MLC Counting: ఉభయ గోదావరి టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రక్రియ కాసేటి క్రితమే ప్రారంభమైంది. ఈ కౌంటింగ్ కు రిటర్నింగ్ అధికారి, కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్ ఆధ్వర్యంలో అభ్యర్థులు, సాధారణ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌ను తెరిచి బ్యాలెట్ పెట్టెలను కేంద్రానికి తరలించారు. ఆపై ఆర్వో ఆధ్వర్యంలో లెక్కింపు మొదలు పెట్టారు. ఈ నెల 5న జరిగిన పోలింగ్‌లో 116 కేంద్రాల్లో 15వేల 495 ఓట్లు పోలయ్యాయి.
ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు జిల్లా వ్యాప్తంగా 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రాథమిక కౌంటింగ్‌ను 9 రౌండ్లలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రాథమిక కౌంటింగ్‌లో భాగంగా బ్యాలెట్ పెట్టెలోని ఓట్లను 50 చొప్పున కట్టలు కడతారు. అన్నీ కలిపి, ఒక్కోదానికి 20 కట్టలు, 14 టేబుళ్లకు కేటాయిస్తారు. తర్వాత బ్యాలెట్ పత్రాలు తెరిచి కౌంటింగ్ ఏజెంట్లకు చూపిస్తారు. మొదటి ప్రాధాన్యం వచ్చిన బ్యాలెట్లను ఆయా అభ్యర్థులకు కేటాయించిన తొట్టెలో వేస్తారు. మొదటి రౌండ్‌లో టేబుల్‌కు వెయ్యి చొప్పున 14 టేబుళ్లకు 14వేల ఓట్లు లెక్కిస్తారు. ఇంకా 1 వేయి 495 ఓట్లు మిగులుతాయి. రెండో రౌండ్‌లో మూడు టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. మొదటి, రెండింటికి 500, మూడో దానికి 495 చొప్పున కేటాయించి ఓట్లు లెక్కించనున్నారు.
ఈ ఎన్నికల్లో అయిదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు 50 శాతం+ఒక ఓటు వస్తే, ఆయననే విజేతగా ప్రకటిస్తారు. అలా ఎవరికీ రాకపోతే రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద ఎలిమినేషన్ చేపడతారు. ఇందులో మొదటి ప్రాధాన్యత ఓట్లు ఏ అభ్యర్థికి తక్కువ వచ్చాయో చూసి, ఆ అభ్యర్థికి పడిన ఓటులో రెండో ప్రాధాన్యాత ఓటు మిగిలిన నలుగురిలో ఎవరికైనా వేస్తే.. వారికి దాన్ని కలుపుతారు. అప్పటికీ 50 శాతం+1 ఓటు రాకపోతే మిగతా అభ్యర్థులను ఎలిమినేషన్ ప్రక్రియలోకి తీసుకొస్తారు. అప్పటికీ ఎవరికీ 50 శాతం+ 1 ఓటు రాకపోతే, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని విన్నర్ గా ప్రకటిస్తారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. పాసులు ఉన్నవారిని మాత్రమే కేంద్రంలోకి అనుమతిస్తారు. ఒక్కో టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు, ఒక సూక్ష్మపరిశీలకుడిని నియమించారు. ఒక్కో టేబుల్ వద్ద అభ్యర్థికి ఒక ఏజెంట్‌ను అనుమతిస్తారు.
ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..
ఇదీ చదవండి: టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.