Covid-19: బహదూర్‌పల్లిలోని టెక్ మహీంద్ర యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది. ఇక్కడ 25 మంది విద్యార్థులకు, ఐదుగురు అధ్యాపకులకు కొవిడ్ నిర్ధారణ అయ్యింది.
తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా పాజిటివ్ గా నిర్ధరణ కావడంతో...ఈ నెల 24న ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
B.1.1.529 వేరియంట్‌పై వ్యాక్సిన్లు కొంత వరకు మాత్రమే రక్షణ ఇవ్వగలవని శాస్త్రవేత్తలు అంటున్నారు. మాస్క్‌లు ధరించడం, సోషల్ డిస్టన్స్ పాటించడం ద్వారానే వైరస్‌ను అడ్డుకోగలమని స్పష్టం చేశారు.
Siva Shankar master health condition: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనావైరస్ బారినపడి తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టుగా నిన్నటి నుంచి వార్తల్లో చూస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు అవార్డు విన్నింగ్ డ్యాన్స్ మాస్టర్ అయిన శివ శంకర్ మాస్టర్ కుటుంబం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, అతడి చికిత్సకు అయ్యే వైద్య ఖర్చులు భరించడం కూడా ఇబ్బందిగానే ఉందనేది ఆయా వార్తా కథనాల సారాంశం.
66 medical students test positive : ఈ 66 మంది వైద్య విద్యార్థులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినప్పటికీ మరోసారి కరోనా వ్యాప్తి చెందడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ విద్యార్థులంతా ఎస్డీఎం మెడికల్ కాలేజీకి చెందిన వారు. పెద్ద ఎత్తున విద్యార్థులు కరోనా బారినపడడంతో మెడికల్ కాలేజీ యాజమాన్యం అప్రమత్తమైంది.
TS COVID-19 cases: హైదరాబాద్: తెలంగాణలో బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 34,764 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. అందులో 156 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన కేసుల్లో యధావిధిగానే గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో 55 కొత్త కేసులు నమోదయ్యాయి.
కొవిడ్ లేని వారితో పోలిస్తే.. ఈ మహమ్మారి బారిన పడిన గర్భిణీలు నిర్జీవ శిశువులను ప్రసవించే ప్రమాదం పొంచి ఉందని ఆ అధ్యయనం వెల్లడించింది. యూఎస్ అధ్యయనం ప్రకారం.. కోవిడ్ (Covid) బారిన పడే గర్భిణీలపై ఈ ప్రభావం రెండురెట్లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.
గత 24 గంటల వ్యవధిలో 31,040 మందికి కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు చేయగా, అందులో 168 మందికి కరోనావైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయింది. కొత్తగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 35 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో 31,054 మందికి కరోనా వైరక్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 137 మందికి కరోనా వైరల్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కొత్తగా 48 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
Coronavirus positive cases in Telangana హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (COVID-19 latest updates from Telangana) సంఖ్య 6,73,889 కి చేరింది. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల వ్యవధిలో 164 మంది కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకోగా, మరొకరు కరోనాతో కన్నుమూశారు.
Coronavirus updates: గత కొద్దికాలంగా కేసుల్లో ఈ హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా 461 మరణాలు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.