ఆధునిక జీవనశైలి కారణంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో స్థూలకాయం ప్రధానమైంది. మరో సమస్య తక్కువ వయస్సుకే వృద్ధాప్య లక్షణాలు రావడం. ఈ రెండు సమస్యలకు ఆ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
క్యారట్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. క్యారట్ జ్యూస్ తాగడం వల్ల చాలా సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. స్థూలకాయం, మలబద్ధకం, చర్మ సమస్యలు, ఏజీయింగ్ వంటి సమస్యలు దూరమౌతాయి. వాతావరణంతో సంబంధం లేకుండా క్యారట్ ఎప్పుడైనా తినవచ్చు. క్యారట్ తినడం వల్ల శరీరంలో రక్తం కొరత ఉంటే దూరమౌతుంది. అంటే ఎనీమియా రోగుల్లో ఇది చాలా ప్రయోజనకరం. అంతేకాకుండా..శరీరం బరువు కూడా తగ్గుతారు. అనవసర కొవ్వు పేరుకుపోయుంటే..క్యారట్ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. క్యారట్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ బి8, జింక్, ఐరన్ సహా చాలా పోషకాలుంటాయి.
క్యారట్ ఉపయోగాలు
1. క్యారట్ జ్యూస్‌లో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఇది తీసుకోవడం వల్ల చర్మంలో నిగారింపు వస్తుంది. క్యారట్ జ్యూస్ తాగడం వల్ల ముఖంపై పింపుల్స్ వంటివి, నల్లటి మచ్చలు దూరమౌతాయి. కంటి వెలుతురు మెరుగుపడుతుంది. క్యారట్ జ్యూస్ ఈ కంటి చూపు మెరుగుపర్చేందుకు అద్భుతంగా పనిచేస్తుంది.
2. క్యారట్ జ్యూస్ శరీరంలో హిమోగ్లోబిన్ కొరతను తీరుస్తుంది. ఎనీమియాతో బాధపడేవారికి క్యారట్ చాలా ప్రయోజనకరం. క్యారట్ తినడం వల్ల శరీరంలో రక్తం వేగంగా తయారవుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
3. క్యారట్ జ్యూస్‌లో బీటో కెరోటిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మీకు ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కల్పిస్తుంది. శరీరంలో పెరుగుతున్న ఒత్తిడిని ఇది తగ్గిస్తుంది. క్యారట్ జ్యూస్‌లో పటికబెల్లం, నల్ల మిరియాలు కలిపి తాగితే..కఫం సమస్య కూడా పోతుంది.
Also read: Natural Remedies: గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలు ఆ 4 వస్తువులతో చిటికెలో మాటుమాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook