కరోనా వైరస్ ఫస్ట్ ఫేజ్ నుంచి కోలుకోకుండానే.. బ్రిటన్ లో ఇప్పుడు కరోనా రెండవదశ ప్రతాపం చూపిస్తోంది. రోజుకు లక్ష కొత్త కేసులు నమోదవుతూ..ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
లాక్డౌన్ కారణంగా ఓవర్ ది టాప్ ప్లాట్ ఫామ్స్ బాగా ఆదరణ పొందాయి. ధియేటర్లు మూతపడటంతో ప్రేక్షకుల వినోదానికి ఇవే కేరాఫ్ అడ్రస్ గా నిలిచాయి. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా శుభవార్తే. పెండింగులో ఉన్న మూడు డిఏల చెల్లింపుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరోనా కష్టకాలంలో డీఏ చెల్లింపుకు అంగీకరించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మొత్తానికి స్కూళ్ల ప్రారంభం ఖరారైంది. రెండుసార్లు వాయిదా అనంతరం నవంబర్ 2 నుంచి ప్రారంభించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఏ రోజు ఏ తరగతులు నిర్వహిస్తారనేది వెల్లడించారు.
లాక్డౌన్ సమయంలో లోన్ మారటోరియం తీసుకున్నవారికి సుప్రీంకోర్టు శుభవార్త అందించింది. నవంబర్ 15 వరకూ వడ్డీపై వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. వెంటనే అమలు చేయాలని..నెల సమయం ఎందుకని ప్రశ్నించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభవార్త అందించారు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరో రెండు మూడ్రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి.
Allu Arjun praises Palasa 1978 movie director Karuna Kumar: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పలాస 1978 చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించాడు. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లాక్డౌన్కి రెండు వారాల ముందు మార్చ్ 6న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి గొప్ప స్పందన లభించినప్పటికి, కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి కారణంగా థియేటర్లు మూసివేయడంతో ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడలేదు.
కోవిడ్ 19 కారణంగా ప్రస్తుతం రైలు ప్రయాణాలకు భారీగా డిమాండ్ ఎదురవుతోంది. ప్రయాణీకుల డిమాండ్ నేపధ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఆ రైళ్లు నిలిచే స్టేషన్లను సైతం ప్రకటించింది.
కరోనా కాలం తరువాత అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం లాక్ డౌన్ లో నిలిచిపోయిన జీవితాన్ని మళ్లీ ప్రారంభించడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో మరోసారి లాక్డౌన్ (LockDown In India) విధించనున్నారని ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 25నుంచి కేంద్ర ప్రభుత్వం మరోసారి సంపూర్ణ లాక్డౌన్ విధించేందుకు నిర్ణయం తీసుకుందని ఓ వార్త వైరల్ అవుతోంది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant Singh Rajput ) ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. సీబిఐ, ఈడితో కలిసి ఈ కేసులో డ్రగ్స్ కోణాన్ని తవ్వి తీస్తోన్న నార్కోటిక్స్ క్రైమ్ బ్యూరో (NCB) కొత్త కొత్త విషయాలను కనుక్కుంటోంది.
కరోనావైరస్ కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మార్చిలో కరోనా లాక్డౌన్ ప్రకటించిన నాటినుంచి రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సడలింపుల మేరకు 230 కొవిడ్ స్పెషల్ రైళ్లను రైల్వేశాఖ ప్రయాణికుల కోసం నడిపించింది.
ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) లో మద్యం ధరలు అధికంగా ఉండటంతో.. మద్యం ప్రియులు సరిహద్దుకు దగ్గరగా ఉన్న వేరే రాష్ట్రాలను ఆశ్రయిస్తున్నారు. ఇదిలాఉంటే.. అడ్డదారిలో ఇప్పుడే లక్షలు సంపాదించుకోవచ్చన్న దుర్భుద్దితో చాలా మంది దళారి వ్యాపారులు అక్రమంగా వేరే రాష్ట్రాల నుంచి భారీగా మద్యం బాటిళ్ల ( Illicit Liquor ) ను ఏపీకి తరలిస్తున్నారు.
కరోనావైరస్ ( Coronavirus ) ప్రభలుతున్న సమయంలో పరిస్థితులను సాధారణంగా మార్చేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వల్ల భవిష్యత్తులో మరింత ప్రమాదరకమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( WHO ) హెచ్చరించింది
ఏపీ, తెలంగాణ ( Ap & Telangana ) లో మధ్య ఆర్టీసీ బస్సులు తిరిగే విషయంలో నిర్ణయం మరోసారి వాయిదా పడింది. ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చల్లో పురోగతి కన్పించలేదు. మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.
ఇప్పుడంతా అన్ లాక్ ( Unlock 4) ప్రక్రియే నడుస్తోంది. దేశంలో, రాష్ట్రాల్లో ఒక్కొక్కటిగా తెర్చుకుంటున్నాయి. ఇక అందరూ ఎదురూచూస్తున్నది మెట్రో సర్వీసులు, స్కూల్స్ ప్రారంభం ఎప్పుడనే విషయంపైనే. సెప్టెంబర్ 1 నుంచి మెట్రో సర్వీసులు ( Metro services ) ప్రారంభించనున్నారా ? కేంద్రం ఏం ఆలోచిస్తోంది ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.