Harbhajan on Kohli: సౌతాఫ్రికాతో మూడో టెస్టుకు ముందు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. నేటి నుంచి జరగబోయే టెస్టులో విరాట్ కోహ్లీ తప్పక సెంచరీ సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అలాగే సీనియర్ బ్యాటర్లు పుజారా, రహానె కూడా రాణిస్తారని తెలిపాడు.
భారత జట్టు మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్.. లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ)లో పాల్గొనబోతున్నారు.
భారత క్రికెట్‌కు కొత్త పాత్రల్లో సేవలందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని టీమిండియా వెటరన్ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ స్పష్టం చేశారు. అయితే ఓ కోరిక తీరకుండానే రిటైర్మెంట్ ఇచ్చినట్టు భజ్జీ భావోద్వేగం చెందారు.
Harbhajan Singh Retirement: అంతర్జాతీయ క్రికెట్ సహా అన్నీ రకాల టోర్నీలకు టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 23 ఏళ్ల క్రికెట్ కెరీర్లో సహకరించిన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశాడు. అయితే ఇన్నాళ్ల పాటు హర్భజన్ సింగ్ (Harbhajan Singh Retires) గురించి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. క్రికెట్లోని అన్ని రకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా హర్భజన్ రిటైర్మెంట్ ప్రకటించారు.
Harbhajan Singh: టీమ్ ఇండియా ఆఫ్ స్పిన్నర్.. హర్భజన్ సింగ్ అన్ని ఫార్మాట్లలో రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఓ మీడియా రిపోర్ట్ ప్రకారం నేడు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముంది.
Harbhajan Singh: టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్...సూపర్ స్టార్ రజనీకాంత్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు.తలైవా పుట్టినరోజు సందర్భంగా..ఆయన టాటూను తన ఛాతిపై వేసుకున్నాడు భజ్జీ.
టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించారు. బౌలింగ్‌లో ఎప్పటికప్పుడూ వైవిధ్యం చూపుతూ యాష్ వికెట్లు పడగొడుతున్నాడన్నాడు. అశ్విన్ ఇదే ఫామ్‌ను మరి కొన్నేళ్లు కొనసాగిస్తే.. భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే రికార్డును కూడా బద్దలు కొడతాడని జహీర్ అభిప్రాయపడ్డాడు.
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. భారత్, న్యూజీలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో ఓ రికార్డు నెలకొల్పాడు. ఐదో రోజు ఆటలో కివీస్ వైస్ కెప్టెన్ టామ్ లాథమ్‌ను ఔట్ చేయడంతో టెస్ట్ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు.
ఈ రోజు సాయంత్రం టీ20 వరల్డ్ కప్ లో భారత్ - పాకిస్తాన్ మధ్య జరగనున్న మ్యాచ్ సందర్భంగా ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఫన్నీ కామెంట్స్ చేసారు.. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది
Harbhajan Singh blessed with a baby boy: హర్భజన్, గీతా బస్రా దంపతులు రెండో పర్యాయం తల్లిదండ్రులయ్యారు. గీతా బస్రా ఓ పండంటి బాబుకు జన్మనిచ్చిందని భజ్జీ తెలిపాడు. ఈ మేరకు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో భావోద్వేగంతో ఓ సందేహాన్ని షేర్ చేసుకున్నాడు.
వలస కూలీలు, దినసరి కార్మికులను లాక్డౌన్ సందర్భంగా వారి స్వస్థలాలకు వెళ్లేందుకు రైలు, బస్సు, విమాన టికెట్లు అందించి గొప్ప సాయాన్ని అందించాడు. తాజాగా కరోనా సెకండ్ వేవ్‌లో టీమిండియా క్రికెటర్లకు సైతం సోనూసూద్ సాయం చేసి కష్టకాలంలో ఆదుకుంటున్నాడు.
Harbhajan Singh's tweet on cricket: టీమిండియా మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ చేసిన ఓ ట్వీట్ క్రికెట్ ప్రియులను భరించలేనంత సస్పెన్స్‌కి గురిచేస్తోంది. అంత సస్పెన్స్ క్రియేట్ చేసేంతగా హర్బజన్ సింగ్ ఏం ట్వీట్ చేశాడనే కదా మీ డౌట్.. ఐతే ఆ ట్వీట్ ఏంటో మీరే చూడండి.
Ambati Rayudu in IPL 2020: ఐపిఎల్ 2020కి మరెంతో దూరంలో లేదు. ఇంకో వారం రోజుల్లోనే ఆ బిగ్గెస్ట్ క్రికెట్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. 13వ ఐపీఎల్ సీజన్లో పాల్గొనేందుకు అన్ని జట్లు సిద్ధం అవుతున్నప్పటికీ... చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) మాత్రం సురేష్ రైనా, హర్బజన్ సింగ్ ( Suresh Raina, Harbhajan Singh ) రూపంలో తగిలిన ఎదురుదెబ్బల నుంచి ఇంకా తేరుకున్నట్టు కనిపించడం లేదు.
క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) చెన్నై పోలీసులను ఆశ్రయించాడు. చెన్నైకి చెందిన ఓ వ్యాపారికి అప్పు ఇవ్వగా ఎగ్గొట్టినట్లు గురువారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2020 సీజన్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దెబ్బ దెబ్బ తగులుతోంది. ఇప్పటికే సీఎస్కే జట్టులో ఇద్దరు ఆటగాళ్లు, 11 మంది సహాయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతోపాటు స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా సైతం వ్యక్తిగత కారణాలతో లీగ్ నుంచి తప్పుకున్నాడు.
అన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్లు ఈ వారం యూఏఈకి బయలుదేరనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు సైతం ప్రయాణానికి సిద్ధమైంది. అయితే సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) లేకుండానే చెన్నై టీమ్ దుబాయ్‌కి బయలుదేరనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.