యస్ బ్యాంకులో (YES bank) మీకు ఎకౌంట్ ఉందా ? అయితే, ఈ గుడ్ న్యూస్ మీ కోసమే. యస్ బ్యాంక్ సంక్షోభంలో (Yes bank crisis) చిక్కుకున్న కారణంగా బ్యాంకు ఖాతాల ద్వారా జరిపే లావాదేవీలపై విధించిన ఆంక్షలు ఇవాళ్టితో తొలగిపోనున్నాయి.
కరోనావైరస్ విజృంభిస్తున్న (Coronavirus outbreak) నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పాఠశాలలు, కాలేజీలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూసేసిన సంగతి తెలిసిందే. మార్చి 31 వరకు ఈ ఆదేశాలను పాటించాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చిచెప్పాయి.
కొందరు వినియోగదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులతో నేటి (మార్చి 16) నుండి ఆన్లైన్, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం కుదరదు. ఈ సౌకర్యాన్ని RBI నేటి నుంచి నిలిపివేసింది.
నేడు డిజిటల్ కాలంలో దాదాపు బ్యాంకు ఖాతా ఉన్న అందరూ డెబిట్, క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. అయితే మార్చి 16 తర్వాత ఆ కార్డులతో ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ చేయడం కుదరదని ఆర్బీఐ హెచ్చరిస్తోంది.
భారతీయ రిజర్వు బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా మైకెల్ పాత్ర నియమితులయ్యారు. డిప్యూటీ గవర్నర్‌గా 3 ఏళ్లు కొనసాగనున్నారు. పాత్రా ప్రస్తుతం ఆర్బిఐ ద్రవ్య విధాన విభాగంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై గణాంకాలను విడుదల చేసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అప్పులు 2020 మార్చి నాటికి రూ. 3.41 లక్షల కోట్లకు చేరనున్నట్లు పేర్కొంది . ఈ అప్పుడు మన వార్షిక బడ్జెట్ కంటే రెట్టింపుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఏపీ ఏటా సగటున రూ. 17 వేల కోట్ల అప్పులను చెల్లించాల్సి ఉంది. ఇలా రానున్న ఐదేళ్లలో రూ. 89,994 కోట్లను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది.
ఈ వారంలో బ్యాంకులకు మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. కనుక బ్యాంకుకు వెళ్లి డిపాజిట్లు, విత్ డ్రాలు చేసే వినియోగదారులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
మైక్రోసాఫ్ట్ సంస్థ తమ ఈమెయిల్ సర్వీసు వాడుతున్న భారతీయ వినియోగదారుల బ్యాంకింగ్ విషయాలను అమెరికా ప్రభుత్వానికి చేరవేస్తోందని పలు పత్రికలు వార్తలు రాయడం గమనార్హం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.