేపీ షరతులు హల్చల్ చేస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం.
Chiranjeevi Rajya Sabha: మరోసారి రాజ్యసభకు చిరంజీవి వెళ్లనున్నారా..? ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పెద్దల నిర్ణయానికి చిరు ఓకే చెప్పారా ? అంటే ఔననే అంటున్నాయి దిల్లీలోని రాజకీయ వర్గాలు.
Bihar Politics: బిహార్‌లో మరోసారి రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. మహాఘట్బంధన్ కూలిపోయి మరో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి అరుదైన ఘనత నెలకొల్పారు. మంత్రివర్గంలో మూడు పార్టీలతో;పాటు ఒక స్వతంత్రుడికి అవకాశం లభించింది.
Nitish kumar: నితీష్ కుమార్ రాజీనామా చేయడంపై కాంగ్రెస్ నేతలు అనేక రకాలుగా సెటైర్ లు వేస్తున్నారు. తాజాగా, లాలు కూతురు కూడా ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో సంచలన పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ పొత్తు ధర్మం పాటించడం లేదని పవన్ కళ్యాణ్ చేసిన హాట్ కామెంట్స్‌తో ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఒక పార్టీతో మరో పార్టీ చర్చించకుండా చెరో స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి.
BJP Focused LS Elecitons: సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి విజయంపై ధీమాగా ఉన్న బీజేపీ ఈసారి దక్షిణ భారతదేశంపై ప్రధాన దృష్టి సారించినట్లు తెలిసింది. దక్షిణాదిపై పట్టు సాధించేందుకు తెలంగాణే ప్రధాన కేంద్రంగా కమల దళం భారీ వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలోనే అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు అమిత్ షా పర్యటిస్తున్నారు.
Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానమైన కరీంనగర్‌ను తిరిగి నిలబెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. మరోసారి అక్కడి నుంచి బండి సంజయ్‌ను బరిలోకి దింపాలని పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. పార్టీ ఆదేశాల మేరకు సంజయ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తుండగా.. ఆ సభకు అమిత్ షా రానున్నారు.
AP Elections 2024: ఏపీ ఎన్నికల సమయం సమీపిస్తోంది. ఎన్నికల వాతావరణం పూర్తిగా వేడెక్కుతోంది. అభ్యర్దుల మార్పులతో వైసీపీ దూసుకుపోతుంటే..ప్రతిపక్షం టీడీపీ-జనసేన కూటమి పొత్తు సమీకరణాల్లో నిమగ్నమైంది. ఈలోగా ఏపీలో ఈసారి అధికారం ఎవరిదనే విషయంపై జరిగిన తాజా సర్వే ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
AP Assembly Elections 2024: ఏపీలో టీడీపీతో పొత్తుపై బీజేపీ ఏం ఆలోచిస్తోంది..? కలిసి వెళతారా..? విడిగా పోటీ చేస్తారా..? ఒక వేళ పొత్త వద్దనుకుంటే.. జనసేనను వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉందా..? ఇప్పుడివే ప్రశ్నలు బీజేపీలోనే కాదు.. టీడీపీ, జనసేన నేతల్లోనూ వ్యక్తమవుతున్నాయి. బీజేపీ-టీడీపీ పొత్తు వ్యవహారంలో కీలక పరిణామాలు త్వరలో చోటు చేసుకోబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంటోంది.
Telangana Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రిజల్ట్ రావడంతో బీజేపీ అధిష్టానం నేరుగా రంగంలోకి దిగింది. కేంద్రంలో అధికారమే చేపట్టడమే లక్ష్యంగా ప్లాన్ రూపొందిస్తోంది. గత ఎన్నికల కంటే మెజారిటీ సీట్లు కైవసం చేసుకునేందుకు గ్రౌండ్ లెవల్లో సిద్ధమవుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
Ayodhya Rammandir: అయోధ్య రామమందిరం వ్యవహారంలో యూబీటీ శివసేన అధినేత సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామమందిర ప్రారంభోత్సవాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Petrol Diesel Price Cut: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఎట్టకేలకు వాహనదారులకు ఉపశమనం లభించనుంది. కేంద్ర ప్రభుత్వం లీటర్‌కు రూ.8 నుంచి రూ.10 తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమవ్వగా.. పీఎం మోదీ నిర్ణయం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
Who is Madhya Pradesh Next CM: మధ్యప్రదేశ్ సీఎం పీఠంపై ఎవరు కూర్చొంటారనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. బీజేపీ అధిష్టానం సోమవారం కొత్త ముఖ్యమంత్రి ఎవరో ఫైనల్ చేయనుంది. రేసులో ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహన్తోపాటు మరో ఇద్దరు ఉన్నారు.
Ap Elections Survey: తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించిన తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకు పట్టం కట్టాడు. ఇప్పుడిక అందరి దృష్టి ఏపీపై పడింది. తెలంగాణ ఫలితాలు ఏపీపై ఉంటాయనేది కొందరు అంచనా వేస్తున్న తరుణంలో ఓ సర్వే హల్చల్ చేస్తోంది.
Telangana Election Results 2023: తెలంగాణలో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమౌతోంది. మూడోసారి హ్యాట్రిక్ కొడతామని భావించిన బీఆర్ఎస్ పార్టీకు షాక్ తగిలింది. అంతా బాగుందని బావించినా బీఆర్ఎస్ ఎందుకు ఓడింది..ఇప్పుడిదే చర్చనీయాంశమైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Rajasthan Election Results 2023: దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రాజస్థాన్‌లో ఊహించినట్టే బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానంలో ఉన్న రెండు పార్టీల మధ్య తేడా పెద్దగా కన్పించడం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.