Telangana CM KCR about lockdown in Telangana state: హైదరాబాద్: తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లో లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించే విషయంలో గత అనుభవాలతో పాటు ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు ఇతర రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించినప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించడం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. అంతకంటే ముందుగా ప్రధాని మోదీతో మాట్లాడిన సీఎం కేసీఆర్... రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు (remdesivir injections), ఆక్సీజన్ సప్లై (Oxygen supply) విషయంలోనే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.
Telangana high court slams Medak collector in Eetela Rajender issue: హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కి తెలంగాణ హై కోర్టులో ఊరట లభించింది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలోని ఈటల రాజేందర్ భూములపై మే 1, 2వ తేదీల్లో జరిగిన విచారణ చట్టబద్దంగా లేదని, ఈ విషయంలో మెదక్ జిల్లా కలెక్టర్ రిపోర్టును పరిగణలోకి తీసుకోవద్దని తెలంగాణ హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Eetela Rajender convoy and security returned: హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరో నిర్ణయం తీసుకున్నారు. తనను సీఎం కేసీఆర్ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం, కాన్వాయ్‌ని ప్రభుత్వానికి అప్పగించేశారు. అలాగే తనకు గతంలో మంత్రి హోదాలో ఇచ్చిన సెక్యూరిటీ సిబ్బందిని సైతం ఈటల రాజేందర్ వెనక్కి పంపించేశారు.
Eatala Rajender comments on CM KCR: హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన ఫామ్‌హౌజ్‌కు అసైన్డ్ భూముల్లో నుంచి రోడ్లు వేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించిన ఈటల రాజేందర్.. తనపై ఒక పథకం ప్రకారమే ఇలా భూ కబ్జా ఆరోపణలు (Land kabja allegations) చేసి ఇరికించేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు.
Minister Eatala Rajender press meet: హైదరాబాద్: మంత్రి ఈటల రాజేందర్ తనపై వస్తోన్న భూ కబ్జా ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. శుక్రవారం సాయంత్రం నుంచి మీడియాలో తనపై వస్తున్న వరుస కథనాలను మంత్రి ఈటల రాజేందర్ తిప్పికొట్టారు. అధికారిక పార్టీకి అనుకూలమైన ఛానెల్స్‌గా ముద్రపడిన మీడియాలోనూ మంత్రి ఈటల రాజేందర్‌కి వ్యతిరేక కథనాలు రావడం ఆయన కేబినెట్ పదవి గల్లంతేననే కథనాలకు మరింత బలం చేకూర్చినట్టయింది.
Eatala Rajender's minister post: హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులో సుమారు 100 ఎకరాల భూమిని మంత్రి ఈటల రాజేందర్ కబ్జా (Land encroachments) చేశారనేది ఆయనపై వస్తున్న ఆరోపణలు.
CM KCR's Health condition: హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కరోనా నుంచి కోలుకున్నారు. బుధవారం జరిపిన కరోనా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో ముఖ్యమంత్రికి నెగటివ్ అని నిర్ధారణ అయింది. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు డా. ఎం.వి. రావు (MV Rao) ఆధ్వర్యంలో నిపుణుల బృందం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు.
LRS Scheme in Telangana: హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ పథకం అమలు విషయంలో సుప్రీం కోర్టు నిర్ణయం వెలువడేవరకు వేచిచూడాల్సిందేనని తెలంగాణ హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు నుంచి ఆదేశాలు జారీ అయ్యేవరకు బీఆర్ఎస్ దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని హైకోర్టు (TS High court) తేల్చిచెప్పింది.
Free COVID-19 vaccine in Telangana: హైదరాబాద్: కరోనా కట్టడికి తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికీ కొవిడ్-19 వాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించుకున్న సీఎం కేసీఆర్... ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కి, వైద్యశాఖ అధికారులకూ ఆదేశాలు జారీ చేశారు.
IAF planes airlifted oxygen tankers: హైదరాబాద్: తెలంగాణలో ఆక్సీజన్ కొరతను అధిగమించేందుకు యుద్ధ విమానాల్లో ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్స్‌ని ఒడిశాకు పంపించారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లతో బయల్దేరిన యుద్ధ విమానాలు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చేరుకున్నాయి. భువనేశ్వర్ నుంచి విమానాల ద్వారా 14.5 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ని (Liquid medical oxygen) రాష్ట్రానికి తీసుకురానున్నారు.
