MP Rammohan Naidu: మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు. దీని వెనక ఏదైనా కుట్ర ఉందేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. వికేంద్రీకరణ బిల్లును పూర్తిగా రద్దు చేసేంతవరకూ రైతులకు టీడీపీ అండగా ఉంటుందన్నారు.
ఇది ఇంటర్వెల్ మాత్రమేనన్న మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలకు ముగింపు ఇచ్చారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ తాత్కాలికమేనన్న విషయం జగన్ తాజా వ్యాఖ్యలతో అర్ధమౌతోంది.
Nara Bhuvaneshwari: ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వెక్కి వెక్కి ఏడ్చిన ఘటనపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి స్పందించినట్లు తెలుస్తోంది. ఆమె నుంచి అధికారిక స్పందన ఏమీ రానప్పటికీ... కుటుంబ సన్నిహిత వర్గాల ద్వారా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
Rajinikanth phone call to Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెక్కి వెక్కి ఏడ్చిన ఘటన టీడీపీ శ్రేణులు, నందమూరి ఫ్యామిలీతో పాటు పలువురు ప్రముఖులను కలచివేసింది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రబాబుకు ఫోన్ చేసి ఆయన్ను పరామర్శించారు.
Nandamuri Balakrishna warns YSRCP: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసీపీ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తన సోదరి భువనేశ్వరిని వైసీపీ నేతలు అవమానపరచడంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇకనైనా మారకపోతే మెడలు వంచి మారుస్తామని హెచ్చరించారు.
Pawan Kalyan: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు కంటతడి పెట్టడం బాధాకరమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
Chandrababu Naidu sensational decision: అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వైసీపీ నేతలు తనను రాజకీయంగా, వ్యక్తిగతంగా తీవ్ర అవమానాలకు గురిచేస్తున్నారని వాపోయారు. మళ్లీ సీఎం అయ్యాకే సభలో అడుగుపెడుతానని శపథం చేశారు.
AP: ఎన్నికల కమీషన్, ప్రభుత్వం మధ్య నడుస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల పంచాయితీ ఇప్పుడు హైకోర్టుకు చేరింది. ఫిబ్రవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమీషన్ తలపెట్టగా..సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతున్న నేపధ్యంలో వివాదం మొదలైంది.
Ap Assembly live updates: ఏపీ శీతాకాల సమావేశాలు మూడవ రోజు రసవత్తరంగా సాగుతున్నాయి. కీలకమైన పలు బిల్లుల్ని ప్రవేశపెట్టారు. చర్చ జరపడం లేదనే కారణంతో టీడీపీ వాకౌట్ చేసింది.
Ap Assembly live updates: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సంతాప తీర్మానాలతో సమావేశాలు మొదలయ్యాయి. ముందుగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల సంతాపం ప్రకటించి..ఆయన చేసిన సేవల్ని కొనియాడారు.
Amaravati Capital Issue: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో హైకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజధానిని మార్చే అధికారం శాసనసభకు ఎందుకుండదని కోర్టు ప్రశ్నించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏపీ అసెంబ్లీలో మంళవారం టీడీపీ-బీజేపీ సభ్యుల మధ్య చర్చ వాడీవేడిగా జరిగింది. వెనకబడిన జిల్లాల నిధులను కేంద్రం వెనక్కి తీసుకోవడంపై టీడీపీ సభ్యులు భగ్గుమన్నారు. నిధులు ఎందుకు వెనక్కి తీసకున్నారంటూ బీజేపీ సభ్యులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ స్పందిస్తూ ఇది సాంకేతిపరమైన అంశం మాత్రమేనని. కావాలని చేసిన పనికాదన్నారు. పీఎంవో అనుమతి లేదనే కారణంతో నిధులు వెనక్కి తీసుకున్నారని వివరణ ఇచ్చారు.
నవంబరు 23,24 తేదీలకు గాను దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు సెలవుల కోసం దరఖాస్తులు అందించారు. ఆ రెండు రోజులలో పలువురి ప్రముఖుల వివాహాలకు హాజరవ్వాల్సి ఉన్నందున ఎమ్మెల్యేలు సెలవులు కావాలని స్పీకరుకి వినతి పత్రాన్ని అందించారు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలతో స్పీకర్ కోడెల సభను ప్రారంభించారు. ఈ సందర్భంగ నీటి ప్రాజెకుల పురోగతిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి దేవినేని సమాధానమిచ్చారు. మారుమూల ప్రాంతంలో ఉన్న భూములకు నీరు అందించడమే లక్ష్యంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి 83 టీఎంసీలు రావడం జరిగిందని తెలిపారు. దీని వల్ల కృష్ణా డెల్టా రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. సముద్రంలో వృథాగా పోతున్న నీటిని మాతమ్రే మళ్లిస్తున్నామని మంత్రి దేవినేని వెల్లడించారు.
ప్రతిపక్షం లేకుండానే సభ ప్రారంభం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమౌతున్నాయి. పదిరోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రభుత్వ పథకాలపై సమగ్ర చర్చతో పాటు పలు ప్రజా సమస్యలు సభలో చర్చకు రానున్నాయి. కాగా. ప్రతిపక్ష పార్టీ వైసీపీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రతిపక్షం లేకుండా ఈ సారి సమావేశాలు జరగనున్నాయి. టీడీపీ సభ్యులుతో పాటు మిత్రపక్షమైన బీజేపీ సభ్యులు మాత్రమే సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రతిపక్షాలు లేకపోవడం సభకు ఎలాంటి అంతరాలు లేకుండా జరగనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.