మీరు శుభలగ్నం సినిమా చూసే ఉంటారు. అందులో హీరోయిన్ ఆమనికి డబ్బుపై వ్యామోహం ఎక్కువ. ఒకదశలో డబ్బుపై ఉన్న ఆశతో కట్టుకున్న భర్తనే అమ్మేస్తుంది. వాస్తవానికి ఇది ఒక సినిమా.
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో మద్యం, మాంసం నిషేధం అని తెలిసి కూడా ఓ జర్నలిస్ట్ తన కారులో మద్యాన్ని, మాంసాన్ని తీసుకెళ్తూ పట్టుబడ్డాడు. అలిపిరి టోల్గేట్ వద్ద బుధవారం భద్రతా సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో నిషేధిత పదార్థాలైన మద్యం, మాంసం స్వాధీనం చేసుకున్నట్టు టిటిడి విఎస్వో ప్రభాకర్ మీడియాకు తెలిపారు.
తమిళనాడులో మద్యం ప్రియులకు, ఆ రాష్ట్ర సర్కార్‌కి మద్రాస్ హై కోర్టు ( Madras high court ) షాక్ ఇచ్చింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ( TASMAC liquor) నిర్వహించే అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది.
లాక్డౌన్ కారణంగా మూతపడిన మద్యం దుకాణాలకు ఇటీవల కేంద్రం పలు షరతులతో కూడిన సడలింపు ఇవ్వడంతో మళ్లీ తెరుచుకున్న సంగతి తెలిసిందే. మద్యం దుకాణాలు తెరిచేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, హర్యాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రపదేశ్ రాష్ట్రాల్లో మద్యం దుకాణాల్లో విక్రయాలు జోరందుకున్నాయి.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడికి నివారణకు పకడ్బందీగా అమలవుతోన్న లాక్డౌన్ మూడవ దశలో మద్యం అమ్మకాలకు సంబంధించి పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే పంజాబ్‌లోని మందుప్రియులు
లాక్ డౌన్ సమయంలోనే మద్యం డోర్ డెలివరీ పాలసీ తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన పశ్చిమ బెంగాల్ సర్కార్ తాజాగా వైన్ షాపుల వద్దే మద్యం విక్రయాలు జరిపేందుకు అనుమతి ఇస్తూ కొత్తగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్లలో తప్ప మిగతా అన్ని జోన్లలో మద్యం దుకాణాలు మద్యం అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది.
దేశవ్యాప్తంగా విధించిన రెండో విడత లాక్డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో ఆంక్షల సడలింపులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రంగాలకు మినహాయింపులు కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించాయి.
దేశవ్యాప్తంగా గత 37 రోజులుగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో దీన్ని ఎత్తేసిన తర్వాత మద్యం ప్రియులకు భారీ షాక్ తగలనుందని, ధరలు ఆకాశాన్నంటనున్నాయని రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి.
లాక్ డౌన్ నేపథ్యంలో సాధారణ దుకాణాలు, అన్ని వ్యాపారాలతో పాటే బార్ అండ్ రెస్టారెంట్స్, మద్యం దుకాణాలు కూడా మూత పడిన నేపథ్యంలో లాక్ డౌన్ ఎప్పుడెప్పుడు ఎత్తేస్తారా ? ఎప్పుడెప్పుడు మళ్లీ గొంతు తడిచేసుకోవచ్చా అన్న చందంగా మద్యం ప్రియులు ఎదురుచూశారు.
లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడటంతో మద్యం ప్రియుల జిహ్వ రుచి తీర్చేందుకు కొందరు దురాశపరులు అక్రమ మద్యం వ్యాపారానికి తెరతీస్తున్నారు. జన సంచారం లేని చోట, అడవుల్లో అక్రమంగా మద్యం తయారుచేస్తూనో లేక నిల్వ చేస్తూనో.. అక్కడి నుంచి మద్యం ప్రియులకు లిక్కర్ సరఫరా చేస్తున్నారు.
లాక్ డౌన్ సమయంలో మద్యం విక్రయాలు లేకపోవడంతో.. మద్యాన్ని బ్లాక్‌లో అమ్మి సొమ్ము చేసుకోవాలనే దురుద్దేశంతో పోలీసు వేషం వేసిన ఇద్దరు కేడీగాళ్లు ఆఖరికి ఆ పోలీసులకే చిక్కి కటాకటాలు లెక్కిస్తున్నారు. సోమవారం అర్దరాత్రి కారులో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను నర్సంపేట పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆల్కాహాల్‌కి బానిసైన ఓ యువకుడు లాక్ డౌన్ కారణంగా ఆల్కహాల్ లభించడం లేదని శానిటైజర్ తాగి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో శనివారం చోటుచేసుకుంది. కేరళలోని కుయంకుళంలో మద్యం దొరకడం లేదనే ఆందోళనతో షేవింగ్ క్రీమ్ లోషన్ తాగి ప్రాణాలు కోల్పోయాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.