మహాత్మా గాంధీని హతమార్చిన నాథురాం గాడ్సే జయంతి నాడు గాడ్సే గురించి ఓ ట్వీట్ చేసిన సినీనటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు ( Nagababu ).. గాడ్సే కూడా ఎంతో దేశభక్తి గలవాడేనని తన ట్వీట్లో పేర్కొనడం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. నాగబాబు ట్విటర్ (Nagababu twitter ) ద్వారా వ్యక్తంచేసిన అభిప్రాయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
నాగబాబు ట్విటర్ ( Nagababu twitter ) ద్వారా నాథూరాం గాడ్సే జయంతి నాడు గాడ్సేను ఓ దేశభక్తుడిగా అభివర్ణిస్తూ చేసిన ట్వీట్ ఎంత హాట్ టాపిక్ అయ్యిందో అందరికీ తెలిసిందే. జాతిపిత మహాత్మా గాంధీని హతమార్చిన నాథురాం గాండ్సే ( Nathuram Godse ) దేశభక్తుడు ఎలా అవుతాడంటూ నాగబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో తనను తప్పుగా అర్థం చేసుకున్నారని.. తన ఉద్దేశం అది కాదని వివరణ ఇస్తూ మరునాడు మరో ట్వీట్ చేయకతప్పలేదు.
విశాఖ జిల్లాలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విష వాయువులు పీల్చుకున్న జనం, పసిబిడ్డలు ఎక్కడపడితే అక్కడే పడిపోయిన తీరు చూస్తే చాలా ఆందోళన కలిగించిందని అని అన్నారు.
ఫ్యాక్షన్ పోకడలతో ప్రజలే నష్టపోతున్నారని, నాయకులు బాగానే ఉన్నారని, భయపెడితే పెట్టుబడులు ఎలా వస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..
మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణ జనసేన పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. శ్రీ వి.వి.లక్ష్మీనారాయణ గారు భావాలను గౌరవిస్తున్నామని, ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నామని లేఖ ద్వారా తెలియజేశారు.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రాజధాని పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కృష్ణాయపాలెం నుంచి మందడం మీదుగా మంగళగిరి వెళ్తుండగా... మందడం సమీపంలో పవన్‌కళ్యాణ్ ను పోలీసులు అడ్డుకున్నారు.
పవన్ కల్యాణ్(Pawan Kalyan) మెగా అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వినిపించారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్(Ram Charan)తో తాను ఓ సినిమా నిర్మిస్తానని అప్పుడెప్పుడో పవన్ కల్యాణ్ చేసిన ఓ ప్రకటన మెగా అభిమానులను ఆనందానికి గురిచేసింది.
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) ఈ నెల 25 న సమావేశం కానుంది. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధ్యక్షత వహిస్తారని పిఏసి కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు, తెలుగు భాష పరిరక్షణ కోసం పార్టీ త్వరలో చేపట్టబోయే "మన నుడి - మన నది", డొక్కా సీతమ్మ పేరిట నిర్వహించిన ఆహార శిబిరాలు, ఇసుక లభ్యత-భవన నిర్మాణ కార్మికుల స్థితిగతులపై సమీక్ష జరపనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.