Telangana Politics: రాష్ట్రాన్ని నడిపిస్తున్న కీలక నేత సోదరుడు అతడు. గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఈ సారి ఆయన గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పేపర్లలో పెద్ద పెద్ద యాడ్ లు, సొంత జిల్లాతో పాటు హైదరాబాద్ లో పలు చోట్ల పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టడంపై అందరిలో పెద్ద చర్చే జరుగుతుంది. ఇంతకీ తెలంగాణ రాజకీయాల్లో ఆయన రెండో పవర్ సెంటర్ కాబోతున్నారా.. ? అనేది కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
Big Shock To Revanth Reddy Three Man Committee Visit: అధికారంలో ఉన్నా అతి తక్కువ స్థానాలు రావడంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విచారణ చేపట్టింది. లోక్సభ ఎన్నికలపై నియమించిన త్రిసభ్య కమిటీ హైదరాబాద్లోని గాంధీ భవన్కు చేరుకుని విచారణ ప్రారంభించింది. తక్కువ ఎంపీ స్థానాలు రావడంపై అధ్యయనం చేస్తుండడంతో రేవంత్ పనితీరుపై సందేహాలు నెలకొన్నాయి.
Telangana Politics: 2023 చివర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ కు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ పార్టీకి చెందిన పలువురు నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా మరో ఆరుగురుఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Big Shock To Revanth Reddy: తనకు తిరుగులేదని భావిస్తున్న రేవంత్ రెడ్డికి పార్టీ సీనియర్లు భారీ షాకిచ్చారు. మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నికలో రేవంత్ దూకుడుకు సీనియర్లు కళ్లెం వేశారు. దీంతో ఆ రెండు కార్యక్రమాలు వాయిదా పడ్డాయి.
Telangana Cabinet Expansion: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి ఆరు నెలలు అవుతోంది. ఈ మధ్యలో లోక్ సభ ఎన్నికలు ఉండటంతో రేవంత్ రెడ్డి పూర్తిగా తన సమయాన్ని ఎన్నికలపైనే పెట్టారు. లోక్ సభ ఎన్నికలు పూర్తైయిన నేపథ్యంలో తెలంగాణలో మిగిలిన ఆరు స్థానాలను భర్తీ చేయనున్నారు. అందుకు ముహూర్తం కూడా ఖరారైంది.
Telangana Politics:తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికలు సమీపిస్తున్న కొలది అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు,ఎంపీ, ఎమ్మెల్యే లు కాంగ్రెస్ లోకి చేరిపోతున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ, తన మేనిఫెస్టోలో కూడా పదవ షెడ్యూల్ లో సవరణలపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Telangana Congress: లోక్సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమౌతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆ పార్టీ లోక్సభలో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఓ వైపు టికెట్ల ఖరారు, మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలతో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది.
EX MP Mohammad Azharuddin: కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీ అజారుద్దీన్ గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవిపై ఆయన ఆశలు పెట్టుకోగా.. అధిష్టానం మొండి చేయి చూపించడంతో రాజీనామాకు సిద్ధమైనట్లు సమాచారం. ఇటీవల జూబ్లీహిల్స్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఓటమిపాలైన విషయం తెలిసిందే.
Jubili Hills Election Result 2023: మరి కాస్సేపట్లో తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. డీ లిమిటేషన్లో పేరు మార్చుకున్న ఒకప్పటి పెద్ద నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ హోరాహోరీ పోరులో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తి రేపుతోంది.
Telangana Assembly Election 2023 Results: తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. అధికారం ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు ఆరంభించింది. కర్ణాటక ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ పర్యవేక్షణలో మిషన్ తెలంగాణ నడుస్తోంది.
Revanth Reddy Fires On KTR and Harish Rao: మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిత్తకార్తె కుక్కల్లా తిరుగుతున్నారంటూ ఓ రేంజ్ విమర్శలు గుప్పించారు. మరో 45 రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు.
YSRTP Merger: వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీన ప్రక్రియ కొలిక్కి రానుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఎన్నికల వ్యూహకర్త సునీల్ రంగ ప్రవేశంతో షర్మిల కాస్త వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది.
Revanth Reddy Slams KCR : బీసీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే.. ఆ పదవిని బీసీకి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చారో ఆలోచించండన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 115 సీట్లలో ఒక్క ముదిరాజ్ కు కూడా టికెట్ ఇవ్వలేదు. ముదిరాజులపై కేసీఆర్ పగబట్టారు. 50 శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులు... అరశాతం ఉన్న కేసీఆర్ వర్గానికి 4 మంత్రి పదవులా? ఇచ్చారని ఆయన విమర్శించారు.
Revanth Reddy Security Issue: అన్ని డిపార్ట్మెంట్లలో కొందరు అధికారులు ప్రభుత్వ తాబేదార్లుగా ఉంటారు. ప్రభుత్వానికి తొత్తులుగా పని చేసే అధికారుల పేర్లను తప్పకుండా రెడ్ బుక్లో రాస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం కోసం కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టే వాళ్ళని వదిలిపెట్టం అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Case Filed Against Revanth Reddy: హైదరాబాద్ : తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు మరో ఇద్దరు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డిలపై నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ మనోహర్ తెలిపారు.
Screening Committee: మరోవైపు త్వరలో ఎన్నికల జరిగే రాష్ట్రాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది.
Ramreddy Damodar Reddy Party Changing News: సూర్యాపేట నుంచి తాను పోటీచేసే విషయంలో లోకల్ - నాన్ లోకల్ అని కొంతమంది రాజకీయం చేస్తున్నారు అంటూ ఆ విషయాన్ని ప్రస్తావించిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి.. 40 సంవత్సరాలుగా సూర్యాపేట కేంద్రంగా రాజకీయాల్లో ఉన్నాను అనే విషయాన్ని పార్టీ మిత్రులు గమనించాలి అని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.