/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

ఏపీ తెలంగాణ రాష్ట్రాల ( Ap and Telangana states ) మధ్య మరో భారీ రోడ్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ( Central Government ) ఆమోదం తెలిపింది. నేషనల్ హైవే నెంబర్ 167 గా...820 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం జరగనుంది. ఈ రోడ్డును బ్రిడ్జి కమ్ బ్యారేజ్ చేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లోని కర్నూలు జిల్లా కరివెను నుంచి తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలోని కల్వకుర్తి వరకూ 122 కిలోమీటర్ల మేర భారీ రోడ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. 167వ నెంబర్ జాతీయ  ( National Highway 167 ) ఈ రోడ్డును గుర్తిస్తూ..కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ రోడ్డు తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు, కొల్లాపూర్, ఏపీలోని నంద్యాల, ఆత్మకూరులను కలుపుతుంది. రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగే విధంగా 820 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు...కృష్ణానదిపై సోమశిల ప్రాంతంలో 3 కిలోమీటర్ల మేర వంతెన కలిగి ఉంటుంది. ఈ రోడ్డులో అత్యధిక భాగం అంటే 96 కిలోమీటర్లు తెలంగాణలోనూ..26 కిలోమీటర్లు ఏపీలోనూ ఉంటుంది. ఈ రోడ్డు నిర్మించడం ద్వారా హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్- తిరుపతి మధ్య దూరం 80 కిలోమీటర్లు తగ్గిపోతుంది. కేంద్రం భారత్‌మాల ఫేజ్‌–1 ( Bharatmala phase 1 ) లో చేర్చడంతో ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు మార్గం సుగమమైంది. 

820 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు.. కృష్ణానది ( Krishna river )పై మాత్రం బ్రిడ్జి కమ్‌ రోడ్‌ ( Bridge cum Road ) కాకుండా బ్రిడ్జి కమ్‌ బ్యారేజీ ( Bridge cum Barrage ) గా నిర్మించాలని కర్నూలు జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఈ ప్రాంతంలో బ్యారేజ్ నిర్మాణం ద్వారా రెండు రాష్ట్రాల్లోని గ్రామాల్లో తాగు, సాగు నీరు అందుతుందనేది రైతులు చెబుతున్న మాట. ఈ ప్రాంతంలో బ్యారేజ్ నిర్మిస్తే..శ్రీశైలం రిజర్వాయర్‌లో పూడిక పేరుకోకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

ఇదే ప్రాంతంలో 2007లో కృష్ణానదిలో పడవ ప్రమాదంలో 61 మంది మరణించడంతో..వంతెన నిర్మాణానికి ప్రతిపాదన రూపొందింది అప్పట్లో.  వాస్తవానికి 2008లోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( YSR ) ఈ ప్రాంతంలో రోడ్ కమ్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే 2009లో వైెఎస్సార్ మరణంతో ఇది ఆగిపోయింది. Also read: చిరంజీవికి కరోనా.. టెన్షన్‌లో సీఎం కేసీఆర్, నాగార్జున, తదితరులు!

Section: 
English Title: 
Central Given Green signal to New National Highway 167 between Ap and Telangana
News Source: 
Home Title: 

Telangana: ఏపీ తెలంగాణ మధ్యన ఎన్ హెచ్ 167కు కేంద్రం ఆమోదం

Telangana: ఏపీ తెలంగాణ మధ్యన ఎన్ హెచ్ 167కు కేంద్రం ఆమోదం
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Telangana: ఏపీ తెలంగాణ మధ్యన ఎన్ హెచ్ 167కు కేంద్రం ఆమోదం
Publish Later: 
No
Publish At: 
Monday, November 9, 2020 - 15:27
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman