Pawan Kalyan: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ద రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం మళ్లీ షూటింగులకు సిద్ధమౌతున్నారు. రాజకీయాలకు మరో బ్రేక్ ఇచ్చేశారు. పూర్తి వివరాలు మీ కోసం..
Pawan Kalyan on Alliance With TDP and BJP: తాను పదేళ్ల నుంచి రాజకీయంలో ఉన్నానన్న పవన్ కళ్యాణ్.. అందుకే తాను ముఖ్యమంత్రిగా చెయ్యడానికైనా సంసిద్దంగానే ఉన్నాను అని అన్నారు. వ్యక్తిగతంగా తనని ఎవరైనా తిడతాను అంటే పడతాను అని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తనను ఎవరేమన్నా అవేవీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తాను అని అన్నారు.
Nara Lokesh to contest From Mangalagiri: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను మంగళగిరి నుండే పోటీ చేస్తానన్న నారా లోకేష్.. భారీ మెజారిటీతో ఇక్కడ గెలిచి తీరుతాను అని ధీమా వ్యక్తంచేశారు. 2019 లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన నారా లోకేష్.. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేతిలో 6000 ఓట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
Manchu Vishnu Comments: ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీలో మరోసారి అధికారం ఎవరిదనే విషయంపై ఎవరి అంచనాలు వారికున్నాయి. ఎవరి విశ్లేషణలు వారు చేస్తున్నారు. అదే సమయంలో మా అధ్యక్షుడు, టాలీవుడ్ నటుడు మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే వరదు కళ్యాణి ఫైర్ అయ్యారు. ప్రజా కోర్టు నిర్వహిస్తామనడాన్ని తప్పుబట్టారు. ఏ అధికారంలో ప్రజా కోర్టు నిర్వహిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబును విచారించే ధైర్యం పవన్ కళ్యాణ్‌కు ఉందా..? అని ప్రశ్నించారు.
Pawan Kalyan In Independence Day Celebrations: జనసేన అధికారంలోకి వస్తే.. అక్రమాలు, అవినీతిపై సమాచారం అందించే వారికి గిఫ్ట్ స్కీమ్‌ను తీసుకువస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం.. జనసేన వీరమహిళతో సమావేశం అయ్యారు.
Pawan Kalyan comments on YS Jagan: అన్యాయాన్ని అరికట్టడానికే రాజకీయాల్లోకి వచ్చాను. జనసేన ఆశయం ఓడిపోలేదు. ఉత్తరాంధ్ర నుండే తాను పోరాటం నేర్చుకున్నానన్న పవన్ కళ్యాణ్.. 2024 ఎన్నికల్లో జనసేన జండా గాజువాకలో ఎగురుతుంది అని ధీమా వ్యక్తంచేశారు.
Pawan Kalyan On Volunteers: ఏపీలో వాలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్‌లా తయారయ్యారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇళ్లలోకి చొరబడి మరీ డేటాను సేకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. వాలంటీర్ వ్యవస్థ నేడు ప్రాణాలను కూడా తీస్తోందని అన్నారు.
Pawan Kalyan Visits Rushikonda: సీఎం జగన్‌కు ఎన్ని ఇళ్లు కావాలి అని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సర్క్యూట్ హౌస్ తాకట్టు పెట్టి ఇక్కడ ఇల్లు నిర్మిస్తాడా అని ముఖ్యమంత్రి జగన్‌ని పవన్ కళ్యాణ్ నిలదీశారు.
Pawan Kalyan's Speech From His Varahi Yatra in Visakhapatnam: ఏపీ సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరిగిన వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ, " జగన్‌కు డబ్బు అంటే పిచ్చి. విపరీతమైన పిచ్చి. సంపాదించిన దాన్ని ఏం చేసుకుంటారో కూడా తెలియని పిచ్చి. కరెన్సీను తాలింపు వేసి అన్నంగా కలుపుకొని తింటాడేమో తెలియదు కానీ.. దాన్ని సంపాదించేందుకు తన, మన అనే బేధం కూడా చూడడు. ఇప్పుడు ఆ పిచ్చే ఆంధ్ర ప్రజలను పట్టి పీడిస్తోంది " అని ఆవేదన వ్యక్తంచేశారు.
Pawan Kalyan About Vizag City: విశాఖపట్నంలో జరిగిన వారాహి యాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖతో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకుంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2019లో గొప్ప ఆశయం కోసం ప్రత్యక్ష ఎన్నికల్లో అడుగుపెట్టి, ఓటమిలో ఉన్న నాకు రాజకీయ పునరుజ్జీవం పోసింది విశాఖ నగరమే అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
Pawan Kalyan Links Jagan With Telangana: ఏపీ సీఎం జగన్ పేరును తెలంగాణ ఉద్యమంతో ముడిపెట్టిన పవన్ కళ్యాణ్.. జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను నేరాలకు అడ్డాగా మార్చారు. 30 వేల మంది ఆడపడుచులు కనిపించకుండా పోతే ఓ బాధ్యతగల ముఖ్యమంత్రి వారు ఏమయ్యారో తెలసుకునేందుకు కనీసం ఓ సమీక్ష నిర్వహించింది లేదని పవన్ మండిపడ్డారు.
Renu Desai Comments On Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అరుదైన వ్యక్తి అని.. ఆయన మనీ మైండెడ్ కాదని అన్నారు రేణూ దేశాయ్. రాజకీయంగా తన మద్దతు ఆయనకేనని అన్నారు. దయచేసి ఆయనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.
Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్- సాహో ఫేమ్ సుజిత్ కాంబోలో రాబోతున్న మూవీ ఓజీ. తాజాగా ఈ మూవీ నుంచి ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇది ఎలా ఉందంటే...
Pawan Kalyan Meeting with NRI Gulf Members: రాష్ట్రంలో అన్యాయం జరిగితే ఎవరికీ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక తరం కోసం తన చివరి శ్వాస వరకు రాజకీయాల్లో పనిచేస్తానని చెప్పారు. ఎన్ఆర్ఐ గల్ఫ్ సభ్యులతో ఆయన సమావేశం అయ్యారు.
Ambati Rambabu Slams Pawan Kalyan: బ్రో సినిమాలో సంబరాల శ్యాంబాబు పేరుతో ఒక కామెడి పాత్రను సృష్టించి ఆ పాత్రతో డాన్స్ చేయించడం ఎంత హాట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే. ఇది ఓ పబ్లిక్ ఈవెంట్లో డాన్స్ చేసిన ఏపీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించే చేశారు అనే వార్త వైరల్ అవడంతో తాజాగా స్వయంగా అంబటి రాంబాబు ఆ వివాదంపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ అండ్ టీమ్‌పై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Bro Movie: 'బ్రో' సక్సెస్ కావడంతో మూవీ టీమ్ అంతా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంది. ఈ సినిమా తొలి మూడు రోజుల్లో రూ.100 కోట్ల మార్కును అందుకుంది. దీంతో 'బ్రో' విజయోత్సవాలను చిత్రబృందం నిర్వహిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.