Colonel Santosh Babu | అమరవీరుడు, కల్నల్ సంతోష్ బాబు అస్థికలను కుటుంబ సభ్యులు నేడు నిమజ్జనం చేశారు. కుమారుడికి నిర్వహించాల్సిన సాంప్రదాయ కార్యక్రమాలను సంతోష్ బాబు తల్లిదండ్రులు పూర్తిచేస్తున్నారు.
చైనాతో ఘర్షణలో అమరుడైన సూర్యాపేట జిల్లా వాసి, అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ సాయాన్ని ప్రకటించింది. సంతోష్ బాబు కుటుంబానికి అండగా ఉంటామని సీఎం కేసీఆర్ (CM KCR Announces RS 5 crore to Santosh Babu family)పేర్కొన్నారు.
తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫలితాల భయం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇద్దరు విద్యార్థినులు పరీక్షా ఫలితాల భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఫలితాలు రాకముందు ఒకరు చనిపోగా, పరీక్షలో ఫెయిలయ్యానన్న బాధతో మరో విద్యార్థిని తనువు చాలించింది.
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల (Telangana Inter Results)ను రేపు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.
ఏవైనా విపత్తులు సంభవించినా, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులు తలెత్తిన సందర్భాలలో ఏ సంస్థకైనా, వ్యక్తులకైనా, పెన్షనర్లకైనా చెల్లింపులు వాయిదా వేసే అధికారం కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఆ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న జీహెచ్ఎంసీ, పరిసర ప్రాంతాల జిల్లాల్లో 50వేల వరకు ఉచిత కరోనా పరీక్షలను తెలంగాణ సర్కార్ ప్రారంభించింది.
కరోనా వైరస్ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ కోవిడ్19 టెస్టులు జరిపిస్తున్నామని, తెలంగాణలో ఇప్పటివరకూ కమ్యూనిటీ స్ప్రెడ్ జరగలేదని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. కరోనా టెస్టులకు ధర (CoronaVirus Test Cost) నిర్ణయించినట్లు తెలిపారు.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో హరీష్ రావు సిబ్బందిలో కరోనా కలకలం రేపింది. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు హోమ్ క్వారంటైన్‌కి వెళ్లారు.
ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని తెలంగాణ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటాలని పిలుపునిచ్చారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం చాలా అవసరం. దీని వల్ల కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు. ఈ క్రమంలో క్యాబ్‌లో అడ్డుగా కవరు పెట్టి సోషల్ డిస్టాన్సింగ్ సౌకర్యాన్ని కల్పించారు.
సింగరేణి (Singareni Blast) లో జరిగిన ప్రమాదంపై కేంద్ర మంత్రులకు పిర్యాదు చేస్తానని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. రామగుండం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనిలో భారీ పేలుడు సంభవించి నలుగురు కాంట్రాక్ట్ కార్మికులు చనిపోవడం తెలిసిందే.
ఎన్నో దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ అవతరణ దినోత్సవం (Telangana Formation Day) నేడు (జూన్ 2). ఈ సందర్బాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలు రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి శాసనసభ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత శాసనసభ ఆవరణలోని జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు.
కూలీలకు సైతం జాబ్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం అధికారులకు చెప్పిందని, ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలందరికీ పని కల్పి్ంచాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామాణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
నేనూ ఒక రైతునే.. అందుకే రైతుగా చెబుతున్నాను.. ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తే ప్రతిరైతు తప్పకండా రాజవుతాడంటూ తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
లాక్డౌన్ కారణంగా టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశారు. అయితే 10th Class Exams ఫలితాలు భవిష్యత్తులో ప్రామాణికంగా పరిగణిస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.