Minister Harish Rao: మహాభారతంలో కౌరవుల్లాగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడ గౌరవెల్లి ప్రాజెక్టును ఆపాలని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ చివరకు న్యాయం గెలిచి ధర్మం నిలబడ్డట్టు మేము రైతుల కోసం, ప్రజల కోసం చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశాం.
Revanth Reddy About Rythu Bandhu Scheme: రాజకీయాలనే భవిష్యత్తుగా మార్చుకుని ప్రజా సేవ చేయాలనుకునే వారికి యూత్ కాంగ్రెస్ ఒక మంచి వేదిక అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నాయకుడుగా మారడానికి యూత్ కాంగ్రెస్ ఒక చక్కటి వేదిక అవుతుంది అని చెప్పడానికి తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేనే మనకు ఒక ఉదాహరణ అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
BRS MLC Kalvakuntla Kavitha: తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందని ఇల్లే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఏం చేశారని సంబరాలు జరుపుకుంటున్నారని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు ఇంటింటికి తిరిగి ఫలాలు ఎలా అందుతున్నాయో చూడాలని సవాల్ విసిరారు. మంచి పనులు చేయడంలో దేశానికి తెలంగాణ ఉదాహరణగా నిలిచిందని తెలిపారు.
Mallu Bhattivikramarka's open letter to KCR: రాష్ట్ర వ్యాప్తంగా వందల మంది ప్రజలపై పోలీసులు పెడుతున్న వేధింపులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు రాసిన బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేశారు.
BRS MLA Jeevan Reddy Challenges Dharmapuri Aravind: నిజామాబాద్ ఎంపీ అరవింద్.. నీకు దమ్మూ ధైర్యం ఉంటే ఆర్మూర్ నియోజకవర్గంలో నాపై పోటీ చెయ్యి అని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ధర్మపురి అరవింద్ కి సవాల్ విసిరారు.
BRS MLC Kalvakuntla Kavitha: “బీఆర్ఎస్ పార్టీ కుటుంబం చాలా పెద్దది. కేసీఆర్ మనస్సు పెద్దది. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఇతర పార్టీల బహిరంగ సభల కంటే పెద్దగా జరుగుతున్నాయి. గులాబీ కండువా కప్పుకున్న వాళ్లందరికీ పెద్ద బాధ్యత ఉంటుంది. గులాబీ కండువా కప్పుకున్నామంటే తెలంగాణ ప్రజలకు గులాముల్లాగా పనిచేయాలి" అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
Minister KTR Fires On Congress: కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ నేతలను గంగిరెద్దులతో పోల్చారు. ములుగు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. జాతీయస్థాయిలో ములుగు రెండోస్థానంలో ఉందని గుర్తుచేశారు.
సీఎం కేసీఆర్ నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ కార్యాలయం, మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం కొల్లాపూర్ చౌరస్తాలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.
YS Sharmila Slams BJP, BRS: బీఆర్ఎస్ పార్టీ, బీజేపి మధ్య రహస్య స్నేహం ఉందన్న వైఎస్ షర్మిల.. ఈ రెండు పార్టీల తీరు లోకం ముందు నువ్వు కొట్టినట్లు చేస్తే.. నేను ఏడ్చినట్లు చేస్తా.. అన్న చందంగా ఉంది అని ఎద్దేవా చేశారు. అంతటితో ఊరుకోని వైఎస్ షర్మిల.. ఇంతకీ మీరు నడిపే రహస్య దోస్తానం ప్రీ పోల్ ఒప్పందమా ? లేక పోస్ట్ పోల్ ఒప్పందమా ? అని సూటిగానే ప్రశ్నించారు.
ఎల్బీ నగర్ బీఆర్ఎస్లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి కేటీఆర్ కార్యక్రమం అనంతర బాహాబాహీకి దిగాయి. ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, బీఆర్ఎస్ ఇంఛార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ మధ్య వివాదం మరోసారి బట్టబయలు అయింది. పూర్తి వివరాలు ఇలా..
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతు దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రైతులపై ఆయన మండిపడ్డారు. అకాల వర్షాలకు సంబంధించి నష్టం గురించి రైతులు ప్రశ్నించగా.. వారికి అభ్యంతరకర పదాలతో దూషించారు కౌశిక్ రెడ్డి.
Telangana Formation Day : తెలంగాణలో కుటుంబ పాలనతో ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దొరికి అన్ని చోట్లా అప్పులు తెస్తున్నారని, తెలంగాణ తెచ్చుకున్నది అప్పుల కోసమా? అని నిలదీశారు. నిధులు రాక సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నాడు.
Harish Rao : రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం డబ్బులు చెల్లించిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రైతు బంధు ఇస్తున్నామని తెలిపాడు. ఇప్పుడు రైతుల అదాయం పదింతలు పెరిగిందని అన్నాడు. రైతులు చనిపోతే భీమా సైతం ఇస్తుందని అన్నాడు.
KTR on Telangana Assembly Elections: కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దమ్ముంటే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. మరో ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి కౌంటర్ ఇచ్చారు.
Telangana Farmationday : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుతామని కేంద్రం ప్రకటించడంతో బీఆర్ఎస్ ఇరకాటంలో పడినట్టు అయింది. వేడుకలు నిర్వహిస్తున్న విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. గోల్కొండ కోటలో ఘనంగా ఈ వేడుకలు జరుపబోతోన్నట్టుగా తెలిపారు
ప్రజల అభ్యంతరాల మేరకే ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మాస్టర్ ప్లాన్ జీవో 238 రద్దు చేసినట్లు తెలిపారు. కొందరు కావాలని రైతులను రెచ్చగొట్టారని మండిపడ్డారు.
కాంగ్రెస్‌పై పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎన్నికల్లో పోటీ చేసుందుకు ఆ పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదంటూ సెటైర్లు వేశారు. పూర్తి వివరాలు ఇలా..
MLA Redya Naik Fires On Woman: నర్సింహులపేట మండలంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఏం చేశారంటూ ఓ మహిళ నిలదీసింది. దీంతో ఆమె పెన్షన్ కట్ చేయాలంటూ ఎమ్మెల్యే అధికారులను ఆదేశించడం విశేషం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.