Tamil director Balamithran | లాక్ డౌన్ సమయంలో షూటింగ్స్ లేకపోవడం, చేస్తున్న సినిమాల పనులు మధ్యలోనే ఆగిపోవడం వంటి పరిణామాలు సినీ కళాకారులను తీవ్ర మానసిక ఒత్తిడికి (Mental stress) గురిచేస్తున్నాయి. కొంతమంది ఆ ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఇంకొంత మంది వాటిలోంచి బయటికి రాలేకపోతున్నారు.
Coronavirus tests | హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ( Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. కరోనావైరస్పై ప్రజల్లో అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తూ కోవిడ్-19పై యుద్ధం చేస్తోన్న జర్నలిస్టులకు సరైన భద్రత లేకుండాపోయిందని రేవంత్ రెడ్డి తన బహిరంగ లేఖలో (Open letter) పేర్కొన్నారు.
Bonalu festival 2020 | హైదరాబాద్ : కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ ఏడాది బోనాల ఉత్సవాలను (Bonalu) నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 25 వ తేదీ నుండి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బోనాల ఉత్సవాలపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఓ సమావేశం జరిగింది.
Chartered flights for migrant workers | ముంబై: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధించిన కారణంగా ముంబైలో చిక్కుకుపోయి ఇబ్బందుులు పడుతున్న వలస కూలీల ( Migrant workers) పట్ల బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan ) తన ఔదార్యాన్ని చాటుకున్నారు.లాక్ డౌన్ ( Lockdown) కారణంగా ముంబైలో చిక్కుకుపోయిన ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన వలస కూలీల్లో 1000 మందికిపైగా వలసకూలీలును వారి వారి స్వస్థలాలకు తరలించడానికి 6 చార్టర్డ్ ఫ్లైట్స్ బుక్ చేసి బిగ్ బి తన గొప్ప మనసు చాటుకున్నారు.
Journalist Manoj died of COVID-19 | హైదరాబాద్, జూన్ 10 : కరోనావైరస్తో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో కన్నుమూసిన హైదరాబాద్ జర్నలిస్ట్ మనోజ్ కుమార్ మృతికి గాంధీ ఆస్పత్రి నిర్లక్ష్య వైఖరే కారణం అని ఆరోపించారు ఆయన సోదరుడు సాయినాథ్. గాంధీ ఆస్పత్రిలో ఉన్న లోపాలపై సాయినాథ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆసుపత్రిలో చేరిన కరోనావైరస్ పేషెంట్స్‌ను ఆస్పత్రి సిబ్బంది పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారని.. అందువల్లే తన సోదరుడు మనోజ్ కుమార్ మృతి చెందారని సాయినాథ్ ఆరోపించారు.
Tollywood celebrities | అమరావతి: ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం సహకరించాల్సిందిగా కోరుతూ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, సి కళ్యాణ్, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తదితరులు మంగళవారం ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని ( AP CM YS Jagan) కలిసిన సంగతి తెలిసిందే. అయితే, సినీ పెద్దలతో సమన్వయం చేయాల్సిందిగా సూచిస్తూ సీఎం జగన్ ఆ బాధ్యతను మంత్రి పేర్ని నానికి ( Minister Perni Nani) అప్పగించారు.
TDP vs YSRCP | అమరావతి: వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి, టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నానికి మధ్య ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ వార్ జరుగుతోంది ( Vijaya Sai Reddy vs Kesineni Nani). ఒకరి ఆరోపణలకు మరొకరు తిప్పికొడుతూ వరుస ట్వీట్స్‌తో యుద్ధం చేసుకుంటున్నారు.
Tollywood celebrities | చిరంజీవి, నాగార్జున, ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, సి కళ్యాణ్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఇతర టాలీవుడ్ ప్రముఖులు ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని ( AP CM YS Jagan) కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయిన సినీ ప్రముఖులు.. ఏపీ సర్కారు నుంచి సినీ పరిశ్రమకు అవసరమైన సహాయసహకారాల గురించి చర్చించారు.
