Revanth Reddy criticises TRS govt: ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు తెలంగాణ వాడో కాదో డీఎన్ఏ టెస్టు చేయాలని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరవీరుల స్తూపం నిర్మాణంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని... ఆ పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు.
Shabbir Ali comments Dalit CM remarks: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనపై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంటే తానెందుకు అడ్డం పడతానని షబ్బీర్ అలీ ప్రశ్నించారు.
Huzurabad bypoll campaign: హుజూరాబాద్ ఉప ఎన్నికకు తేదీ సమీపిస్తున్న తరుణంలో అక్కడి ఎన్నికల ప్రచారం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలుపును సొంతం చేసుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్న రాజకీయ పార్టీలు అందుకు తగినట్టుగా తమ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దించడమే కాకుండా వారికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలోకి చరిష్మా కలిగిన నేతలను రప్పిస్తున్నాయి.
TPCC Chief Revanth Reddy : ఇటీవల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి బుధవారం నాడు హైదరాబాద్లోని గాంధీభవన్లో ఉత్తమ్ కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.
TPCC Chief Revanth Reddy: గత ఏడాది నుంచి నెలకొన్న టీపీసీసీ పీఠంపై ఉత్కంఠ వీడిపోయింది. ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ ఆరు నెలల కిందటే రాష్ట్రంలో పర్యటించారు. కానీ టీపీసీసీ అధ్యక్షుడి పదవిపై మీనమేషాలు లెక్కిచారు. రేవంత్ రెడ్డిని టీపీసీసీ ప్రెసిడెంట్గా ఖరారు చేస్తూ ప్రకటన చేసింది.
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరో జాబితాను విడుదల చేసింది. మొదటిసారి 29 మంది అభ్యర్థులతో, ఆ తర్వాత 16 మంది అభ్యర్థుల పేర్లతో రెండుసార్లు జాబితాను విడుదల చేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. గురువారం రాత్రి మూడో జాబితాను ప్రకటించారు.
తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీని స్పీకర్ టీఆర్ఎస్లో విలీనం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్పై అంతే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాన్రాను సీఎం కేసీఆర్ ఒక పొలిటికల్ టెర్రరిస్టుగా మారారని ఆరోపించారు.
తెలంగాణ కాంగ్రెస్ తన రెండో విడత అభ్యర్ధుల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 10 మంది అభ్యర్ధుల పేర్లు ఉన్నాయి. తాజా జాబితా విడుదలతో ఇప్పటి వరకు 75 మంది అభ్యర్ధులను ప్రకటించినట్లయింది. తొలి జాబితాలో 65 మంది అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ జాబితాలో గతంలో పీపీసీ అధ్యక్షుడిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య పేరు లేకపోవడం గమనార్హం. కూకట్ పల్లి స్థానం టీడీపీకి కేటాయించే అవకాశముందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.