TTD darshanam rules: తిరుమల: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ చేపట్టడంతో తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం ( Lord Balaji) కూడా నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా జూన్ 8వ తేదీ నుంచి ప్రార్థనా మందిరాల్లో భక్తులకు ప్రవేశం కల్పిస్తూ కేంద్రం సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో తిరుమలలో వెంకన్న భక్తులకు శ్రీవారి దర్శనం కోసం ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.
Bandi Sanjay Kumar: హైదరాబాద్: కొందరు వ్యక్తుల కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వం జి.ఓలు జారీ చేయడం దుర్మార్గమైన చర్య అని కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తమకు నచ్చినట్టుగా కొందరు వ్యక్తుల కోసం ఏకంగా జీవోలు జారీ చేయడం అనేది ప్రభుత్వం దిగజారుడుతనానికి ఓ నిదర్శనం అని ఆయన తెలంగాణ సర్కార్‌పై ( Telangana govt ) మండిపడ్డారు.
Tablighi Jamaat తబ్లిగీ జమాత్ విషయంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 2000 మంది విదేశీ తబ్లిగీ జమాత్ కార్యకర్తలు భారత్‌లోకి అడుగుపెట్టకుండా వారిపై భారత్ పదేళ్లపాటు నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం ఆదేశాలు జారీచేసింది.
Cancelled tickets money: ఇండియన్ రైల్వే మార్చి 21 నుంచి 31 మధ్య రద్దు చేసిన ప్రయాణికుల అన్ని టికెట్స్‌కి నగదును తిరిగి సదరు రైలు ప్రయాణికులకు చెల్లించింది. ఆన్లైన్లో ఐఆర్సిటిసి ఎకౌంట్ ( IRCTC account ) ద్వారా టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లందరికీ రద్దు చేసిన టికెట్స్ మొత్తానికి అయిన నగదును వారి వారి ఖాతాల్లో జమ చేసింది.
Telangana COVID-19 updates తెలంగాణలో కరోనావైరస్ విజృంభిస్తోంది. మంగళవారం నాడు కొత్తగా మరో 99 మందికి కరోనావైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన కేసుల్లో 87 మంది స్థానికులు కాగా, మిగితా 12 మంది వలసకూలీలు ( Migrant workers ) ఉన్నారు. స్థానికులలో అత్యధికంగా జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలో 70 కేసులు వెలుగుచూశాయి.
గత రెండు నెలలకు పైగా లాక్ డౌన్ కారణంగా మూసివేయబడిన తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్టకేలకు ద్వారాలు తేరుచుకోనున్నాయి. ప్రాథమికంగా ఉద్యోగులు, స్థానిక భక్తులతో తిరుమల ఆలయంలో
Fight against COVID-19 కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి వారికి అవగాహన కల్పించేందుకు కృషిచేస్తోన్న జర్నలిస్టుల సేవలు మరవలేమని తెలంగాణ హైకోర్టు ( Telangana high court ) వ్యాఖ్యానించింది. కరోనావైరస్తో ( Coronavirus pandemic ) నిత్యం ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకుని వారికి అండగా నిలబడాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ (YS Jagan) ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఆయన మరికాసేపట్లో ఢిల్లీ బయలుదేరాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా వేయాల్సి వచ్చింది.
AP CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ( Amit Shah ) పాటు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ను ( Gajendra Singh Shekhawat ) సీఎం జగన్ కలవనున్నారని తెలుస్తోంది.
కరోనా మహమ్మారి బారిన పడిన 100సంవత్సరాల వయసు గల మహిళ వృద్దురాలు కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్న సంఘటన ఇండోనేషియా చోటుచేసుకుంది. ఇండోనేషియాలోని తన స్వస్థలమైన సురబాయలో
గత రెండు నెలలుగా కరోనా మహమ్మారి ప్రబలిన నాటి నుండి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో చిక్కుకుపోయిన వలసకార్మికులు తమ స్వస్థలాలకు పయనమయ్యారు.
వలస కూలీలను తమ స్వగ్రామాలకు తరలిస్తున్న ట్రాలీ వాహనాన్ని లారీ వెనక నుంచి ఢీకొట్టిన ఘటన నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల బైపాస్ రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
'కరోనా వైరస్' కారణంగా దాదాపు 2 నెలలకు పైగా లూప్ లైన్లకే పరిమితమైన రైళ్లు.. క్రమక్రమంగా పట్టాలెక్కుతున్నాయి. ఇప్పటికే వలస కూలీల కోసం ప్రత్యేక శ్రామిక్ రైళ్లు, సాధారణ ప్రయాణీకుల కోసం పరిమిత సంఖ్యలో రైల్వే సర్వీసులు నడిపిస్తున్న రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
'కరోనా వైరస్' కారణంగా ఆర్ధికంగా బాగా చితికిపోయాం. జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. మాకు కేంద్రం నుంచి సహకారం చేయాల్సిన అవసరం ఉంది. ఇదీ ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ.
లాక్ డౌన్ 5.0 రేపటి నుంచి అమలులోకి రానుంది. ఈ క్రమంలో చాలా కార్యకలాపాలకు సడలింపులు ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఆలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా మందిరాలు కూడా తెరుచుకోనున్నాయి.
'కరోనా వైరస్' ఉద్ధృతంగా విస్తరిస్తున్నందున దేశ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కునేందుకు ఒక్కొక్కరూ తమ వంతు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో శనివారం కొత్తగా మరో 74 కరోనా పాజిటివ్ కేసులు ( coronavirus positive cases ) నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే అత్యధికంగా 41 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,499కు చేరుకుంది.
లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ( Lockdown extension ) కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ వ్యాప్తిని ( Coronavirus ) నివారించాలంటే కంటైన్మెంట్ జోన్లలో ( Containment zones ) కచ్చితంగా, కఠినంగా లాక్ డౌన్ పాటించాల్సిందేనని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. జూన్ 30 వరకు లాక్ డౌన్ 5.0 ( Lockdown5.0 ) అమలులో ఉండనున్నట్టు కేంద్రం ప్రకటించింది.
కరోనావైరస్ (Coronavirus ) విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 ( COVID-19 ) వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కొనసాగించడానికే కేంద్రం మొగ్గుచూపింది ( Lockdown extension ).
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఎక్కడికక్కడే చిక్కుకు పోయిన వలస కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యింది. లాక్డౌన్ కారణంగా కార్మికులు గత నెలలకు పైగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.