రేపటి నుంచి మళ్లీ గగనయానం పునఃప్రారంభం కాబోతోంది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా నేలకే పరిమితమైన గగన విహంగాలు.. మళ్లీ రేపటి నుంచి నింగిలోకి ఎగరబోతున్నాయి.
'కరోనా వైరస్' కారణంగా లాక్ డౌన్ విధించడంతో జనం ఇళ్లకు పరిమితమయ్యారు. దీంతో జంతువులు అటవీ ప్రాంతాల నుంచి జనావాసాల్లోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్లో నడి రోడ్డుపై చిరుత దర్శనమిచ్చింది.
'కరోనా వైరస్' కారణంగా దేశంలో ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలస కూలీల కోసం కేంద్రం ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్లు నడిపిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 200 రైళ్లు నడిపినట్లు తెలుస్తోంది. దీంతో వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు.
'కరోనా' మహమ్మారి తెలుగు రాష్ట్రాలను అల్లాడిస్తోంది. రోజు రోజుకు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లోనూ రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.
'కరోనా వైరస్' మహమ్మారి.. రాకాసి పడగ వెంటాడుతోంది. భారత దేశంలో పాజిటివ్ కేసుల విపరీతంగా పెరుగుతోంది. రోజు రోజుకు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్న కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.
'కరోనా వైరస్' కారణంగా లాక్ డౌన్ విధించడంతో రెండు నెలల పాటు రైల్వే సర్వీసులు ఆగిపోయాయి. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 37 వేల ప్రయాణీకుల రైళ్లు లూప్ లైన్లకే పరిమితమయ్యాయి. ఇప్పుడిప్పుడే రైల్వే సర్వీసులు పునఃప్రారంభిస్తున్నారు.
'కరోనా వైరస్' కేసులు ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు. రోజు రోజుకు శరవేగంగా కరోనా గ్రాఫ్ పెరిగిపోతోంది. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఇంకా ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.
'కరోనా వైరస్' కారణంగా విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే లాక్ డౌన్ 4.0 అమలులోకి వచ్చింది. తెలంగాణలో లాక్ డౌన్ మే 31వరకు పొడగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
'కరోనా' మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. భారత దేశంలో రోజు రోజుకు కేసుల సంఖ్య రికార్డుస్థాయికి చేరుకుంటోంది. 10 రోజుల క్రితం వరకు వందల సంఖ్యకు పరిమితమైన ఒక్క రోజు కేసుల సంఖ్య.. ఇప్పుడు ఏకంగా 5 వేలు దాటిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో 'కరోనా వైరస్' కోరలు చాస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొన్నటికి మొన్న 25 కొత్త కేసులు నమోదయ్యాయి. కానీ నిన్నటికి పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ రెట్టింపైంది. దీంతో ఏపీలో ఆందోళన పెరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో 'కరోనా వైరస్' విస్తృతి తగ్గడం లేదు. రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వలస కూలీలు స్వరాష్ట్రానికి రావడంతో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.
'కరోనా వైరస్' కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల వలస కార్మికులకు కష్టాలు తప్పడం లేదు. ఊరు కాని ఊరులో అష్టకష్టాలు పడుతున్నారు. దీంతో తమ స్వస్థలాలకు వెళ్లాలని కాలినడకనే పయనం కట్టారు.
'కరోనా వైరస్' దెబ్బ కారణంగా భారత ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. ఈ నేపథ్యంలో అన్ని రంగాలకు ఊతమిచ్చేలా 20 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
'కరోనా వైరస్' కరాళ నృత్యం చేస్తున్న వేళ.. అందరి చూపు ఒకటే వైపు. అదే ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా..? అని. ఐతే ఆ సమయం రానే వచ్చేస్తోందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO ఓ తీయటి కబురు వెల్లడించింది.
భారతదేశంలోనూ 'కరోనా వైరస్' కోరలు చాస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్యలో విపరీతంగా పెరుగుదల కనిపిస్తూనే ఉంది. నిన్న ఒక్కరోజే భారత దేశంలో నమోదైన కేసుల సంఖ్య కొత్త రికార్డులకు తెరతీస్తోంది.
'కరోనా వైరస్' కారణంగా విధించిన లాక్ డౌన్ 3.0 నేటితో ముగియనుంది. రేపటి నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 4.0 అమలులోకి రానుంది. ఈ క్రమంలో ఆంక్షలు సడలించి మరిన్ని కార్యకలాపాలకు అనుమతలు ఇవ్వనున్నారు.
'కరోనా వైరస్' ప్రభావం ప్రపంచ సినిమా పరిశ్రమపై విపరీతంగా పడింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే షూటింగ్ లు ఆగిపోయాయి. నిర్మాణం పూర్తి చేసుకున్న సినిమాలు కూడా విడుదలకు నోచుకోని పరిస్థితి నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.