కరోనా మహమ్మారి దాపరించి ఉన్న విపత్కర పరిస్థితుల్లో ఓ హెయిర్ సెలూన్ యజమాని గొప్ప మానవత్వాన్ని చాటుకున్నాడు. ముంబైలోని ఓ సెలూన్ యజమాని రోడ్డు పక్కన నివసించే వీది బాలలకు, పేద పిల్లలకు
COVID-19 in AP| అమరావతి: ఏపీ సచివాలయంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మున్ముందు కరోనావైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఏపీ సర్కార్ తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే పరిశ్రమల శాఖ పరిధిలోని ఉద్యోగులకు ఇంటి నుంచే పని ( Work from home ) చేసుకోవడానికి అనుమతి ఇస్తూ ఏపీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్ అదేశాలు జారీ చేశారు.
Telangana secretariat| హైదరాబాద్: తెలంగాణకు తాత్కాలిక సచివాలయంగా పనిచేస్తోన్న బూర్గుల రామకృష్ణా రావు భవన్లో ( BRKR Bhavan ) కరోనావైరస్ కలకలంరేపింది. బిఆర్కెఆర్ భవన్‌లోని 8వ అంతస్తులో అటెండర్, ఆఫీస్ బాయ్‌గా సేవలు అందిస్తున్న ఇద్దరికి కరోనావైరస్ సోకినట్టు ( COVID-19) తెలుస్తోంది. కరోనావైరస్ బారిన పడిన ఇద్దరూ తండ్రీకొడుకులేనని సమాచారం.
మార్చి 20 తర్వాత తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. నేటి ఉదయం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, సిబ్బంది శ్రీవారిని దర్శించుకుంటున్నారు.
లాక్డౌన్ కారణంగా ఇంటికి చేరుకునే మార్గం తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న వలస కూలీలు, కార్మికులకు నటుడు సోనూ సూద్ పెద్ద దిక్కుగా మారాడు. అయితే శివసేన పార్టీ మాత్రం సోనూ సూద్ చర్యలను పొలిటికల్ డ్రామాగా చిత్రీకరించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.
దేశ రాజధానిలోని మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ దాదాపుగా రెండు నెలల నుండి కరోనా మహమ్మారి నేపథ్యంలో మూసివేయబడిన విషయం విదితమే. చాలా కాలం తర్వాత సోమవారం నుండి క్రమానుగత పద్ధతుల్లో
Coronavirus positive cases: హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం కొత్తగా 206 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు జరిపిన కోవిడ్-19 పరీక్షల్లో ( COVID-19 tests) 206 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని తాజాగా సర్కారు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ పేర్కొంది.
TS 10th class exams 2020: హైదరాబాద్: పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో పరీక్షల నిర్వహణ కంటే విద్యార్థుల ప్రాణాలే ముఖ్యమని హై కోర్టు సూచించిన నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకునే, రణవీర్ సింగ్ షూటింగులతో ఎప్పుడూ బిజీగా గడిపేవారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఇద్దరూ ఇంటికే పరిమితమయ్యారు. పెళ్లి అయిన తర్వాత తొలిసారి కావాల్సినంత సమయాన్ని
TS SSC exams 2020: హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షలపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడి ఓ స్పష్టత వచ్చింది. తెలంగాణలో ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జూన్ 8 నుంచి యధావిధిగా 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. అయితే, జీహెచ్ఎంసీతో పాటు రంగారెడ్డి జిల్లా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్నందున ఆ ప్రాంతాల్లో 10వ తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు అంగీకరించలేదు.
TS Tenth class exams: హైదరాబాద్: పదో తరగతి పరీక్షలపై సందిగ్ధత కొనసాగుతోంది. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో జూన్ 8 నుంచి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ( TS SSC exams) జరగనున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఈ పరీక్షలను నిర్వహించడం అవసరమా అనే కోణంలో హైకోర్టులో విచారణ జరుగుతోంది.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వలసకార్మికులు ప్రత్యేక రైళ్ల ద్వారా తమ స్వస్థలాలకు చేరుకొంటున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ వెళుతున్న రైలు భోపాల్‌లో రైల్వే స్టేషన్లో కొన్ని నిమిషాల పాటు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.