Screening Committee: మరోవైపు త్వరలో ఎన్నికల జరిగే రాష్ట్రాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది.
Jitta Balakrishna Reddy: తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలుగా పేరున్న వారిలో ఒకరైన జిట్టా బాలక్రిష్ణ రెడ్డి ఇటీవల సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారనే కారణంతో బీజేపి నుంచి సస్పెన్షన్ కి గురైన సంగతి తెలిసిందే. తాజాగా జిట్ట బాలకృష్ణా రెడ్డి హైదరాబాద్ గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడుతూ బీజేపిపై మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర నాయకత్వానికి జిట్ట బాలకృష్ణా రెడ్డి సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు.
MLA Vanama Venkateswara Rao Disqualified: 2018 ఎన్నికల్లో జలగం వెంకట్ రావు బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయగా వనమా వెంకటేశ్వర్ రావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికలో 4,139 ఓట్ల తేడాతో విజయం సాధించిన వనమా వెంకటేశ్వర్ రావు ఆ తరువాత చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల బాటలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
బీజేపీ సీనియర్ నేత డీకే అరుణపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గద్వాల జిల్లా అమ్మగారి బంగ్లాలో బందీ అయిందన్నారు. గద్వాల ప్రజలను బంగ్లాలో బానిసలుగా మార్చారని అన్నారు. పాలమూరులోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా ఇంకా మంటలు చల్లారడం లేదు. అన్ని వైపులా నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కరీంనగర్లో కాంగ్రెస్ మహిళా నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 30న కొల్లాపూర్ సభలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రియాంక గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
KTR's Plan for Revanth Reddy: ఇటీవల తెలంగాణలో ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి, ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి మధ్య తీవ్ర స్థాయిలో పెను మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. ఇరుపక్షాల నేతలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో నేతలు కొత్తగా చేరాల్సిన అవసరం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాంబ్ పేల్చారు. 12కు 12 స్థానాలు రిజర్వ్ అయిపోయాయని అన్నారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కోదాడ శశిధర్ రెడ్డి పార్టీలో చేరే అంశం ఇప్పటివరకు చర్చకు రాలేదన్నారు. త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రోడ్ మ్యాప్ కోసమే ముఖ్యనేతలను ఆహ్వానించానని అన్నారు. ఆగస్టు నుంచి ప్రచారాన్ని ఉధృతం చేస్తామన్నారు. అందరం కలిసికట్టుగా బస్ యాత్ర చేయాలనేది తన కోరిక అని అన్నారు.
Ponguleti Srinivas Reddy About Land Kabja Allegations: తనకు ప్రచార కమిటీ కో చైర్మన్ గా బాధ్యతలు ఇచ్చిన ఏఐసీసీ, పీసీసీ నేతలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి కష్టపడి పనిచేస్తాను అని అన్నారు.
జులై 8న రాహుల్ గాంధీ హరియాణాలో పర్యటించారు విషయం తెలిసిందే! అక్కడి రైతులు మహిళ రైతులు కొందరు ఢిల్లీలోని మీ ఇంటిని ఒక సారి చూడాలని ఉందంటూ మాటల మధ్యలో రాహుల్ గాంధీని కోరడంతో అమ్మ సోనియా గాంధీ ఇంటికి రమ్మని కోరగా.. వచ్చిన వారితో సోనియా గాంధీతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
Dasoju Sravan Kumar Got Threatening Calls: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకోమంటూ తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తెలిపారు. ఈ కాల్స్‌పై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోషులను గుర్తించి.. శిక్షించాలని కోరారు.
Telangana Congress: కొల్లాపూర్ సభకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాటు చేస్తున్నారు. ప్రియాంక గాంధీ రానుండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నేతలు...ఖమ్మం జనగర్జనకు ధీటుగా కొల్లాపూర్ సభకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
మల్లు భట్టివిక్రమార్కతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరికపై ఆయన చర్చించారు. కొల్లాపూర్ సభలో ప్రియాంకగాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
Rajasthan Assembly Elections 2023: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ వచ్చింది. ఆ పార్టీలో సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య విభేదాలు సద్దుమణిగాయి. వచ్చే ఎన్నికల్లో అశోక్ గెహ్లాట్‌తో కలిసి కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తానని సచిన్ ప్రకటించాడు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారానికి చెక్ పడింది. ఆయనను జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించింది బీజేపీ అధిష్టానం. దీంతో జేపీ నడ్డా, అమిత్ షాకు థ్యాంక్స్ చెబుతూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు.
Etela Rajender is BJP's CM candidate: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి ఉన్నట్టుండి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారారు. తెలంగాణ బీజేపిలో ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్ నియమితులయ్యారు. బీజేపి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటనేది జీ న్యూస్ తెలుగు ఎడిటర్ భరత్ విశ్లేషిస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Ponguleti Srinivasa Reddy-Komatireddy Rajgopal Reddy Meet: తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు మార్పు జరిగిన రోజే కోమటిరెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.