COVID-19 Vaccine Formula: భారత్‌లో కరోనా మహమ్మారి రెండో దశలో అలజడి సృష్టిస్తోంది. ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పోరాటం చేస్తున్నాయి. అయితే భారత్ సహా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో అమెరికా కరోనా వ్యాక్సిన్ ఫార్ములాను పంచుకోకూడదని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు.
Cancer Patients COVID-19 Positive: చిన్నారుల ఆసుపత్రిలో బాధితులపై ప్రయోగాలు చేయగా, క్యాన్సర్ బారిన పడిన కొందరిలో, క్యాన్సర్‌ను జయించిన వారిలో సైతం కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కొన్ని నెలలపాటు కోవిడ్19 నిర్ధారణ పరీక్షలలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
Uses Of Covid-19 Vaccination | కోవిడ్19 మహమ్మారిని అత్యుత్తమంగా ఎదుర్కొన్న దేశమైన భారత్ కరోనా టీకాలను సైతం ఉత్పత్తి చేసి దాదాపు 60 దేశాలకు పంపిణీ చేసి సాయం చేసింది. కానీ అంతలోనే పరిస్థితులు మారిపోయాయి. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా కేసులు భారత్‌లో నమోదవుతున్నాయి.
Mohan Babu Receives 2nd dose of Corona Vaccine: పలువురు సెలబ్రిటీలు కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా తమ వంతు బాధ్యతగా కోవిడ్19 టీకాలు తీసుకుంటున్నారు. మరోవైపు సెకండ్ వేవ్‌లో భయానక వాతావరణం నెలకొంది. టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు నేడు కరోనా టీకా తీసుకున్నారు.
Free COVID-19 vaccine in Telangana: హైదరాబాద్: కరోనా కట్టడికి తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికీ కొవిడ్-19 వాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించుకున్న సీఎం కేసీఆర్... ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కి, వైద్యశాఖ అధికారులకూ ఆదేశాలు జారీ చేశారు.
Mahesh Babu in isolation: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఐసోలేషన్‌లో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. సర్కారు వారి పాట మూవీ షూటింగ్ సెట్లో తన పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్‌కి కరోనా సోకినట్టు తేలిన వెంటనే మహేష్ బాబు సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లినట్టు ఫిలింనగర్ టాక్. మహేష్ బాబు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్‌తో పాటు, సర్కారు వారి పాట మూవీ (Sarkaru vaari paata movie) యూనిట్‌లోని మరో నలుగురు సభ్యులకు కూడా కరోనా నిర్దారణ అయినట్టు సినీవర్గాలు చెబుతున్నాయి.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ కరోనా టీకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 19న ప్రకటించింది. ఇది వరకే రెండో దశలలో కరోనా వ్యాక్సినేషన్ జరగగా, మూడో దశలో వ్యాక్సినేషన్ మే 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా ప్రారంభించనున్నామని కేంద్రం ప్రకటించింది.
COVID Vaccination registration for those above 18+ on CoWin: న్యూ ఢిల్లీ: కరోనా కట్టడి కోసం మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని ఇటీవలే కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే కేంద్రం శనివారం నుండే.. అంటే ఏప్రిల్ 24 నుంచి కొవిన్ అధికారిక పోర్టల్‌పై (CoWin portal) 18 ఏళ్లు పైబడిన వారికి తమ పేర్లు నమోదు చేసుకునే వీలు కల్పించింది.
Vitamin D deficiency in COVID-19 patients: లండన్: కరోనావైరస్కి ( COVID-19 vaccine ) చెక్ పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ప్రయోగాలు జరుగుతున్నాయో... మరోవైపు కరోనా సోకుతున్న ( Coronavirus infection ) వారిపైనా అందుకు గల కారణాలపై పరిశోధనలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి.
Former PM Manmohan Singh health condition: న్యూ ఢిల్లీ: మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్‌కి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్థారణ అయింది. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో (Delhi AIIMS) చేర్పించారు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్‌కి ఎయిమ్స్ ట్రామా కేర్ సెంటర్లో వైద్య నిపుణుల సమక్షంలో చికిత్స జరుగుతోంది.
