Heavy Rains In Delhi | ఢిల్లీతో సహా దేశ రాజధాని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రవాణాకు అడ్డంకులు తలెత్తుతున్నాయి. మరో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
కరోనావైరస్ (Coronavirus) విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలోనే వర్షాకాలం (monsoon) కూడా ప్రారంభమైంది. ఈ కాలంలో మనకు కొంత ఉల్లాసంగా ఉంటుంది కానీ.. సీజనల్ వ్యాధులు మనల్ని నిద్రపోకుండా చేస్తాయి. ఈ కాలంలో సరైన ఆహార పదార్థాలను తీసుకోకపోతే.. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారు కూడా సీజనల్ వ్యాధుల బారిన పడి అనారోగ్యానికి గురవుతారు.
Weather forecast | అమరావతి: నైరుతి రుతుపవనాల (Monsoon ) ప్రభావంతో ఇప్పటికే తడిసి ముద్దవుతున్న కోస్తాంధ్రకు తాజాగా మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు ( Heavy rains ) పొంచి ఉన్నాయి. బంగాళాఖాతంపై ఒడిషా తీరంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనంతో పాటు ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Dust storm in Delhi | న్యూ ఢిల్లీ: భారీ ఉష్ణోగ్రతలతో భగభగ మండుతున్న ఢిల్లీ వాతావరణం బుధవారం సాయంత్రం కురిసిన జల్లులతో ఒక్కసారిగా చల్లబడింది. అయితే, అంతకంటే ముందుగా ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంత పరిసరాల్లో ( Delhi-NCR) దుమ్ము తుఫాన్ విరుచుకుపడింది. దుమ్ము తుఫాను వెంటే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కుండపోతగా కురిసింది.
Weather updates | విశాఖ: తూర్పు మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరో 24 గంటల్లో ఆ అల్పపీడనం మరింత బలపడనున్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
రైతులకు వాతావరణ శాఖ చల్లటి కబురు తీసుకొచ్చింది. నైరుతి రుతుపవనాలు ఆశించినట్టుగానే జూన్ 1వ తేదీన కేరళను తాకాయి. రుతు పవనాల రాకతో కేరళలో రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ ( IMD ) వెల్లడించింది. కేరళలోని కొయికోడ్ జిల్లాలో ( Kozhikode ) భారీ వర్షపాతం నమోదైంది.
దేశవ్యాప్తంగా రైతులు ఎంతో ఆశగా ఎదురుచూసే నైఋతు ఋతుపవనాలు జూన్ 1న కేరళ రాష్ట్రంలోని ప్రధాన భూభాగంలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ చల్లని కబురు తెలిపింది. కాగా భారత్ లో అత్యధిక శాతం వర్షపాతం నైరుతి
కొన్ని కోట్లాది మంది రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. 2020 ఏడాదిలో సాధారణ వర్షపాతం నమోదు కానున్నట్టు వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వర్షాకాలంలో వర్షాలు 100% సమృద్ధిగా కురుస్తాయని కేంద్ర భూగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాధవన్ రాజీవన్ తెలిపారు.
ఎప్పుడెప్పుడు చినుకు పడుతుందా, ఎప్పుడెప్పుడా సాగు మొదలెడదామా అని వర్షం కోసం ఆకాశం వైపు ఎదురుచూస్తున్న రైతులకు ఇంకా వేచిచూడక తప్పదు అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు.
తెలుగు రాష్ట్రాల వారికి గుడ్ న్యూస్... ఇప్పటి వరకు భగభగ మండిన బానుడు ఇక చల్లబడనున్నాడు. ఎందుకంటే నైరుతీ రుతుపవనాలు ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించనున్నాయి.
రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికే రుతుపవనాల ప్రభావంతో నిన్నటి నుంచి పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అయితే తెలంగాణ, కోస్తా ఆంధ్ర ప్రాంతం ఇంకా చల్లబడలేదు. రుతుపవనాల ప్రభావంతో ఈ ప్రాంతాల్లోనూ ఈ రోజు వర్షాలు కురిసే అవకాశముంది.
వర్షాకాలం వచ్చిదంటే అందరూ ఎక్కడ ఏం తడిసిపోతాయో అని గాభరా పడుతూ కనిపిస్తుంటారు. పుస్తకాలు, బట్టలు, నగలు, చెప్పులు ఇలా తమ వస్తువులు ఎక్కడ తడిసిపోతాయోనని సందేహిస్తుంటారు. బయట ఉన్నా ఇంటికి తొందరగా వచ్చేస్తుంటారు. వచ్చి అన్ని సర్దుకుంటారు. ఈ చిన్న చిట్కాలను పాటిస్తే ఆ వస్తువులు తడవకుండా చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు.. ఆ చిట్కాలేంటో చూద్దాం పదండీ..!
* వర్షాకాలంలో పుస్తకాల వైపు కాస్త ధ్యాస పెట్టాలి. చెమ్మకు చెదలు పట్టే అవకాశం ఎక్కువ. కనుక పుస్తకాలను పక్కకు పెట్టి కిరోసిన్ అద్దిన బట్టతో ఆ అరల్ని రుద్ది పుస్తకాలు సర్దుకోవాలి. ఇలా చేయడం వల్ల చెదలు పట్టవు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.