Certificates damaged in floods: హైదరాబాద్ : తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా పోటెత్తిన భారీ వరదలు ( Hyderabad rains and floods ) అనేక ప్రాంతాలను పూర్తి జలమయం చేశాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌ని ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా భారీ వరదలు ముంచెత్తాయి. వరదల్లో ఇండ్లు నీట మునిగిన చోట చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో విద్యార్థుల సర్టిఫికెట్స్ ( Study certificates ) సమస్య ఒకటి.
హైదరాబాద్: ఏడాది క్రితమే తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో స్పెషల్ పోలీస్ (TSSP) ఉద్యోగాలకు ఎంపికై అప్పటి నుంచి శిక్షణ కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు టిఎస్ఎస్పీ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగంలో చేరడం కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్న 3,963 మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరదింపుతూ టిఎస్ఎస్పీ నుంచి అభ్యర్థులకు తీపి కబురు అందింది.
LRS application last date: హైదరాబాద్ : ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకు తుది గడువు నేటి గురువారంతో ముగియనుండగా.. తాజాగా ఆ గడువును నెలఖారు (31వ తేదీ) వరకు పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ ( Telangana govt ) నిర్ణయం తీసుకుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణ (Telangana ) రాష్ట్రం అతలాకుతలమైంది. భారీ వర్షాల ( heavy rains ) తో భాగ్యనగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఈ మేరకు సాయం అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Narendra Modi) కి గురువారం లేఖ రాశారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కి కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్ మెహతా లేఖ ( Kerala CS Vishwas Mehta ) రాశారు. కొవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో కేరళలోని శబరిమల ఆలయంలో ( Sabarimala temple ) కరోనా వ్యాప్తి నివారణ కోసం తీసుకుంటున్న చర్యలను తెలంగాణ నుంచి వచ్చే అయ్యప్ప భక్తులకు ( Ayyappa devotees ) తెలియజేయాలనే ఉద్దేశంతో కేరళ సీఎస్ మెహతా ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (TS Govt) ఇటీవల నూతన సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టి.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేస్తునే ఉంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు, దీంతోపాటు మరికొన్ని అంశాలపై చర్చించి చట్టాలు చేయాల్సి ఉంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు సహా ఇతర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఇకనైనా ఆపాలని.. లేదంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర్ - పెద్ద మరూర్ వద్ద బాబ్లీ తరహాలో బ్యారేజీ నిర్మించి తీరుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అలంపూర్ - పెద్ద మరూర్ వద్ద తెలంగాణ సర్కార్ బ్యారేజీ నిర్మించడం జరిగిందంటే, అందులోంచి రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని హెచ్చరించారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సైతం ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం యథావిధిగా పనులు జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిలు తిరిగి చెల్లించాలని (Reimburse Deferred Salary To Employees and Pensioners) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
నదీ జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఏపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ కావాలనే కయ్యం పెట్టుకుందని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు.
భాగ్యనగర ఖ్యాతిని మరింత ప్రకాశింపజేసేలా.. హైదరాబాద్ (Hyderabad)లో మరో అత్యాధునిక నిర్మాణం చేరింది. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి (Cable Bridge) అందాలు నగానికే ప్రత్యేక శోభను తీసుకువస్తున్నాయి.
కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) నేపథ్యంలో ఇప్పట్లో కాలేజీలు తెరిచే పరిస్థితి లేకపోవడంతో ఇంటర్మీడియెట్ సిలబస్‌ను 30 శాతం తగ్గించినట్టు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇంటర్మీడియెట్ బోర్డు ( TS inter board ) చేసిన ఈ ప్రతిపాదనకు ఇటీవలే తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది.
నేరేడ్మెట్లో సుమేధ అనే 12 ఏళ్ల బాలిక నాలాలో ( Sumedha found dead in Nala ) పడి మృతి చెందిన ఘటన అక్కడి కాలనీ వాసుల్లో తీవ్ర ఆందోళనరేకెత్తిస్తోంది. మరీ ముఖ్యంగా దీన్‌దయాల్ నగర్, సంతోషి మాత కాలనీ, కాకతీయ నగర్ కాలనీ వాసుల ఆందోళన మునుపటికంటే మరింత రెట్టింపైంది.
తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితులు, పరీక్షలు, బాధితులకు అందిస్తున్న చికిత్సపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించగా.. హైకోర్టు అస్పష్టంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ( Telangana Assembly session ) వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మంత్రులు, విప్‌లతో సీఎం కేసీఆర్ ( CM KCR ) సమావేశమయ్యారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
అన్‌లాక్ 4 మార్గదర్శకాలు ( Unlock 4 Guidelines details ) విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉద్యోగం, ఉపాధి నిమిత్తం నిత్యం వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే నగరవాసుల దృష్టి అంతా ప్రస్తుతం సిటీ బస్సులపైనే ( City buses ) ఉంది.
హైదరాబాద్: అన్‌లాక్ 4 మార్గదర్శకాలు ( Unlock 4 Guidelines details ) విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉద్యోగం, ఉపాధి నిమిత్తం నిత్యం వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే నగరవాసుల దృష్టి అంతా ప్రస్తుతం సిటీ బస్సులపైనే ( City buses ) ఉంది. ఈ నెల 7 నుంచి హైదరాబాద్ మెట్రో రైలు సేవలు ( Hyderabad metro services ) పునఃప్రారంభం కానుండటంతో ఆర్టీసీ బస్సులకు కూడా రోడ్డెక్కేందుకు
తెలంగాణలో ప్రవేశపరీక్షల (entrance exams) తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు ఖరారు చేసింది. కరోనా మహమ్మారి (Coronavirus) కారణంగా తెలంగాణలో కామన్ ఎంట్రన్స్ ఎక్సామ్స్ రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
దేశమంతటా కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నిత్యం కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ( Telangana Govt ) సాయం చేసేందుకు జీ (ZEE) సంస్థ ముందుకు వచ్చింది.
తెలంగాణ సర్కార్‌పై బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కరోనావైరస్ వ్యాప్తిని ( Coronavirus ) అరికట్టడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జేపి నడ్డా మండిపడ్డారు.
Water sharing row: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను పొందే విషయంలో అసలు ఏ మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM Kcr) ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అభిప్రాయం వ్యక్తచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.