ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Harthras) లో 19 ఏళ్ల యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( CM Yogi Adityanath) మరో కిలక నిర్ణయం తీసుకున్నారు.
సామాజిక మాధ్యమాల్లో తనపై శృతి మించి జరుగుతున్న ప్రచారం, వదంతులు అనేక అపోహలకు దారితీస్తున్నందున తాను ఆ ప్రచారాన్ని ఖండిస్తూ ఈ వివరణ ఇస్తున్నట్లు ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.
గత కొన్ని రోజులుగా రోజుకో మలుపు తిరుగుతున్న రాజస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎవరి క్యాంపు వారిదన్నట్లు వ్యవహరించిన కాంగ్రెస్‌లోని వర్గాలు సయోధ్యకు వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే నెల రోజుల నుంచి రాజస్థాన్ అధికార కాంగ్రెస్‌కు చుక్కలు చూపించిన సచిన్ పైలట్ మరలా యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం.
టీ తాగడానికి కుటుంబ సమేతంగా రావాలంటూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ( priyanka gandhi ) నుంచి వచ్చిన ఆహ్వానంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు అనిల్ బలునీ ( anil baluni ) స్పందించారు.
కాంగ్రెస్ ( Congress ) జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూనీ (Anil Baluni) ని టీ తాగడానికి తన ఇంటికి రావాలని తన ఇంటికి ఆహ్వానించారు.
Rajasthan political crisis: కాంగ్రెస్ పార్టీని వీడే నాయకులను ఉద్దేశించి ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పార్టీ నుంచి వెళ్లాలనుకునే వాళ్లను వెళ్లనివ్వండని పేర్కొన్నట్లు వార్తలొస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై దేశ వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. వికాస్ దుబేకు సహకరించిన అధికారులు, నాయకులపై ఏం చర్యలు తీసుకుంటారంటూ ప్రతిపక్షాలన్నీ యూపీ బీజేపీ ప్రభుత్వాన్ని ( UP govt ) చుట్టుముడుతున్నాయి. 8న కాన్పూర్‌లో 8 మంది పోలీసులను దారుణంగా హత్య చేసిన వికాస్ దుబే మధ్యప్రదేశ్ ఉజ్జయిని ( Ujjain ) వరకు ఎలా చేరుకున్నాడని, ఎవరి ప్రమేయం లేకుండానే ఆయన అక్కడి వరకు చేరుకుని ఉంటాడా అంటూ బీజేపీని లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు గుప్పిస్తున్నాయి.
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ( Priyanka Gandhi ) ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ( Ministry of Housing and Urban Affairs ) నోటీసులు జారీ చేసింది. ఒకవేళ నెలలోపు బంగ్లాను ఖాళీ చేయకపోతే జరిమానా విధిస్తామని స్పష్టంచేసింది. ప్రియాంక గాంధీ లోథి రోడ్‌లోని ప్రభుత్వ బంగ్లా నంబర్ -35 ను ఆగస్టు ఒకటి నాటికి ఖాళీ చేయడంతోపాటు అద్దె బాకాయిలను సైతం చెల్లించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. నిబంధనల ప్రకారం Z+ భద్రత ఉన్నవారికి ప్రభుత్వ బంగ్లా కేటాయించడం తప్పనిసరి కాదని పేర్కొంది.
కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన ప్రారంభించిందని అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ఓ ప్రకటనలో తెలిపింది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను పెద్దల సభకు పంపనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్‌ల నుంచి రాజ్యసభకు నామినేట్ చేసేందుకు పార్టీ వర్గాల్లో చర్చ మొదలయ్యింది.
పౌరసత్వ సవరణ చట్టం 2019, జాతీయ పౌర పట్టికలను వ్యతిరేకిస్తూ ఇందిరాపార్క్ వద్ద గల ధర్నాచౌక్‌లో ప్రజాస్వామ్య వాదులు, మైనార్టీలు ఆందోళన చేపట్టారు. మైనార్టీలను వేధింపులకు గురిచేసేలా ఉన్న పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ జెండాలతో వేలాది మంది పౌరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకగాంధీ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనానికి హెల్మెట్ లేని కారణంగా ఉత్తరప్రదేశ్ లోని లక్నో పోలీసులు జరిమానా విధించారు. హెల్మెట్ ధరించకుండా, ప్రమాదకరంగా ద్విచక్రవాహనంపై వెళ్లారంటూ ఆమెతో పాటు మరో కాంగ్రెస్ నేత మాతాజీ ఎమ్మెల్యే ధీరజ్ గుర్జార్ కు రూ. 6,100 జరిమానా విధించారు.
మనీలాండరింగ్ కేసులో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఎంఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరయ్యారు. బుధవారం ఈడీ అడిగిన 40 ప్రశ్నలకు జబాబు ఇచ్చిన వాద్ర..ఈ రోజు కూడా ఈడీ ముందుకు హాజరయ్యారు. ఈ క్రమంలో కేసుకు వాద్రాకు సంబంధించి ఈడీ అదికారులు ప్రశ్నలు సంధించారు. అక్రమమార్గంలో డబ్బును లండన్ కు తరలిస్తున్నారని వాద్రా అభియోగాలు ఎదురుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.