బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్, భారీగా తగ్గిన బంగారం ధర

బంగారం ప్రియులకు ఇది కచ్చితంగా గుడ్‌న్యూస్. బంగారం ధర భారీగా దిగొచ్చింది. ఇటీవలి కాలంలో ఒక్కరోజులో ఇంతగా తగ్గిన పరిస్థితి లేదనేది మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 24, 2021, 07:45 AM IST
 బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్, భారీగా తగ్గిన బంగారం ధర

బంగారం ప్రియులకు ఇది కచ్చితంగా గుడ్‌న్యూస్. బంగారం ధర భారీగా దిగొచ్చింది. ఇటీవలి కాలంలో ఒక్కరోజులో ఇంతగా తగ్గిన పరిస్థితి లేదనేది మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం.

బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల్లో(Gold price) మార్పులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు , డాలర్ విలువ వంటివి బంగారం ధరలపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ప్రతిరోజూ బంగారం ధరలు మారుతుంటాయి. తాజాగా బంగారం ధర భారీగా తగ్గింది. గత కొద్దిరోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర..రెండ్రోజుల్నించి స్వల్పంగా తగ్గింది. అయితే ఇవాళ మాత్రం భారీగా తగ్గి పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా  బంగారం ధర 1290 రూపాయలు తగ్గడం గమనార్హం. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో(Delhi Gold Price) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47 వేల 200 కాగా..24 క్యారెట్ల 10 గ్రాముల ధర 51 వేల 500గా ఉంది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46 వేల 990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 47 వేల 990గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46 వేల 210 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49 వేల 280 రూపాయలుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45 వేల 340 రూపాయలు కాగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49 వేల 460 రూపాయలుంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45 వేల 50 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49 వేల 150 రూపాయలుగా ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45 వేల 50 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 150 రూపాయలుంది. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఒకేలా ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో(Hyderabad Gold Price) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45 వేల 50 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49 వేల 150 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45 వేల 50 రూపాయలు కాగా,24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49 వేల 150గా ఉంది. ఇక విశాఖపట్నంలో కూడా అదే ధర కొనసాగుతోంది. 

Also read: త్వరలో పూర్తి కానున్న జీల్ - సోనీ విలీన ప్రక్రియ : పునీత్ గోయెంకా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News