జబ్ తక్ సమోసామే ఆలూ రహేగా..తబ్ తక్ బీహార్ మే లాలూ రహేగా… ఇప్పటివారికి ఈ మాటలు గుర్తున్నాయో లేదో గానీ లాలూ తరచూ చెప్పిన మాటలివి. అటువంటిది బీహార్ రాజకీయాల్లో తొలిసారి లాలూతో పాటు మరో ఇద్దరు కీలకనేతల్లేకుండానే రాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis), శివసేన కీలక నేత, ఎంపీ, సంజయ్ రౌత్ ( Sanjay Raut ) శనివారం ముంబైలోని ఓ లగ్జరీ హోటల్లో భేటీ అయ్యారన్న విషయం తెలియగానే రాజకీయ వర్గాల్లో అలజడి మొదలైంది. బీజేపీతో బంధం తెగిపోయిన నాటినుంచి ఎప్పుడూ శివసేన బీజేపీపై విరుచుకుపడుతూనే ఉంది. అయితే వారిద్దరి భేటీపై సర్వత్రా చర్చనీయాంశమైంది.
బాలీవుడ్ యువ నటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ (Sushant Singh Rajput) అనుమానస్పద మృతి నాటినుంచి మహారాష్ట్ర, బీహార్ ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం (CEC) బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ను విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో బీహార్ ఎన్నికల (Bihar Assembly Elections) పై నెలకొన్న సందిగ్ధత వీడింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను శుక్రవారం ప్రకటించింది. మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం (CEC) వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై రాజ్యసభ (Rajya Sabha) లో తీవ్ర గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విపక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యులు.. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ (Harivansh) పై అనుచితంగా ప్రవర్తించారంటూ.. చైర్మన్ వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) 8మంది సభ్యులను ఆదివారం సస్పెండ్ చేశారు.
ఎన్డీఏ (NDA) ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లుల (agriculture bill) ను అందరూ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లులు తీసుకురావడాన్ని నిరసిస్తూ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ శిరోమణి అకాలీదళ్ పార్టీ సభ్యురాలు హర్సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా సైతం చేశారు. పలు వ్యవసాయ సంఘాలు రైల్ రోకోకు, బంద్కు పిలుపునిచ్చాయి. రేపు ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం.
ఎన్డీయే (NDA) ప్రభుత్వం తీసుకువచ్చిన రైతులు, వ్యవసాయ రంగ ఉత్తత్తులకు సంబంధించిన బిల్లుల (Agricultue Bills) పై విపక్ష పార్టీలన్నీ కేంద్రాన్ని చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్డీయే భాగస్వామ్యపక్షమైన శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ (Harsimrat Kaur Badal) కూడా తన పదవికి రాజీనామా చేశారు.
పార్లమెంటులో ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధిత బిల్లును వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వ భాగస్వామ్య శిరోమణి అకాలీదళ్ పార్టీ నాయకురాలు, కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ (Harsimrat Kaur Badal) రాజీనామా చేశారు. సెంట్రల్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఆమె గురువారం రాత్రి రాజీనామా చేశారు.
UPSC నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) మరియు నేవల్ అకాడమీ పరీక్షల ఫలితాలను మంగళవారం విడుదల (UPSC NDA And NA final results) చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://upsc.gov.in/ లో ఫలితాలు చూసుకోవచ్చు.
అయోధ్య ( Ayodhya ) లో రామ మందిర భూమి పూజకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. ఆగస్టు 5న రామ మందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ( PM Narendra Modi ) శంకుస్తాపన చేయనున్నారు. మరో మూడు రోజుల్లో జరిగే ఈ వేడుక కోసం దేశం మొత్తం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. సరిగ్గా ఏడాది క్రితం మే 30న ప్రస్తుతం NDA ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టింది. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏడాది పాలన పూర్తి కావడంతో.. ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం ముందున్న సవాళ్లకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో అన్నీ ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 2023అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అటు కేంద్రంలో 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఏ పార్టీ అడ్డుకోలేదని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.
బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అబ్దుల్ రషీద్ అన్సారీ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ పార్టీ ముస్లిముల విశ్వాసాన్ని పొందడానికి అహర్నిశలు ప్రయత్నిస్తోందని తెలిపారు.
కాశ్మీర్లో మిలిటెంట్లను మట్టుబెట్టామని ఎన్డీఏ ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ.. అదే ప్రాంతాన్ని హింసా రాజ్యంగా మార్చిన ఘనత కూడా అదే ప్రభుత్వానికి దక్కుతుందని జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.