Bengaluru ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన Sasikala, తమిళనాడులో ఉత్కంఠ

VK Sasikala Discharged From Victoria Hospital |  అక్రమాస్తుల కేసులో అయిదేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న వీకే శశికళ కరోనా వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆదివారం నాడు బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 31, 2021, 01:40 PM IST
Bengaluru ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన Sasikala, తమిళనాడులో ఉత్కంఠ

Sasikala Discharged From Victoria Hospital: తమిళనాడు రాజకీయాలు మారేలా కనిపిస్తున్నాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే(AIADMK) బహిష్కృత నేత వీకే శశికళ ఇటీవల జైలునుంచి విడుదల కావడం తెలిసిందే. అయితే కరోనా బారిన పడటంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు శశికళ. జైలు నుంచి ఆమె విడుదలపై గత కొన్ని రోజులుగా తమిళనాడులో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

 

బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చేరిన శశికళ కరోనాకు చికిత్స తీసుకున్నారు. కోవిడ్-19(COVID-19) బారి నుంచి కోలుకున్న శశికళ ఆదివారం నాడు విక్టోరియా ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. ఆమె మద్దతుదారులు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. కరోనా బారి నుంచి కోలుకుని శశికళ(Sasikala Latest Update) ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన వీడియోను జాతీయ మీడియా ఏఎన్‌ఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

Also Read: Tamil nadu: ఖరారైన శశికళ విడుదల తేదీ, తమిళ రాజకీయాల్లో రాజుకోనున్న వేడి

 

 

 

అక్రమాస్తుల కేసులో గతంలో కొంతకాలం శిక్ష అనుశించిన శశికళ, 2017లో మరోసారి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు వెళ్లారు. మొత్తం అయిదేళ్ల జైలుశిక్షతో పాటు రాజకీయ పార్టీ నుంచి ఎన్నికల్లో ఆరేళ్లపాటు పోటీ చేయకుండా ఉండే కర్ణాటక హైకోర్టు గతంలో తీర్పు వెలువరించింది. ఈ నెల 27 వ తేదీన బెంగుళూరు జైలు నుంచి చిన్నమ్మ శశికళ విడుదలయ్యారు.

Also Read: LPG Gas Cylinder: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ఉచితంగా పొందాలంటే ఇలా చేయండి

 

కాగా, 2016లో అనూహ్య పరిణామాల మధ్య సీఎం జయలలిత మరణించారు. అనంతరం తీవ్ర ఉత్కంఠ నడుమ అన్నాడీఎంకే(AIADMK) అధినేత్రిగా శశికళ బాధ్యతలు స్వీకరించారు. అక్రమాస్తుల కేసులో శిక్ష లాంటి ఘటనలతో ఆమెను జయ మద్దతుదారులు అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. ఇటీవల జైలుశిక్ష పూర్తిచేసుకునే సమయంలో శశికళకు కరోనా సోకింది. తాజాగా కరోనాను జయించి ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు.

Also Read: ​Web WhatsApp Login: త్వరలో సరికొత్త WhatsApp Privacy ఫీచర్, 2 విధాలుగా వెబ్ లాగిన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News