గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ అట్టహాసంగా జరుగుతోంది. జనసేన పార్టీకి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. రాపాకకి సభలో ఎంట్రీ లేదంటూ పోస్టర్లు వెలిశాయి. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.
ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన పార్టీ ప్రజలతోనే ఉంటుందని, ప్రజల కన్నీళ్లు తుడవటమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్, మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ నేతలతో బుధవారం నాడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.
Tirupati by polls: తిరుపతి: తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. అప్పటివరకు క్యూలో నిల్చున్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం ఇచ్చారు. చివర్లో సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల మధ్యలో కరోనావైరస్తో బాధపడుతున్న పేషంట్స్‌కు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు.
Pawan Kalyan comments on CM post: తిరుపతి: తనకు సీఎం పదవిపై ఆశ లేదని.. సీఎం కాకపోయినా సేవ చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. సీఎం అయితేనే అని కాదు.. కాకపోయినా సరే ఇంకా ఎక్కువ సేవే చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.. సామాన్యులపై అధికార పార్టీ (YSRCP) ప్రతాపం చూపిస్తోందని మండిపడ్డారు.
Pawan Kalyan in Tirumala temple: తిరుమల: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక ఆధ్యాత్మికవేత్త అవతారంలో కనిపించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో శుక్రవారం ఉదయం పవన్ కల్యాణ్ శ్రీవారిని దర్శించుకోగా.. ఎప్పటికంటే భిన్నంగా ఈసారి ఆయన కంటే ఆయన ధరించిన దుస్తులే సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ అయ్యాయి.
KA Paul comments on Pawan Kalyan | తిరుపతి: తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించిన తర్వాత ఎమ్మెల్యేగా కానీ లేదా ఎంపీగా కానీ గెలవకుండానే ఏడు పార్టీలు మారారంటూ కేఏ పాల్ వ్యాఖ్యానించారు.
జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, సినీ ఇండస్ట్రీలో వేడి రాజేసిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ కామెంట్లపై తాజాగా సినీ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ (Bandla Ganesh) ఫైర్ అయ్యారు.
జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల నేపథ్యంలో జనసేన తీసుకున్న నిర్ణయంపై పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ ఇండస్ట్రీలో మరింత వేడిని రాజేశాయి. తాజాగా నాగబాబు చేసిన కామెంట్లపై ప్రకాష్ రాజ్ మళ్లీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ విషయమై తప్పటడుగులు వేసిన జనసేన..ఇకపై కీలకంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. తిరుపతి సీటును కోరుతూ బీజేపీ ముందు ప్రతిపాదన ఉంచనుంది.
దుబ్బాక మగిసింది. దేశంలో ఉప ఎన్నికలు, బీహార్ ఎన్నికలూ ముగిశాయి. ఇప్పుడందరి దృష్టి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపైనే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందంటూ పవన్ కళ్యాణ్ అధికారిక ప్రకటన వెలువరించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
నసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గురువారం మెట్రో రైలులో ప్రయాణించారు. సామాన్య వ్యక్తిలా ఆయన హైదరాబాద్ (Hyderabad Metro) మాదాపూర్ స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (pawan kalyan) రాజకీయ ప్రయాణం అనంతరం వరుసగా సినిమాలకు ఓకే చెబుతున్నారు. ప్రస్తుతం వకీల్ సాబ్ మూవీతో ( Vakeel Saab movie ) బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవలనే మూడు సినిమాలకు ఓకే చెప్పిన పవన్ కల్యాణ్.. తాజాగా మరో సినిమాకు కూడా కమిట్ అయ్యారు.
ఇటీవల ప్రవేశపెట్టిన మరో కొత్త పథకం ‘జగనన్న విద్యా కానుక’ (Jagananna Vidya Kanuka). అయితే ఈ పథకం పేరుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan On Jagananna Vidya Kanuka Name) అభ్యంతరం వ్యక్తం చేశారు.
బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఇవాళ మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆయనతో భేటీ అయ్యారు ( Somu Veerraju meets Chiranjeevi ). ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజు.. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఇలా చిరంజీవిని కలవడం రాజకీయవర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని ( Pawan Kalyan ) ఎద్దేవా చేస్తూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీకి మూడు రాజధానులు వివాదంపై మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu), జనసేనాని పవన్ కల్యాణ్‌లపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు.
జనసేన పార్టీపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ ( AP minister Shankar Narayana) పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ( Janasena party) జనం కోసం చేసింది ఏమీ లేదని... అది ఒక పనికిమాలిన సేన అని మండిపడ్డారు.
ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదముద్ర వేయడంపై ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.
మహాత్మా గాంధీని హతమార్చిన నాథురాం గాడ్సే జయంతి నాడు గాడ్సే గురించి ఓ ట్వీట్ చేసిన సినీనటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు ( Nagababu ).. గాడ్సే కూడా ఎంతో దేశభక్తి గలవాడేనని తన ట్వీట్లో పేర్కొనడం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. నాగబాబు ట్విటర్ (Nagababu twitter ) ద్వారా వ్యక్తంచేసిన అభిప్రాయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.