BRS Mallareddy: తూచ్.. సీఎం రేవంత్ రెడ్డి, నేను మంచి దోస్తులం.. యూటర్న్ తీసుకున్న మల్లన్న..

Telangana Politics: మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.  సీఎం రేవంత్ రెడ్డి , తాను గతంలో మంచి స్నేహితులమని, రేవంత్ సీఎం అవుతాడని మొదట తానే చెప్పానంటూ వ్యాఖ్యలు చేశారు.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 17, 2024, 11:33 AM IST
  • సీఎం రేవంత్ పై మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
  • టీడీపీలో ఉన్నప్పుడు మంచి దోస్తులమన్న మల్లన్న..
 BRS Mallareddy: తూచ్.. సీఎం రేవంత్ రెడ్డి, నేను మంచి దోస్తులం.. యూటర్న్ తీసుకున్న మల్లన్న..

Brs MLA Comments On CM Revanth Reddy: సాధారణంగా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండరని చెబుతుంటారు. ఒక పార్టీలో ఉండగా ప్రాణాలు ఇచ్చుకునే స్నేహితులు, మరో పార్టీలోకి వెళ్లగానే బధ్ద శత్రువులుగా మారిపోతుంది. ఇక.. కలసిమాట్లాడుకుని అలయ్ భలయ్ లా ఉంటారు. మరల కొట్టుకుని, తిట్టుకుంటారు. ఇలాంటి రాజకీయాలను మనంతరచుగా చూస్తుంటాం. ఈ క్రమంలో.. తాజాగా, మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో బీఆర్ఎస్ లో మంత్రిగా ఉన్నప్పుడు.. మంత్రి మల్లారెడ్డి, అప్పటి కాంగ్రెస్ పీసీసీ గా ఉన్న రేవంత్ పై పలుమార్లు ఆరోపణలు చేశారు.

Read More: Viral Video: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు... వీడియో చూస్తే తట్టుకోలేరు..

నువ్వేంత.. అంటే నువ్వేంత అన్నట్లుగా ఘాటు వ్యాఖ్యలు చేసుకున్నారు. మంత్రి మల్లరెడ్డి అనేక భూఆక్రమణలకు పాల్పడ్డారని, కాలేజీలలో అక్రమంగా డబ్బులు వసూలు చేశారని, ప్రభుత్వం చెరువులు, భూములు కబ్జాలు చేశారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్ గా అప్పటి బీఆర్ఎస్ మంత్రి మల్లరెడ్డి కూడా రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని, తనను ఇబ్బందులు పెట్టడమే పనిగా కూడా పెట్టుకున్నట్లు మల్లరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా... ఒకనోక దశలో.. రేవంత్ ను దమ్ముంటే రావాలని, బహింరంగ సమావేశంలో తోడలు కొట్టి మరీ రేవంత్ కు సవాల్ విసిరారు. ఇక ఎవరు ఊహించని విధంగా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ను ఏకీపారేస్తున్నారు. అదే విధంగా బీఆర్ఎస్ హాయాంలో జరిగిన అనేక అక్రమాలపై విచారణ చేయిస్తున్నారు. దీంతో అనేక మంది అధికారులు పోలీసు కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా.. మల్లారెడ్డి అక్రమాలపై అధికారులు కొరడ ఝుళిపించారు. అంతేకాకుండా.. మల్లారెడ్డి అల్లుడి కాలేజీలు ప్రభుత్వ స్థలంలో ఉన్న కట్టడాలను అధికారులు కూల్చేశారు. దీంతో ఆయన ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా, ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.

Read More: Bathing Tips:బాత్రూమ్ లో నగ్నంగా స్నానం చేస్తున్నారా..?.. మీ జీవితంలో ఈ అరిష్టాలు తప్పవంటున్న జ్యోతిష్యులు..

రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని తొలుత చెప్పింది తానే అని మల్లన్న అన్నారు. దివంగత నేత ఎమ్మెల్యే సాయన్న ఇచ్చిన విందులో.. అప్పట్లోనే రేవంత్ తో స్వయంగా చెప్పినట్లు గుర్తుచేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను ఆయన రిలీజ్ చేశారు. రేవంత్ రెడ్డి, తాను టీడీపీలో ఉన్నప్పుడు మంచి స్నేహితులమని, మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవని ఆయన మల్లన్న అన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు వస్తున్న కథనాలు అవాస్తవమన్నారు. తన కొడుకు భద్రారెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు, తన వంతుగా పాటు పడుతానని మల్లన్న అన్నారు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News