IPL 2021: ముంబైపై విజయంతో ఉత్సాహంగా ఉన్న కేకేఆర్ కు భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ మెయింటెన్ కారణంగా కెప్టెన్ మెర్గాన్ తో పాటు తుది జట్టులోని ఆటగాళ్లుకు సైతం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ జరిమానా విధించింది.
IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌కి ఘోర పరాభవం ఎదురైంది. అబుదాబి వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 7 వికెట్ల తేడాతో ముంబయిపై ఘన విజయం సాధించింది.
KKR Player Tim Seifert | ఐపీఎల్ 2021 భారత్‌లో నిర్వహించడం తప్పిదమని, సరైన నిర్ణయం కాదని సీజన్ మధ్యలోనే నిలిచిపోవడం తెలియజేస్తుంది. ఈ క్రమంలో ఐపీఎల్ వాయిదా పడిన వెంటనే భారత క్రికెటర్లు, దేశవాలీ ఆటగాళ్లు వెంటనే తమ ఇళ్లకు చేరుకున్నారు.
Varun Chakravarthy Tests Positive For COVID-19 : బయో బబుల్ వాతావరణంలో జరుగుతున్నప్పటికీ లీగ్‌లో కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. సురక్షిత వాతావరణంలో ఉన్నప్పటికీ ఇద్దరు ఆటగాళ్లకు తాజాగా నిర్వహించిన టెస్టులలో కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు.
IPL 2021 Prithvi Shaw : ప్రత్యర్థి జట్టు స్టార్ బౌలర్లను సైతం బెంబెలెత్తిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ విజయాలలో అధిక భాగం ఓపెనర్లు సాధించిన పరుగులతో సాధ్యమయ్యాయి. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా శివాలెత్తిపోయాడు.
IPL 2021 KKR Player Pat Cummins | ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న పాట్ కమిన్స్ కరోనా పోరాటానికి తమవంతు సాయంగా 50 వేల అమెరికా డాలర్లు పీఎం కేర్స్ నిధులకు జమ చేసి గొప్ప మనసు చాటుకున్నాడు. ఐపీఎల్ మధ్యలోనే వైదొలిగే ప్రసక్తే లేదని కేకేఆర్ స్టార్ ఆల్ రౌండర్ పాట్ కమిన్స్ స్పష్టం చేశాడు.
IPL 2021 KKR Captain Eoin Morgan Fined Rs 12 Lakh | ఫోర్లు, సిక్సర్ల వర్షంతో భారీ స్కోరింగ్ మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు 18 పరుగులు తేడాతో ఓటమి పాలైంది. కానీ క్రికెట్ ప్రేమికులు మాత్రం ఐపీఎల్ మజాను ఆస్వాదించారు. క్రికెట్ ప్రేమికులు కోరుకున్న మ్యాచ్ నిన్న రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగింది.
KKR 100th IPL Match Win: పటిష్టమైన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. 10 పరుగుల తేడాతో ఓటమితో ఆరెంజ్ ఆర్మీ ఐపీఎల్ 2021లో తమ ప్రస్థానాన్ని ప్రారభించింది.
SRH beats MI: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముంబై ఇండియన్స్‌పై సత్తా చాటుకుంది. ప్లే ఆఫ్స్‌లో ( Playoffs ) నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఐపిఎల్ పాయింట్స్ పట్టికలో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్న ముంబై ఇండియన్స్‌పై 10 వికెట్ల తేడాతో గెలిచి ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐపిఎల్ ప్లే ఆఫ్స్‌కి సన్ రైజర్స్ హైదరాబాద్ అర్హత సాధించింది.
SRH to Defeat MI to reach IPL 2020 Playoff | సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నేడు అసలుసిసలైన పరీక్ష ఎదురైంది. ఇన్ని రోజులు ఆడిన మ్యాచ్‌లు ఓ ఎత్తయితే నేడు డిఫెండింగ్ ఛాంపియన్‌తో తలపడనున్న మ్యాచ్ మరో ఎత్తుగా చెప్పవచ్చు. ఎందుకంటే లీగ్‌లో సన్‌రైజర్స్ ముందుకు వెళ్లాలా.. ఇక ఇంటిదారి పట్టాలా నిర్ణయించే మ్యాచ్ ఇది
KKR beat RR by 60 runs in IPL 2020 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) నుంచి రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) నిష్క్రమించింది. జట్టులో ఏడు, ఎనిమిది మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ దీనిపై స్పందించి పలు విషయాలు ప్రస్తావించాడు.