Sonu Sood tested positive for COVID-19: ప్రముఖ నటుడు సోనూ సూద్‌కి కరోనా సోకింది. శనివారం నిర్వహించిన కొవిడ్-19 పరీక్షల్లో (COVID-19 tests) పాజిటివ్ అని తేలింది. అన్నట్టు సోనూ సూద్ 10 రోజుల క్రితమే కరోనావైరస్ వ్యాక్సిన్ తొలి డోస్ (COVID-19 vaccine first jab) తీసుకున్నారు.
Comedian vivek's health condition: ప్రముఖ తమిళ కమెడియన్ వివేక్ గుండెపోటుతో ఇవాళ ఉదయం 11 గంటలకు చెన్నైలోని సిమ్స్ (SIMS) ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. నిన్న గురువారం కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వివేక్ ఇవాళ ఉన్నట్టుండి గుండెపోటుతో (Heart attack) ఆస్పత్రిలో చేరడం ఆయన అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. తాజాగా వివేక్ ఆరోగ్య పరిస్థితిపై ఎస్ఆర్ఎం ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ ఓ హెల్త్ బులెటిన్ (Health bulletin) విడుదల చేసింది.
DCGI Approves Emergency Use Of Sputnik V: స్పూత్నిక్ వి టీకాను ఆమోదించిన సమయంలో పలు అనుమానాలు తలెత్తాయి. కానీ అనంతరం దీని మెరుగైన ఫలితాలు అనుమానాలకు చెక్ పెట్టింది. రెండో డోసు టీకా తీసుకున్న వారం తరువాత నుంచి రోగ నిరోధకశక్తి పెరుగుతుందని నిర్ధారించారు.
Foods to take and foods to avoid before and after COVID-19 vaccine: కరోనావైరస్కి విరుగుడుగా వ్యాక్సిన్ తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు ? ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. ఏం తింటే వ్యాక్సిన్ ప్రభావం తగ్గుతుందో, ఏం తింటే వ్యాక్సిన్ ఇంకా ప్రభావవంతంగా పనిచేస్తుందోననే సందేహం చాలామందిలో ఉంది. ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నమే ఈ కథనం.
Surgical face mask or 5-layered mask: కరోనావైరస్ను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద యుద్ధమే జరుగుతోంది. కరోనాను కట్టడి చేసేందుకు ఉన్న అన్ని మార్గాలపై నిరంతంరంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న తుంపర్లు (Droplets) నోటిలోంచి విడుదలైన మరుక్షణమే 5 సెకన్లలో 4 అడుగుల దూరం వరకు ప్రయాణించగలవని తేల్చిచెప్పిన ఐఐటి భుననేశ్వర్ (IIT Bhubaneswar) పరిశోధకుల బృందం.. అందుకే మాట్లాడేటప్పుడు సర్జికల్ మాస్క్ ధరించకూడదని సూచించింది.
Sunlight May Lower Risk Of Covid-19 Deaths | ఎండలో బయటతిరిగే వారిలో, ప్రతిరోజూ కొంత సమయం ఎండలో ఉండే వ్యక్తులలో కరోనా మరణాలు చాలా తక్కువగా ఉందట. ఈ విషయాన్ని బ్రిటీష్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ పబ్లిష్ చేసింది.
No Shortage Of COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ మోతాదులు లేకుండా టీకా ఉత్సవ్ ఎలా నిర్వహిస్తారని ప్రతిపక్షాలు విమర్శలు లేవనెత్తుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి మీడియాతో శుక్రవారం మాట్లాడారు. దేశ ప్రజలకు అందించేందుకు తగినన్ని కోవిడ్19 టీకాలు అందుబాటులో ఉన్నాయని, మరిన్ని మోతాదులు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు.
CoronaVirus Cases In India: ఒక్కరోజు లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రజలతో పాటు ప్రభుత్వాలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందుకు కారణాలను విశ్లేషించింది.
AP CM YS Jagan Receives COVID-19 Vaccine: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం కరోనా టీకా వేయించుకున్నారు. ఆయనతో పాటు సతీమణి వైఎస్ భారతి కోవిడ్-19 టీకా తీసుకున్నారు.
Lockdown in Delhi, Minister Satyendar Jain clarity: కరోనావైరస్ సెకండ్ వేవ్ తీవ్రత రోజుకింత పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో కరోనా కేసులు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో గురువారం వరకే అప్పటికి గత 4 రోజుల్లో మొత్తం 4758 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి మొత్తంలో నమోదైన 4193 కేసుల కంటే ఈ సంఖ్యే అధికంగా ఉండటం Delhi govt తో పాటు అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.