Telangana new Omicron Cases : తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు మరింత పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే నాలుగు కొత్త ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో తెలంగాణలో ప్రస్తుతం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7కు చేరింది. మరో మూడు కేసులకు సంబంధించి ఫలితాలు రావాల్సి ఉంది.
Scientist warns about Omicron : ఒమిక్రాన్ పెద్ద ప్రభావం చూపించదని.. ఏదో చిన్నపాటి వ్యాధుల బారిన పడుతామని కొందరు కొట్టిపారేస్తున్నారు. మరి ప్రముఖ శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ గురించి ఏమంటున్నారో ఓ సారి చూద్దాం..
Covid-19 vaccines effect on Omicron : ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్19 వ్యాక్సిన్ల ప్రభావాన్ని తగ్గిస్తుందని కొత్తగా ఒక పరిశోధనలో వెల్లడైంది. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం.. వ్యాక్సినేషన్ తీసుకున్న వారిపై కూడా ఎక్కువగా ఉంటుందని తేలింది.
Pfizer Covid-19 pills: న్యూయార్క్: కొవిడ్-19 పిల్‌పై తమ పరిశోధనల తాజా ఫలితాలను ఫైజర్ వెల్లడించింది. కరోనావైరస్ సోకిన వారు ఆస్పత్రిపాలవకుండా నిరోధించేందుకు కొవిడ్-19 మాత్రలు ఉపయోగపడుతున్నట్టు స్పష్టంచేసిన ఫైజర్.. కరోనావైరస్ ఇన్ఫెక్షన్ తీవ్రత అధికంగా ఉన్న వారిలో మరణాల సంఖ్యను తగ్గిండంలోనూ ఫైజర్ కొవిడ్ పిల్ 90 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్టు ఫైజర్ పార్మాసుటికల్స్ (Pfizer) తేల్చిచెప్పింది.
omicron created a furore corona cases : బ్రిటన్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఒక్క రోజులోనే రెట్టింపు అయ్యాయి. బ్రిటన్‌లో కేసులు మరింత పెరగనున్నాయని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. పరిస్థితులు గత రెండు వారాల మాదిరిగానే ఉంటే.. రాబోయే రెండు లేదా నాలుగు వారాల్లో 50% కరోనా కేసులు ఓమిక్రాన్ కారణంగానే వస్తాయని పేర్కొంది.
Two Bangladesh Women’s Cricketers Test Positive For Omicron : బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టులో ఇద్దరు క్రికెటర్స్ ఒమిక్రాన్ బారినపడ్డారు. ఇటీవల జింబాబ్వే పర్యటన నుంచి తిరిగొచ్చిన వారిద్దరూ ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఈ మేరకు బంగ్లాదేశ్ వైద్యశాఖ మంత్రి జహీద్ మలాకీ ప్రకటన చేశారు.
Centre monitoring 27 districts with spike in Covid positivity rate : దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలు - కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతోందని కేంద్రం పేర్కొంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చిరించింది. కేరళ, సిక్కిం, మిజోరంలలోని ఎనిమిది జిల్లాలలో కోవిడ్ పాజిటివిటీ రేటు పది శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది.
Omicron: దేశంలో కొత్తగా మరో 16 ఒమిక్రాన్ వేరియంట్ కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్రలో 7, రాజస్థాన్‌లో 9 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 21కి చేరింది.
COVID-19: కర్ణాటకలోని విద్యాసంస్థల్లో భారీ ఎత్తున కొవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. శివమెుగ్గ, చిక్‌మగళూరు జిల్లాలోని 68 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
Vinod Dua: ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ దువా (67) శనివారం కన్నుమూశారు. ఇటీవల కొవిడ్ బారిన పడిన ఆయన..ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచారు.
Covid-19 positive: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దడ పుట్టిస్తున్న వేళ...రాజస్థాన్ లోని ఒక కుటుంబంలో తొమ్మిది మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
ZyCoV-D Covid vaccine in 7 states : చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులోభాగంగానే జైడస్ క్యాడిలా రూపొందించిన జైకోవ్ - డీ వ్యాక్సిన్‌ను మొదట 7 రాష్ట్రాల్లో అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
Omicron name meaning and why it is named Omicron: సౌత్ ఆఫ్రికాలో కొత్తగా గుర్తించిన కొవిడ్-19 వేరియంట్‌కి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇదంతా చూస్తోంటే.. చాలా మందికి ఓ సందేహం రాకమానదు. అదేంటంటే.. అసలు ఈ కొత్త కొత్త వేరియంట్స్‌కి ఈ పేర్లు పెట్టేది ఎవరు (Who names new variants) ? ఎలా పెడతారు, ఆ పేర్లే ఎందుకు పెడతారు అనే సందేహం చాలామందిని వేధిస్తుంటుంది.
Pakistan's drones carry explosives : పాక్, భారత్ మధ్య ఉండే వ్యత్యాసం ఇదేనని మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. కోవిడ్-19 వ్యాక్సిన్లతో పాటు అత్యవసర మందులను కూడా అత్యంత వేగంగా మన డ్రోన్లు తీసుకెళ్తున్నాయన్నారు.చాలా తక్కువ సమయంలోనే మెడిసిన్స్‌ను.. మందులు అందుబాటులో లేని ప్రాంతాలకు.. కష్టతరమైన ప్రాంతాలకు తీసుకెళ్లడంలో మన డ్రోన్లు ముందు వరుసలో ఉన్నాయన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.