KKR vs RR match: దుబాయ్: ఐపీఎల్ 2020 నుంచి రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals ) నిష్క్రమించింది. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ( Kolkata Knight Riders ) చేతిలో ఓటమిపాలైన ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసులో నిలవలేకపోయింది. ఈ మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్లేఆఫ్ రేసులో నిలిచింది. కోల్‌కతా పేసర్ పాట్ కమిన్స్ ( Pat Cummins ) (4/34) రాజస్థాన్ రాయల్స్ని కోలుకోలేని దెబ్బ తీశాడు.
ఐపీఎల్ 2020లో భాగంగా గురువారం రాత్రి దుబాయ్ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ( Kolkata Knight Riders ) చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 173 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ( Chennai Super Kings ) ఓపెనర్ షేన్ వాట్సన్ 14 పరుగులకే పెవిలియన్ బాట పట్టినప్పటికీ.. రుతురాజ్ గైక్వాడ్ ( Ruturaj Gaikwad 72 పరుగులు: 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు.
ఐపీఎల్ 13వ సీజన్లో మొదట్లో పరాజయాలతో సతమతమయిన పంజాబ్ జట్టు (Kings XI Punjab ) ఇప్పుడు విజయబావుటా ఎగరేస్తోంది. ప్లే ఆఫ్ రేసు స్థానాన్ని దక్కించుకునేందు గెలవాల్సిన ప్రతీ మ్యాచ్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాణిస్తూ వస్తోంది. ఈ సీజన్ మొదట్లో ఏడు మ్యాచ్‌లు ఆడి 6 ఓడిపోయిన పంజాబ్ జట్టు.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది.
ఐపీఎల్ 2020 (IPL 2020) లో ఈ రోజు సాయంత్రం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో కోల్‌కతా జట్టులోకి న్యూజిలాండ్ వికెట్ కీపర్, యువ హిట్టర్ చేరనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
Kings XI Punjab beat Delhi Capitals to stay alive in playoffs race: దుబాయ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తొలి గండాన్ని గట్టెక్కింది. ఐపీఎల్ 2020లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై ( Delhi Capitals ) 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్‌పై ఆశలు సజీవం చేసుకుంది. ఈ విజయంతో పాయింట్స్ పట్టికలో పంజాబ్ జట్టు 5వ స్థానానికి చేరుకుంది.
Pravin Dubey replaces Amit Mishra: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి కొత్త ఆటగాడు వచ్చాడు. గాయం కారణంగా IPL 2020 నుంచి వైదొలగిన లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా స్థానంలో మరో లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ దూబెను తీసుకున్నట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ) ఫ్రాంచైజీ ప్రకటించింది. ఢిల్లీ జట్టు వెల్లడించిన వివరాల ప్రకారం టోర్నమెంట్‌లోని మిగతా అన్ని మ్యాచ్‌లకు దూబే అందుబాటులో ఉండనున్నాడు.
ఆదివారం.. క్రికెట్.. ఈ రెండూ కలిస్తే అదిరిపోయే ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఐపీఎల్ 2020లో ( IPL 2020 ) ఇవాళ జరిగిన మ్యాచు కూడా అలాంటిదే. కోల్‌కతా నైట్‌రైడర్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ మ్యాచులో కేకేఆర్ టీమ్ సూపర్ ఓవర్లో నెగ్గి విజయం సాధించింది.
ఐపీఎల్ (IPL 2020) లో కెప్టెన్ మారినా.. కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) రాత మాత్రం మారలేదు. ఐపీఎల్ 13వ సీజన్లో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరోసారి పరాజయం పాలైంది.
RCB vs KKR match highlights: ఐపీఎల్-13లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌తో ఆల్ రౌండ్ ప్రతిభ కనబరుస్తూ టాప్ 3లోకి దూసుకుపోయింది. సోమవారం షార్జా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాను 82 పరుగుల తేడాతో మట్టి కరిపించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ).. పాయింట్స్ పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.