18 students test covid 19 positive in Mumbai: ఆ స్కూల్లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి తండ్రి ఒకరు ఇటీవల ఖతార్ నుంచి ముంబై వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అతనికి కోవిడ్ నెగటివ్‌గా తేలినప్పటికీ... అతని కొడుక్కి మాత్రం పాజిటివ్‌గా నిర్దారణ అయింది.
Omicron cases in India: ఒమిక్రాన్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా మరో 10 ఒమిక్రాన్ (Omicron) కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కి చేరింది.
భారతదేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఓమిక్రాన్ కేసుల నేపథ్యంలో థర్డ్ వేవ్ తప్పదు అని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ డాక్టర్ అశోక్ సేథ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోస్ సిద్దం చేసుకోవాలి సూచించారు.
Corona cases in India: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కొత్త కేసుల సంఖ్య మరోసారి 8 వేల దిగువన నమోదైంది. యాక్టివ్ కేసులు 90 వేల దిగువకు తగ్గాయి.
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కొత్త వేరియెంట్ ఒమిక్రాన్.. తెలంగాణలోకి కూడా ప్రవేశించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏడేళ్ల చిన్నారికి కూడా పాజిటివ్ అని తేలింది.
Kareena Kapoor and Amrita Arora test Covid 19 positive: బాలీవుడ్ హీరోయిన్లు కరీనా కపూర్, అమృతా అరోరా కరోనా బారినపడ్డారు. ఈ ఇద్దరు కోవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘించినట్లు బృహత్ ముంబై కార్పోరేషన్ వెల్లడించింది.
తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో రెండో కేసు నమోదైంది. జింబాంబ్వే నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. దాంతో దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 30 దాటింది.
ఇటీవల విదేశాల నుంచి మహారాష్ట్రకు మొత్తంగా 318 మంది తిరిగి వచ్చారు. అందులో కనీసం 12 మంది ఆచూకీ ఇప్పుడు తెలియట్లేదు. వీరంతా థానేలోని కళ్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతానికి చెందిన వారే అట. ఈ విషయాన్ని KDMC చీఫ్ విజయ్ సూర్యవంశీ తెలిపారు.
బోర్డు మీటింగ్ కోసం దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చిన 66 ఏళ్ల వ్యక్తికి కరోనా నెగటివ్ రావడంతో క్వారంటైన్లో ఉంచగా.. అక్కడి నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. అయితే పారిపోయిన వ్యక్తితో సహా హోటల్ సిబ్బందిపై బెంగళూరు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.
కరోనా థర్డ్ వేవ్ భారత దేశంలో ఫిబ్రవరి నాటికి గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని ఐఐటీ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ అభిప్రాయపడ్డారు. దేశంలో రోజుకు 1-1.5 లక్షల కేసులు నమోదవుతాయని అంచనా వేశారు.
Omicron Status: ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచంపై ముప్పేట దాడి చేస్తోంది. ఒక్కొక్కదేశానికి సంక్రమిస్తూ ఆందోళన రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ సోకిన దేశాల సంఖ్య అప్పుడే 46కు చేరుకుంది.
First omicron case in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి ఒమిక్రాన్ వేరియంట్ బారినపడ్డాడు. ఢిల్లీలో మొదటి ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఈ కేసుతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య ఐదుకి చేరింది.
Third Omicron case in India: భారత్‌లో మరో ఒమిక్రాన్ కేసు బయటపడింది. గుజరాత్‌లోని జామానగర్‌లో 72 ఏళ్ల ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లుగా నిర్దారణ అయింది. ఇటీవలే అతను జింబాబ్వే నుంచి దక్షిణాఫ్రికా మీదుగా భారత్ వచ్చినట్లు గుర్తించారు.
First coronavirus case in Cook Islands: ప్రపంచ దేశాలన్నీ దాదాపు రెండేళ్లుగా కరోనాతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. కానీ ఓ దేశంలో మాత్రం ఇటీవలే కరోనా మొదటి కేసు నమోదైంది. కేవలం 17వేల జనాభాతో ఉండే కుక్ దీవుల్లో మొదటి కరోనా కేసును గుర్తించినట్లు ఆ దేశ ప్రధాని వెల్లడించారు.
Professor kills his family over omicron fears: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కి చెందిన ఓ ప్రొఫెసర్ దారుణానికి ఒడిగట్టాడు. ఒమిక్రాన్ భయంతో తన కుటుంబాన్నే బలి తీసుకున్నాడు. భార్య, పిల్లలను కిరాతకంగా హతమార్చాడు.
TS News: దేశవ్యాప్తంగా 'ఒమిక్రాన్' భయాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 12 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,216 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు (Corona new cases in India) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. మొత్తం 11,57,156 శాంపిళ్లను టెస్టు చేయగా ఈ కేసులు బయపడ్డట్లు తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.