ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( Narendra Modi ) జన్మదినం సెప్టెంబరు 17న జరగనుంది. ఈ ఏడాది ప్రధాని 70వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. అయితే.. మోదీ జన్మదినం ( Narendra Modi Birthday) సందర్భంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రతిష్టాత్మక రామ జన్మభూమి ఆలయంపై బ్రేకింగ్ న్యూస్ ఇది. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్టు విశ్వసనీయం సమాచారం లభిస్తోంది.
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. సరిగ్గా ఏడాది క్రితం మే 30న ప్రస్తుతం NDA ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టింది. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏడాది పాలన పూర్తి కావడంతో.. ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం ముందున్న సవాళ్లకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
'కరోనా వైరస్' ఆర్థిక వ్యవస్థను కమ్మేస్తోంది. దేశవ్యాప్తంగా 54 రోజులపాటు విధించిన లాక్ డౌన్ 3.0 కొనసాగుతోంది. దీంతో పరిశ్రమలు, వ్యాపారాలు అన్నీ బంద్ అయ్యాయి.
ఊహించిందే జరిగింది. మరో 15 రోజులు లాక్ డౌన్ పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది.
'కరోనా వైరస్'పై భుజం భుజం కలిపి పోరాడదామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ రోజు రెండో దఫా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
'కరోనా వైరస్'.. భారత దేశంలో వేగంగా విస్తరిస్తోంది. మూడు రోజుల క్రితం కేవలం 24 గంటల్లో దేశవ్యాప్తంగా వెయ్యి పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించినప్పటికీ .. పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళనకు కారణమవుతోంది.
'కరోనా వైరస్'.. వేగంగా విస్తరిస్తున్న క్రమంలో భారత దేశం అన్ని దేశాలకు ఆశాజ్యోతిగా మారింది. ఎందుకంటే కరోనా వైరస్ పాజిటివ్ రోగుల చికిత్సలో భారత ఔషధం కీలక పాత్ర పోషిస్తోంది. అదే హైడ్రాక్సీక్లోరోక్విన్. దీన్ని ఎగుమతి చేయాలంటూ ప్రపంచంలోని దాదాపు 30 దేశాలు భారత దేశాన్ని కోరాయి.
'కరోనా వైరస్'తో పోరాడుతున్న అమెరికాకు చేదోడు వాదోడుగా నిలిచినందుకు భారత దేశానికి ధన్యవాదాలు.. అంటూ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ట్వీట్ చేశారు. అంతే కాదు ప్రధాని నరేంద్ర మోదీ ఒక గొప్ప నాయకుడు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
కొద్ది రోజుల క్రితం భారత్ పై చిర్రుబుర్రులాడిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మెత్తబడ్డారు. అంతే కాదు థ్యాంక్యూ మోదీ అంటూ కృతజ్ఞతలు చెప్పారు. పైగా భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతకీ పెద్దన్నకు ఎందుకు కోపమొచ్చింది..?
'కరోనా వైరస్' మహమ్మారిని ఎదుర్కునేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ అమలులో ఉండనుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా తమ మద్దతు ప్రకటించింది.
'కరోనా వైరస్'ను సమర్ధంగా ఎదుర్కునేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఈ క్రమంలో మరో ముందడుగు వేసింది కేంద్ర ప్రభుత్వం.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం .. ట్రంప్ పర్యటనపై తొలి ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ. . ఆయన పర్యటకు లక్షల మంది రావాలంటే .. అమితాబ్ బచ్చన్, సన్నిలియోన్ లాంటి వారిని పిలవాలన్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ , భార్య మెలానియా ట్రంప్ తో కలిసి . . అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో దిగారు. వారికి అక్కడ ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ..వారిద్దరినీ సాదరంగా స్వాగతించారు.
అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు భారత్ లో ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ఆయన్ను స్వాగతించారు. మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు.
అంతర్జాతీయంగా అతి పే...ద్ద స్టేడియం.. అగ్రరాజ్యం అమెరికా డోనాల్డ్ ట్రంప్ తో ప్రారంభోత్సవం. . నేడే ముహూర్తం. . మరి ఆ స్టేడియం విశిష్టతలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా..? ఆ స్టేడియం లోపలి చిత్రాలు చూడాలని ఉందా..?
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాక కోసం గుజరాత్ ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చురుగ్గా చేస్తోంది. మరోవైపు గుజరాతీ విద్యార్థులు.. ఆయనకు వినూత్నంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.