బీహార్ ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ (NDA) తిరిగి అధికారంలోకి వస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామంటూ బీజేపీ (BJP) మ్యానిఫెస్టోలో ప్రకటించింది. దీనిపై ఇప్పటికే విపక్ష పార్టీలు బీజేపీపై విరుచుకుపడుతున్నాయి.
బీహార్ ఎన్నికల ఎన్నికల ( bihar election ) నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని బీజేపీ (BJP) మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇంకా తయారు కాని వ్యాక్సిన్‌ను ఎలా ఉచితంగా అందిస్తారంటూ ఎన్డీఏ కూటమిని విపక్షపార్టీలన్నీ చుట్టుముడుతున్నాయి. ఈ తరుణంలోనే కేంద్ర మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి (Pratap Chandra Sarangi) కీలక ప్రకటన చేశారు.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసులు, మరణాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఎలాగైనా కోవిడ్ 19 టికా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో భారత ప్రభుత్వ సహకారంతో ఫార్మా కంపెనీలు క్లినికల్ ట్రయల్స్‌ను వేగవంతం చేశాయి.
సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( Serum Institute Of India ) శుభవార్త తెలిపింది. మార్చి 2021 నాటికి కోవిడ్-19 ( Covid-19 ) వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది అని సీరం ఇనిస్టిట్యూడ్ ఆఫ్ ఇండియా డైరక్టర్ డాక్టర్ సురేష్ జాదవ్ స్పష్టం చేవారు. కరోనావైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న భారతీయులకు ఈ వార్త ఆశాజనకంగా కనిపిస్తోంది.
కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి ( US President Donald Trump ) మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే అమెరికాలో కరోనావైరస్ ( Coronavirus in USA) కట్టడి చేయలేకపోయాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. తాజాగా మొడెర్నా బయోటెక్ సంస్థ ( Moderna biotech ) మరో షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది.
ప్రస్తుతం చివరి దశలో ఉన్న వ్యాక్సిన్లు, మార్కెట్లోకి వచ్చిన వ్యాక్సిన్ల కన్నా ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ (Johnson and Johnson COVID-19 vaccine) సింగిల్ డోస్ ద్వారా కరోనాను అంతం చేయవచ్చునని కంపెనీ తెలిపింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలోో డొనాల్డ్ ట్రంప ్ తన శాయశక్తులా పనిచేస్తున్నారు. తన మాటలను ఓట్లుగా మలుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలోనే అమెరికా పౌరులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని (COVID-19 vaccine to Americans free of Charge) ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. అంతటా కోవిడ్ 19 మహమ్మారిని నిలువరించే వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్నిరోజుల క్రితం మొట్టమొదటిసారిగా రష్యా వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లు శుభవార్తను వెల్లడించింది. అయితే ఆ వ్యాక్సిన్‌ను తన కుమార్తెకు కూడా ఇచ్చినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ (Oxford COVID-19 vaccine) క్లినికల్ ట్రయల్స్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చింది. దీంతో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను తిరిగి ప్రారంభించనుంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే లక్షలాది మంది చనిపోగా.. కోట్లాది మంది దీనిబారిన పడ్డారు. ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలన్నీ.. కరోనా నివారణకు రష్యా తయారు చేసిన ‘స్పుత్నిక్ వి’ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నాయి.
కరోనావైరస్ను ( Coronavirus ) ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తయారు చేస్తోన్న దేశాల్లో ఒకటైన చైనా.. ఆ వ్యాక్సిన్ ( COVID-19 vaccine ) ధరను 1000 యువాన్లుగా ( 144.27 డాలర్లు ) నిర్ణయించింది. చైనాకు చెందిన జాతీయ ఫార్మాసుటికల్ గ్రూప్ సినోఫార్మ్ ( Sinopharm's Vaccine ) తయారుచేస్తోన్న వ్యాక్సిన్‌కి సంబంధించి ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ( Clinical trials ) నిర్వహిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.