CM KCR's health condition latest updates: సీఎం కేసీఆర్‌కి కరోనా సోకినట్టు ఇవాళ జరిపిన కొవిడ్-19 పరీక్షల్లో నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ కరోనా బారిన పడిన నేపథ్యంలో ఆయనను ఫామ్‌హౌజ్‌లోనే ఐసోలేట్ కావాల్సిందిగా సూచించామని కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు (CM KCR's personal Dr MV Rao) తెలిపారు.
Telangana CM KCR health condition: హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి స్వల్ప లక్షణాలు (Mild symptoms of COVID-19) మాత్రమే ఉన్నందున ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు.
New pensions and ration cards in Telangana: తెలంగాణలో ఎప్పటి నుంచో పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం వేచిచూస్తున్న వారికి త్వరలోనే గుడ్ న్యూస్ రానుందా అంటే అవుననే తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉంటూ వచ్చిన దరఖాస్తులకు త్వరలోనే మోక్షం లభించనున్నట్టు సమాచారం. త్వరలోనే కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ (CM KCR) నాగార్జునసాగర్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచార సభలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Coronavirus positive cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కొద్దిరోజుల క్రితం వరకు అదుపులో ఉన్నట్టుగా కనిపించిన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ క్రమక్రమంగా పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 2,909 మందికి కరోనా సోకినట్టు వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలో (COVID-19 cases in Maharashtra) పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండగా తమిళనాడు, కర్ణాటకలోనూ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి.
Vakeel Saab benefit shows: వకీల్ సాబ్ మూవీ విడుదలకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నుంచి కౌంట్‌డౌన్ షురూ అయింది. పవన్ కల్యాణ్ అభిమానులకు ఉగాది కానుకగా అంతకంటే నాలుగు రోజులు ముందుగానే, అంటే ఏప్రిల్ 9నే వకీల్ సాబ్ మూవీ వరల్డ్ వైడ్‌గా ఆడియెన్స్ ముందుకు రానుంది. అజ్ఞాతవాసి మూవీ తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకున్న పవన్ కల్యాణ్ మళ్లీ ఈ సినిమాతోనే హీరోగా ఆడియెన్స్ ముందుకొస్తుండటంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవదుల్లేవు.
Schools and colleges in Telangana: హైదరాబాద్: తెలంగాణలో విద్యా సంస్థలు పునఃప్రారంభించిన అనంతరం విద్యా సంస్థల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థల్లో పెరుగుతున్న కరోనా కేసులకు చెక్ పెట్టేందుకు రేపటి నుంచి తాత్కాలికంగా విద్యాసంస్థలను మూసివేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో (TS Assembly session) ప్రకటించారు.
Farmers protest against Minister Indrakaran Reddy: నిర్మల్: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి నిర్మల్ జల్లా పొన్కల్ వద్ద చేదు అనుభవం ఎదురైంది. శనివారం అక్కడ రైతు వేదిక ప్రారంభించేందుకు వెళ్లిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాన్వాయ్‌ని రైతులు, సాధర్మాట్ భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. Sadarmat barrage ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ నుంచి భూములు లాక్కుని మూడేళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు తమకు నష్టపరిహారం చెల్లించలేదని రైతులు నిరసన వ్యక్తంచేశారు.
Minister Harish Rao comments on YS Sharmila's new party హైదరాబాద్: తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని.. రైతులను ఆదుకుంటామని ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి YS Sharmila చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతబడిన సంగతి తెలిసిందే. 11 నెలల సుదీర్ఘ విరామం అనంతరం తెలంగాణలో విద్యాసంస్థలు పున:ప్రారంభించేందుకు ప్రభుత్వం (Telangana Govt) చర్యలు చేపట్టింది.
ప్రజల్లో కరోనావైరస్ వ్యాక్సిన్ (Corona vaccine)పై నమ్మకం పెంచేందుకు తొలి టీకాను తానే తీసుకుంటానని తెలంగాణ (Telangana) వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. కొత్తరకం కరోనాతో భయపడాల్సిన అవసరం లేదని, బర్డ్‌ఫ్లూ వల్ల కూడా ఎలాంటి నష్టం లేదని ఈటల స్పష్టంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.