Sandra Venkata Veerayya Vs Matta Raghmai In Sattupalli: ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర అవుతున్నా ఆ నియోజకవర్గంలో ఇంకా రాజకీయం ఉడుకుతోంది. ప్రత్యర్థులు అటుఇటు అయినా.. బలబలాలు మారినా అక్కడ అట్టుడుకుతోంది. నువ్వానేనా అనే రీతిలో సాగుతున్న రాజకీయం తెలుసుకుందాం.
Two MLAs Ready To Rejoins Into BRS Party: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయినా ఎమ్మెల్యేలు డైలామాలో పడ్డారా..! తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు ఆ ఇద్దరు నేతలు ప్రయత్నిస్తున్నారా..! అందుకే తమ ఇళ్లలో కేసీఆర్ ఫొటోను తీసేందుకు నిరాక తీసేయలేదని చెబుతున్నారా..! కారెక్కే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా..! ఇంతకీ ఆ ఎమ్మెల్యేల దారెటు!
Allu Aravind Hot Comments On Revanth Reddy In Thandel Event: సంధ్య థియేటర్ తొక్కిసలాట పరిణామాలను మరోసారి అల్లు అరవింద్ ప్రస్తావించారు. తాను నిర్మించిన తండేల్ సినిమా వేడుకల్లో పరోక్షంగా అరవింద్ ఆ అంశాన్ని ప్రస్తావించారని.. రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
Vemulawada Temple: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని గురువారం జబర్థస్త్ నటులు సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయానికి పట్టువస్త్రాలతో రావడం విశేషం.
Jagadish Reddy Demands Revanth Reddy And Congress Party Apology: పాలన చేతకాక అస్తవ్యస్తంగా చేస్తుండడంతో ప్రజల్లో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నవ్వుల పాలవుతోందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Teenmar Mallanna: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన తాజాగా చేసిన కులగణనపై ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాదు తెలంగాణలో అగ్ర కులాలపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. అటు తెలంగాణ మంత్రి సీతక్క మల్లన్న వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Gongadi Trisha Gets One Crore Cash Prize From Telangana: అండర్-19 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన గొంగడి త్రిషకు భారీ నగదు బహుమతి లభించింది. తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి నగదు ప్రోత్సాహాకాన్ని ప్రకటించింది. అనంతరం త్రిషను ఘనంగా సన్మానించింది.
Folk Artists Celebrates Bonalu At Baddi Pochamma Temple: వేములవాడలోని బద్ది పోచమ్మ అమ్మవారికి తెలంగాణ జానపద కళాకారులు బోనాలు సమర్పించారు. ప్రతియేటా గూగుల్ అమ్మ, యూట్యూబ్ తల్లి పేరిట బోనాలు ఇవ్వడం సంప్రదాయంగా మార్చారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఉపాధి పొందుతున్న కళాకారులు కృతజ్ఞతగా ఈ సంబరాలు చేసుకున్నారు.
Elected MLA Playing As Dummy In Telangana: బీఆర్ఎస్కు ఆ జిల్లా కంచుకోట. కాంగ్రెస్ హవాను తట్టుకుని గెలిచి నిలిచారు అక్కడి ఎమ్మెల్యేలు. గెలిచిన వారిలో ఓ ఎమ్మెల్యే మాత్రం కేడర్ సమస్యల పరిష్కారానికి నామమాత్రంగా కూడా ప్రయత్నించడం లేదట. దీంతో ఈ మొక్కుబడి ఎమ్మెల్యేతో ఏం లాభం అంటూ కింది స్థాయి నాయకులు పెదవి విరుస్తున్నారట. ఇంతకీ ఎక్కడా ఆ వ్యవహారం.. ఎవరా పొలిటీషియన్.. వాచ్ దిస్ స్టోరీ.
YS Sharmila Demands Caste Census In Andhra Pradesh: కుల గణన చేపట్టిన రేవంత్ రెడ్డిని చూసి చంద్రబాబు నేర్చుకోవాలని వైఎస్ షర్మిల సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఉచ్చులో పడవద్దని చంద్రబాబుకు హితవు పలికారు.
KT Rama Rao: How Can Decrease BC Population In Caste Census: కుల గణన పేరుతో రేవంత్ రెడ్డి కాలయాపన చేయడం తప్ప.. దీని ద్వారా ఒరిగిదేమీ లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇది ఎన్నికల స్టంట్ అని తెలిపారు.
Revanth Reddy Reveals Caste Census Details Here: కుల గణనను చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా దాని లెక్కలు విడుదల చేసింది. ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో కుల గణన వివరాలు వెల్లడించగా.. బీసీ లెక్కలు ఇలా ఉన్నాయి.
We Creates History With Caste Census Says Revanth Reddy: తాము దేశంలోనే తొలిసారి కుల గణన చేసి చరిత్ర సృష్టించినట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ ఫలాలు ప్రజలందరికీ అందించడమే తమ లక్ష్యమని తెలుపుతూనే ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తెలంగాణ సర్కారు చేపట్టిన కులగణనపై సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన జనగణనలో పెద్ద బొక్క ఉందన్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దీనిపై ఫుల్ క్లారిటీ ఉందన్నారు.
Lavanya Alleged Masthan Sai Have Hero Nikhil Private Videos: సినీ పరిశ్రమకు మరో వివాదం రాజుకుంది. మస్తాన్ సాయి- లావణ్య వ్యవహారంలో హీరో నిఖిల్ ప్రైవేటు వీడియోలు ప్రస్తావనకు రావడం సంచలనం రేపుతోంది. నిఖిల్ ఫోన్ హ్యాక్తోపాటు ప్రైవేటు వీడియోలు తీసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
Harish Rao Alleged Realtor Suicide Is Revanth Reddy Murder: చేతకాని రేవంత్ రెడ్డి పాలనతో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లతోపాటు తాజాగా బిల్డర్లు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. బిల్డర్ ఆత్మహత్య రేవంత్ రెడ్డి హత్య అని ప్రకటించారు.
KCR Words Gives Tension On Employees Salaries Payment" రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మాజీ సీఎం కేసీఆర్ అక్షరరూపం ఇచ్చారని.. 'జీతాలు చెల్లించలేని పరిస్థితి' ఏర్పడుతుందని ప్రకటించడంతో ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. డీఏలు, పీఆర్సీ అమలుపై ఆందోళన రేకెత్తుతోంది.
Lady Aghori: లేడీ అఘోరి మరోసారి తెలంగాణలో హల్ చల్ చేసింది. ఎన్టీపీసీ కి సమీపంలోని మల్కాపర్ గ్రామంలో ఓ భక్తురాలి ఇంటికి వచ్చింది. సమాచారం తెలుసుకున్న ఎన్టీపీసీ పోలీసులు గ్రామంలో తోట రామయ్య అనే వ్యక్తి ఇంటికి వెళ్లారు.
Develop Yadadri Temple Like Tirumala Says Revanth Reddy: తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆలయ బోర్డు అభివృద్ధిపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
University Employees: రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ డీఏలు, హెచ్ఆర్ఏ, కనీస వేతనం కోసం తెలంగాణలోని విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. రేవంత్ రెడ్డి వెంటనే తమ డిమాండ్లు నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.